Anasuya : ‘రాజుల కాలం కాదు... లేకపోతే ఏ రాజో వచ్చి’.. అనసూయ లుక్ పై కామెంట్లు!

First Published | Feb 8, 2024, 6:45 PM IST

జబర్దస్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లై, ఇద్దరు పిల్లలున్నా ట్రెండీగా దర్శనమివ్వడంతో నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. ఫొటోలపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 
 

టీవీ ఆడియెన్స్ కు యాంకర్ అనసూయ భరద్వాజ్ Anasuya గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో Jabardasth  Comedy Show ద్వారా బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 

తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగింది. యాంకరింగ్ తోనే కాకుండా తన అందంతోనూ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఒకానొక దశలో హాట్ యాంకర్ గా ముద్రవేసుకుంది. అప్పట్లో ఆమె దుస్తులపై బాగా ట్రోల్స్ ఎదురుకుంది. 


అలాగే అనసూయ కాంట్రవర్సీ కామెంట్లు, కొన్ని వివాదాస్పదమైన పోస్టులతోనే ట్రోల్స్ కు గురవుతుంటారు. దీంతో ఎప్పుడు అనసూయ వర్సెస్ ట్రోలర్స్ అన్నట్టుగా ఉంటుంది. ఇక ఆమెను అభిమానించే వారు కూడా ఉన్నారు. 

యాంకర్ నుంచి నటిగా అనసూయ ఎదుగుతున్న తీరునూ ప్రశంసిస్తూ వస్తున్నారు. దీంతో రంగమ్మత్త  కూడా తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో మైమరిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ట్రెండీ వేర్ లో మెరిసింది. 

పెళ్లై, ఇద్దరు కొడుకులు ఉన్నా.. అనసూయ మరీ యంగ్ లుక్ లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రెండీ వేర్స్ ధరిస్తూ ఆకట్టుకునేలా ఫొటోషూట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నా.. పలువురు నెటిజన్లు మాత్రం ఆమె లుక్ పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 

లేటెస్ట్ లుక్ పై నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు... ‘రాజుల కాలం కాదు రథం గుర్రం లేవు కాబట్టి బతికిపోనవ్..లేకపోతే ఏ రాజో ఎత్తికొనిపోయేటోడు.. నీకోసం ఇంకో తాజ్ మహల్ ఉండేదేమో’ అంటూ ఓవైపు పొగుడుతూనే.. మరోవైపు తన డ్రెసింగ్ పై చురకలు అంటిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక నెక్ట్స్ అనసూయ ‘రజాకార్’, ‘పుష్ప2’ చిత్రాలతో అలరించబోతోంది. 

Latest Videos

click me!