Guppedantha Manasu 9th February Episode:చావడానికి రెడీ అయిన మహేంద్ర, కొత్త హీరో గురించి రాజీవ్ ఆరా..!

First Published Feb 9, 2024, 8:40 AM IST

నేను ఎవరి కోసం బతికి ఉండాలి.. ఇక్కడ నాకు ఎవరు ఉన్నారు అని అంటాడు. అప్పుడు అనుపమ.. వసుధార కోసం బతికి ఉండాలి అని చెబుతుంది. దీంతో మహేంద్ర ఆగిపోతాడు.

Guppedantha Manasu

Guppedantha Manasu 9th February Episode:మహేంద్ర ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నాన్న రిషి నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా.. నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాడివి.. ఇప్పుడు మాకు అందనంత దూరం వెళ్లిపోయావా అంటూ ఏడుస్తాడు. ఆ బాధలోనే మందు సీసా తీసుకొని తాగబోతాడు. కానీ.. అప్పుడే అనుపమ వచ్చి ఆపేస్తుంది. మహేంద్రా,.. మళ్లీ మందు తాగుతున్నావా అని అడుగుతుంది.

Guppedantha Manasu

దానికి మహేంద్ర తన బాధ మొత్తం చెబుతాడు. తన కొడుకు రిషి ఇక లేడు అనే బాధ తనకు కష్టంగా ఉందని చెబుతాడు. రిషి ఒక్క పూట కనిపించకపోయినా.. వాడు తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉండేవాడినని చెబుతాడు. చిన్న తనంలో జగతి మమ్మల్ని వదిలి వెళ్లినప్పుడు రిషి తనకు అండగా నిలపడ్డాడు అని, రిషి తన ప్రేమకు ప్రతి రూపం అని.. వాడు బంగారం అని.. అలాంటి రిషి  ఇప్పుడు లేడని.. తన బుర్ర బద్దలైపోతోందని.. అందుకే మందు తాగడమే తన ముందు ఉన్న పరిష్కారం అని చెబుతాడు.

Latest Videos


Guppedantha Manasu


దానికి అనుపమ తిడుతుంది. అందుకని మళ్లీ మందు తాగుతావా అని అడుగుతుంది. నా కొడుకు లేడు అనే సరికి నాకు పిచ్చెక్కిపోతోంది అని మహేంద్ర అంటాడు. ఈ సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి అని అనుపమ అంటే.. ఎవరి కోసం ఉండాలి అంటాడు. జగతి నన్ను మధ్యలో వదిలేసి వెళ్లిపోయిందని.. ఇప్పుడు నా కొడుకు కూడా లేడని అంటాడు. తన కొడుక్కి వాళ్ల అమ్మ అంటే ప్రాణం అని అందుకే.,.. వాళ్ల అమ్మ దగ్గరికే వెళ్లిపోయాడు. నేను కూడా వాళ్ల దగ్గరికే వెళ్లాలి.. నేను చనిపోవాలి అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu

చెట్టుకు తన తల బాదుకుంటూ ఉంటాడు. అనుపమ ఆపుతుున్నా వినిపించుకోడు. తల బాదుకుంటూనే ఉంటాడు. తాను కూడా చచ్చిపోతాను అని.. తన కొడుకు దగ్గరకు వెళ్లిపోతానని.. తన కొడుకు దగ్గరకు వెళతాను అని అంటాడు. కానీ.. అనుపమ.. ఇక్కడ నీ అవసరం ఉందని,  నువ్వు బతికే ఉండాలి అని చెబుతుంది. అప్పుడు మహేంద్ర.. నేను ఎవరి కోసం బతికి ఉండాలి.. ఇక్కడ నాకు ఎవరు ఉన్నారు అని అంటాడు. అప్పుడు అనుపమ.. వసుధార కోసం బతికి ఉండాలి అని చెబుతుంది. దీంతో మహేంద్ర ఆగిపోతాడు.

Guppedantha Manasu

వసుధారకు నువ్వే తోడుగా ఉండాలని, వసుధారకు ధైర్యంగా ఉండాలని అంటుంది. ఇప్పటికే వసుధార. రిషి చనిపోయాడు అనే నిజాన్ని కూడా నమ్మడం లేదు.. సర్ బతికే ఉన్నారని, కనీసం ఫోటోకి దండ కూడా వేయనివ్వడం లేదు నువ్వు కూడా చూశావ్ కదా అని అనుపమ గుర్తు చేస్తుంది. అవును అని మహేంద్ర అంటాడు. వసుధార ఎన్నో అడ్డంకులను ఎదురించి రిషిని పెళ్లి చేసుకుంది. కానీ.. ఇప్పుడు రిషి దూరమైన బాధలో ఉంది.. ఇప్పుడు మనం తోడుగా ఉండాలి అని, నువ్వు ఇలా మందు తాగుతా, చచ్చిపోతా అంటే ఎలా అని బుద్ది చెబుతుంది. ఇంట్లో వసుధార ఒక్కతే ఉంటుంది.. పద వెళ్దాం అని.. మహేంద్రను ఇంటికి తీసుకువెళ్తుంది.

Guppedantha Manasu

ఈలోగా.. ఇంట్లో వసుధార, చక్రపాణి చాలా దిగులుగా కూర్చొని ఉంటారు. తన కూతురి జీవితం ఇలా అయ్యిందే అని చక్రపాణి ఫీలౌతూ ఉంటాడు. వసు కూడా డల్ గా ఉంటుంది. అప్పుడే రాజీవ్ వస్తాడు. చేతిలో ఓ పూల దండ కూడా ఉంటుంది. రాజీవ్.. వసు అనుకుంటూ లోపలికి వస్తాడు. అతన్ని చూసి చక్రపాణికి కోపం వస్తుంది.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రా అని అరుస్తాడు.

Guppedantha Manasu

అప్పుడు మిమ్మల్ని కలవాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను మామయ్య.. ఇప్పుడు కుదిరింది అంటాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావ్ అని చక్రపాణి సీరియస్ అవుతాడు. దానికి రాజీవ్.. అదేంటి మామయ్య అలా అంటారు.. నీ మీ ముద్దుల అల్లుడిని.. నా వసు కి ముద్దుల బావని.. మరోసారి మీకు అల్లుడు కాబోతున్నవాడిని అని అంటాడు. ఆ మాటకు చక్రపాణి షాకౌతాడు. తర్వాత రాజీవ్.. రిషి చనిపోయాడు అంట కదా.. అందుకే.. ఏది రిషి ఫోటో..? చనిపోయిన వారి ఫోటోకి దండ వేసి దీపం పెడతారు కదా.. ఏది రిషి ఫోటో అని వెతుకుతూ ఉంటాడు. ఆ మాట విని రిషి ఫైర్ అవుతుంది. రిషి సర్ చనిపోయారు అనొద్దు అని చెప్పాను కదా అని అంటుంది. రిషి సర్ బతికే ఉన్నారు.. ఎక్కడో క్షేమంగా ఉన్నారు అని అంటుంది. దానికి రాజీవ్ అవునా.. ఏది పిలువు.. మీ రిషి సర్ ని ఒకసారి పిలిస్తే.. ఈ దండ ఇచ్చి సన్మానం చేసి వెళతాను, అదే రాకపోతే.. మీ రిషి సర్ ఫోటో కి దండ వేసి ఆత్మ శాంతించాలి అని కోరుకుంటాను అని అంటాడు.

Guppedantha Manasu

ఆమాటకు వసుకి కోపం వస్తుంది. పళ్లు రాలిపోతాయ్ అని చెబుతుంది. దానికి రాజీవ్.. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా నా మనసుకు చాలా హాయిగా ఉంటుంది అంటాడు. ఆ మాటకు చక్రపాణి కి కోపం వస్తుంది. అంతకముందు తన కూతురిని కష్టపెట్టావని.. ఇప్పుడు మాటలతో హింసిస్తున్నావ్ అని అంటాడు. రాజీవ్ మాత్రం.. తాను కష్టపెట్డడం లేదని  తన ప్రేమను వ్యక్త పరుస్తున్నాను అంటాడు. చక్రపాణి కొట్టబోతుంటే.. నేను మీ కూతురుతో మాట్లాడాలి అని అంటాడు.

Guppedantha Manasu

తర్వాత.. కొత్త హీరో  గురించి రాజీవ్ అడుగుతాడు. నిన్ను కాపాడిన వాడు ఇక్కడ లేడేంటి అని అడుగుతాడు. అసలు వాడెవడు అని అంటాడు. దానికి వసు తనకు తెలీదని చెబుతుంది. ముక్కు ముఖం లేనివాళ్లు కూడా నీకు సహాయం చేస్తున్నారా అని సెటైర్ వేస్తాడు. రిషి సర్ చనిపోయాడని నువ్వేమీ బాధపడకు.. నీకు నేను ఉన్నాను, అయినా రిషి సర్ లేరు కదా.. అయినా నవ్వు ఇక్కడే ఉంటావేంటి..? నాతో వచ్చేయ్ అని వసు చెయ్యి పట్టుకొని లాక్కెళతాడు. అయితే.. చక్రపాణి అడ్డుపడతాడు. నీ అంత నిక్రుష్టుడిని నేను చూడలేదంటాడు. అయితే.. రాజీవ్.. అంతకముందు నన్ను పొగిడేవాడివని.. ఇప్పుడు తిడతావేంటి మామయ్య అంటాడు. చక్రపాణి మాత్రం.. ఫుల్ ఫైర్ అవుతాడు. నిన్ను చంపేసి జైలుకు వెళతాను అంటాడు.

Guppedantha Manasu

దానికి కూడా రాజీవ్.. నాకు ఏదైనా అయితే వసు ఒంటరిది అయిపోతుందని, ఇప్పుడు వసుకి నా అవసరం ఉంది అని అంటాడు. తల్లిని కోల్పోయిందని, దేవతలాంటి జగతి మేడమ్ ని కోల్పోయిందని.. ఇప్పుడు ప్రాణం లాంటి రిషి సర్ ని కూడా దూరం చేసుకుందని.. ఇప్పుడు తాను కూడా దూరమైతే వసు ఒంటరి అయిపోతుంది అని అంటాడు.  వసు, చక్రపాణి ఎంత చీదరించుకున్నా... తిట్టినా కూడా రాజీవ్ దానిని తనకు పాజిటివ్ గా మార్చుకుంటూ మాట్లాడతాడు.

Guppedantha Manasu

తర్వాత రిషి ఫోటో కనిపడుతుంది. దండ లేకపోతే బోసిగా ఉందని.. ఈ దండ వేస్తే ఫోటో నిండుగా ఉంటుందని వేయబోతాడు. అయితే.. వసు దండ తీసి విసిరికొడుతుంది.  తర్వాత ఇక్కడి నుంచి వెళ్లకుంటే పోలీసులకు ఫోన్ చేస్తాను అని బెదిరిస్తుంది. పోలీసుల మాట ఎత్తడంతో.. కాస్త భయపడినట్లున్నాడు. వెళ్లిపోతాను లే అంటాడు. వెళ్లి.. మళ్లీ వస్తాను అని అంటాడు.

అయితే.. రాజీవ్ నిన్ను అంతకముందే కలిశాడా అని చక్రపాణి అడుగుతాడు. రిషి సర్ కోసం వెతుకుతూ వెళ్లినప్పుడు వచ్చాడని.. జరిగింది మొత్తం చెబుతుంది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చక్రపాణి అంటే.. మీరు బాధపడతారని చెప్పలేదు అని వసు అంటుంది..

Guppedantha Manasu

కాసేపటికి మహేంద్ర, అనుపమ ఇంటికి చేరుకుంటారు. వసు నీరసంగా కూర్చొని ఉంటుంది. వసుధార ఏమీ తినలేదు అనుకుంట అని అనుపమ అంటుంది. వసుధారను భోజనానికి తీసుకురమ్మని మహేంద్రకు చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!