BrahmaMudi 8th February Episode: మళ్లీ శోభనం ఆపేసిన అనామిక, లక్ష్యం వైపు అప్పూ..!

First Published | Feb 8, 2024, 10:42 AM IST

ఇక రాజ్ శ్వేతను స్వీటీ అని పిలుస్తూ.. చాలా ఓవర్ చేస్తాడు. తిన్నావా..? నా మీద బెంగతో తినలేదా..? తినకపోతే ఎలా అని మాట్లాడుతూ ఉంటాడు. కావ్యకు మండిపోతూ ఉంటుంది.

Brahmamudi

BrahmaMudi 8th February Episode:మరోసారి కళ్యాణ్ కి శోభనం ఏర్పాట్లు చేస్తారు. కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. తన గదిని తానే స్వయంగా అందంగా అలంకరించుకుంటూ ఉంటాడు. అప్పుడే అనామిక ఎంట్రీ ఇస్తుంది. కళ్యాణ్ చాలా ఆశలు పెట్టుకుంటాడు. కానీ.. వాటిని నిరాశలుగా మార్చేస్తుంది. తనకు పీరియడ్స్ అని అబద్దం చెబుతుంది. అదేంటి.. నీకు ముందు తెలీదా అని కళ్యాణ్ అంటే.. తొందరగా వచ్చాయి అని చెబుతుంది. ఇక.. కళ్యాణ్ బయటకు వెళ్లి పడుకుందాం అనుకుంటాడు. అయితే.. బయటకు వెళ్లి పడుకుంటే రెండోసారి కూడా శోభనం ఆగిపోయిందని ఇంట్లో వాళ్లు తెలిస్తే.. అశుభం అనుకుంటారు అని ఇక్కడే పడుకోమని చెబుతుంది. ఇక చేసేది లేక.. కళ్యాణ్ అక్కడే.. కింద పడుకుంటాడు. కళ్యాణ్ పడుకున్న తర్వాత.. అనామిక మనసులో.. నిన్ను కావాలనే దూరం పెట్టి... నేనే కావాలి అనేలా చేసి...నిన్ను ఆఫీసుకు రాజును చేసి.. నేను ఇంటికి మహారాణి అవ్వాలి అని అనుకుంటుంది.

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. రాజ్ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కావాలని కావ్య పైకి రావడం చూసి.. అప్పుడే శ్వేతకు ల్యాప్ టాప్ నుంచి వీడియో కాల్ చేస్తాడు. కావ్య వస్తోందని.. కావాలని డ్రామా చేద్దాం అంటాడు. నీకు సరదాగా ఉందేమో కానీ...నాకు చిరాకుగా ఉంది అని శ్వేత అంటుంది. అయితే నువ్వు ఏమీ మాట్లాడొద్దని.. జస్ట్ అవును , కాదు అని సమాధనాలు చెప్పు చాలు అని అంటాడు. చేసేది లేక.. శ్వేత సరే అంటుంది. ఇక రాజ్ శ్వేతను స్వీటీ అని పిలుస్తూ.. చాలా ఓవర్ చేస్తాడు. తిన్నావా..? నా మీద బెంగతో తినలేదా..? తినకపోతే ఎలా అని మాట్లాడుతూ ఉంటాడు. కావ్యకు మండిపోతూ ఉంటుంది.


Brahmamudi

కావాలని.. ఆ ల్యాప్ టాప్ కి అడ్డువస్తూ అటూ ఇటు నడుస్తూ ఉంటుంది. శ్వేతను వినిపించాలనే తిడుతుంది కూడా. కావ్య తనను అలా తప్పుగా అర్థం చేసుకోవడం చూసి శ్వేతకు చాలా బాధేస్తుంది. అయినా రాజ్ పట్టించుకోడు. ఇక చిరాకు పుట్టిన కావ్య.. లైట్ ఆఫ్ చేస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే లైట్ ఎందుకు ఆఫ్ చేశావ్ అని రాజ్ అడుగుతాడు. నాకు లైట్ ఉంటే నిద్రపట్టదు అని కావ్య అంటుంది. అయితే.. దానికి రాజ్.. నువ్వు పక్కన ఉంటే నాకు మాట్లాడాలనే మూడే రావడం లేదు అని... శ్వేతకు బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు.

Brahmamudi

తర్వాత.. నన్ను ఏడిపించడమే నీ పని కదా అని కావ్యను అడుగుతాడు. దానికి కావ్య.. ఆ పని చేస్తున్నది మీరు  అని.. కావాలని వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు కదా అంటుంది. నేను ఆ టైప్ కాదు అని రాజ్ అంటే.. తాను కూడా ఏడ్చేటైప్ కాదు అని.. పక్కకు తిరిగి పడుకుంటుంది. రేపు నీకు ఇంకా క్లారిటీ వస్తుందిలే.. అప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్ గా ఉండు అప్పుడు చూస్తాను అని రాజ్ అనుకుంటాడు. ఇటు తిరిగి కావ్య ఏడుస్తుంది.

Brahmamudi

మరుసటిరోజు ఉదయం ఇంట్లో అప్పూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తాను పోలీసు  అవ్వాలనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోగా మూర్తి , కనకం అక్కడకు వచ్చి.. అప్పూ పక్కన కూర్చుంటారు. వెంటనే కనకం మళ్లీ పెళ్లి టాపిక్ తీసుకువస్తుంది. ఆ పెళ్లి వద్దు అనడానికి కారణం చెప్పమని అడుగుతుంది. పోలీసు అవ్వాలని నిన్ననే చెప్పాను కదా అని అప్పూ అంటుంది.

Brahmamudi

ఆ తర్వాత.. తాను డెలివరీ కి వెళ్లినప్పుడు జరిగిన విషయాన్ని చెబుతుంది. అప్పటి వరకు తనకు ఓ గమ్యం లేదని.. ఆ సంఘటన చూసిన తర్వాత తనకు పోలీసు అవ్వాలని అనిపించిందని చెబుతుంది. మూర్తి కూతురికి మద్దతు ఇస్తాడు. అయితే... పోలీసు అవ్వడం కోసం తాను జాబ్ మానేయాల్సి వస్తుందని, భారంగా మారతాను అని అప్పూ చెబుతుంది. కానీ... నీకు నచ్చింది చేయమని మూర్తి సపోర్ట్ చేస్తాడు. కనకం కూడా అప్పు తెచ్చి అయినా నీకు సపోర్ట్ చేస్తాం అంటుంది. కనకం అప్పు అనగానే మూర్తి భయపడతాడు. అది చూసి అప్పూ నవ్వుకుంటుంది.

Brahmamudi

ఇక...తెల్లారేసరికి అనామిక లేచి.. కళ్యాణ్ ని నిద్ర పట్టిందా అని అడుగుతుంది. అసలు నిద్రే పట్టలేదు అని చెబుతాడు. తర్వాత కళ్యాణ్ చిరాకుపడతాడు. బయటకు వెళ్లిపోతుంటే అనామిక ఆపేస్తుంది. ఇలా బయటకు వెళితే దొరికిపోతాం అని.. కళ్యాన్.. దుస్తులు చెరిపేస్తుంది. తన కాటుక, లిప్ స్టిక్  కళ్యాణ్ దుస్తులకు అంటేలా చేస్తుంది.  శోభనం జరగలేదని నువ్వు చెప్పినా.. ఎవరూ నమ్మరు అని చెప్పి బయటకు పంపుతుంది.

కళ్యాణ్ వెళ్లిన తర్వాత.. నువ్వు నాకు పూర్తిగా సొంతం అయ్యే వరకు.. నేను నీకు సొంతం అయ్యే ప్రసక్తే లేదు మిస్టర్ కవి.. ఇంటి పగ్గాలు నాకు, ఆఫీసు పగ్గాలు నీకు దక్కే వరకు నువ్వు ఇంతే.. నేను ఇంతే అని అనుకుంటుంది.

ఇక కళ్యాణ్ కిందకు దిగి వస్తుంటే.. ఇంట్లో వాళ్లు  కామెడీ చేస్తూ ఉంటారు. శోభనం గురించి ఇలానే బయటకు వస్తారా.. పో లోపలికి.. ఫ్రెష్ అయ్యి మంచి బట్టలు వేసుకొని రమ్మని సుభాష్ సీరియస్ అవుతాడు. ఇక.. కళ్యాణ్ చేసేది లేక.. నిజం చెప్పలేక లోపలికి వెళ్లిపోతాడు. వీళ్లు మాత్రం కళ్యాన్ ని చూసి నవ్వుకుంటారు. కొడుకును అలా చూసిన ధాన్యలక్ష్మి  శోభనం జరిగిందని అనుకొని నవ్వుకుంటుంది. ఇద్దరినీ స్నానం చేసి వస్తే.. టిఫిన్ పెడతాను అని ధాన్యలక్ష్మి అంటుంది. అందరూ తమను నమ్మినందుకు అనామిక ప్లాన్ సక్సెస్ అయ్యిందని అనుకుంటుంది.
 

Brahmamudi

ఇక. అప్పూ పోలీసు అయ్యేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఉదయాన్నే రన్నింగ్ చేయడం మొదలుపెడుతుంది. అలసిపోయి ఓ బెంచి మీద కూర్చుంటుంది. పక్కనే ఓ పెద్దాయన ఉంటాడు. ఆయన నడుస్తూ పడిపోతుంటే..అప్పూ పట్టుకుంటుంది. డ్రాప్ చేయనా అని అప్పూ అడుగుతుంది. రోడ్డు మీద   యాక్సిడెంట్ అయినా చాలా మంది పట్టించుకోవడం లేదని నవ్వు గ్రేట్ అంటాడు. తర్వాత మాటల మధ్యలో తాను పోలీసు అవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఆయన మెచ్చుకుంటాడు. ఒకవేళ అతనే అప్పూకి సహాయం చేసే అవకాశం ఉండొచ్చు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగప్ లో.. కావ్యను ఆఫీసుకు వెళ్లడానికి పంపడమే కాకుండా.. ఇంట్లో పెత్తనం, అధికారం కూడా కావ్యకు అప్పగించాలని అపర్ణ అనుకుంటుంది. అది చూసి ధాన్యలక్ష్మి, అనామిక ఫేస్ లు మాడిపోతాయి.
 

Latest Videos

click me!