Ram Prasad : ‘చెప్పులతో కొడుతున్నారు’.. అభినవ్ గోమఠంతో గోడు వెల్లబోసుకున్న రామ్ ప్రసాద్.. ఏమైందంటే?

First Published | Feb 26, 2024, 7:30 PM IST

జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ (Ram Prasad)  బుల్లితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా తనకు ఎదురైన ఘటనను నటుడు అభినవ్ గోమఠంతో పంచుకున్నారు. 

Jabardasth Ram Prasad Interesting Comments with Abhinav Gomatam NSK

జబర్దస్త్ (Jabardasth)  కామెడీ షోతో ఎంతో మంది సెలబ్రెటీలుగా మారారు. ముఖ్యంగా రియాలిటీ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ లోని రామ్ ప్రసాద్ గురించి బుల్లితెర ఆడియెన్స్ కు తెలిసిందే. 

Jabardasth Ram Prasad Interesting Comments with Abhinav Gomatam NSK

రామ్ ప్రసాద్ జబర్దస్త్ కామెడీ షోలో తనదైన ముద్ర వేసుకున్నారు. షో మొత్తంలోనే ఆటో పంచులను పరిచయం చేసి స్కిట్లను కొత్త దారిలో నడిపించారు. ఆడియెన్స్ ను తనదైన శైలిలో అలరించారు.


ప్రస్తుతం బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు ఆయా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇప్పటికే హీరోలుగా సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారు. ఇక రామ్ ప్రసాద్ మాత్రం బుల్లితెరపైనే అలరిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఎక్ట్స్రా జబర్దస్త్ (Extra Jabardasth Latest Promo) నుంచి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో రామ్ ప్రసాద్ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. తను బయటికి వస్తే చెప్పులతో కొడుతున్నారంటూ... తన గోడును వెల్లబోసుకున్నారు. 

‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ (Masth Shades Unnai Ra) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభినవ్ గోమఠం (Abhinav Gomatam)  ఎక్ట్ర్సా జబర్దస్త్ షోకు ప్రమోషన్ నిమిత్తం వచ్చారు. 

ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ స్కిట్ లో భాగంగా ఇలాంటి కామెంట్లు చేశాడని తెలుస్తోంది. ‘తను ప్రమోషన్స్ కోసం బయటికి వెళ్తే చెప్పులు విసురుతున్నారం’టూ డైలాగ్ చెప్పారు. రామ్ ప్రసాద్ తనమీదే ఇలాంటి డైలాగ్ వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. 

Latest Videos

click me!