Anasuya Bharadwaj : చీరకట్టి పబ్లిక్ లోకి వచ్చిన అనసూయ... రంగమ్మత్తను చూసి ఎగబడ్డ జనం.. ఎక్కడంటే?

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. తాజాగా  పబ్లిల్ లోకి వచ్చిన రంగమ్మత్త కోసం ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. 
 

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా తనదైన ముద్ర వేసుకుంది యాంకర్ అనసూయ (Anasuya) .  ‘జబర్దస్త్’ షోతో ఈ ముద్దుగుమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బ్యూటీఫుల్ లుక్స్ తో మెరియడంతో పాటు తన యాంకరింగ్ తో అలరించింది.
 

అనసూయ యాంకర్ గా అలరించే తీరుకు బుల్లితెరకు కొత్త రంగు వచ్చింది. టీవీ ఆడియెన్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. కేవలం యాంకర్ గానే ఉండిపోక తన ప్రతిభను చాటుకుంది. 
 


అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ బుల్లితెరపై అందాలను ఒళకబోయడమే కాకుండా తనలోని డాన్స్ స్కిల్స్, నటనను కూడా ప్రదర్శించింది. అలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం నటిగానే అలరిస్తోంది. 

ఇదిలా ఉంటే... అనసూయ తాజాగా విజయనగరంలో పబ్లిక్ అపీయరెన్స్ ఇచ్చింది. నగరంలోని శృంగవరపుకోట ప్రాంతంలో ఆదిలక్ష్మి అనే సిల్క్స్ స్టోర్ ను తాజాగా ప్రారంభించింది. 

ఈ సందర్భంగా అనసూయ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసింది. తన అందంతో, చీరకట్టులో ఆకట్టుకుంది. స్టోర్ ను ప్రమోట్ చేస్తూ మాట్లాడింది. అలాగే తన అభిమానులతో ముచ్చటించింది. 

అనసూయ అక్కడికి వచ్చిందని తెలిసి అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నటితో సెల్ఫీ దిగేందుకు ఫోన్లతో ఎగబడ్డారు. అక్కడే ఉన్న బౌన్లర్లు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేశారు. 

నిజానికి యాంకర్ కు ఇంతలా క్రేజ్ ఉండటం చాలా ఆసక్తికరమనే చెప్పాలి. అనసూయ తనదైన శైలిలో బుల్లితెర, వెండితెరపై ఏలుతూ నిజమైన అభిమానులనూ సంపాదించుకుంటోంది. 
 

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ లుక్ ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇక అనసూయ నటించిన ‘రజాకార్’ చిత్రంతో రేపు విడుదల కానుంది. ‘పుష్ప2’ ఈ ఏడాది 2024 ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. 
 

Latest Videos

click me!