Guppedantha Manasu
Guppedantha Manasu 26th February Episode: వసుధారను పిచ్చిదాన్ని చేసి, తన నుంచి ఎండీ సీటు లాగేసుకోవాలని శైలేంద్ర, దేవయాణి ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రిషి కర్మకాండలు చేయించాలని అనుకుంటారు. అది చూసి వసుధారకు కోపం వచ్చి.. పిచ్చిదానిలా అరుస్తుందని.. అప్పుడు అందరి ముందు వసు కి నిజంగానే పిచ్చి పట్టిందని నమ్మించవచ్చు అని శైలేంద్ర అనుకుంటాడు. దీనిలో భాగంగానే మహేంద్రను ఫణీంద్ర ద్వారా ఇంటికి రప్పిస్తారు. ఇంటికి వచ్చిన మహేంద్రతో ఫణీంద్ర అదే విషయం చెబుతాడు. ఆ మాటలకు మహేంద్ర బాధపడినట్లుగా అనిపిస్తాడు.
Guppedantha Manasu
దీంతో ఫణీంద్ర వెంటనే.. తాను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతాడు. లేదన్నయ... నువ్వు ఎప్పుడూ తప్పుగా మాట్లాడవు. మన ఇంట్లోకి ఏదో దుష్ట శక్తి ప్రవేశించి మన కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తోందని బాధపడుతన్నాను అని మహేంద్ర అంటాడు. తర్వాత దేవయాణి, శైలేంద్ర ఓవర్ యాక్షన్ చేస్తారు. చిన్న వయసులోనే మన రిషి మనకు దూరమయ్యాడు అని దేవయాణి అంటే.. మొదట పిన్ని దూరమైందని తర్వాత.. తనకు ప్రియాతి ప్రియమైన తమ్ముడు రిషి కూడా దూరమయ్యాడు అని శైలేంద్ర ఓవర్ డైలాగులు కొడతతాడు. అవి విని మహేంద్రకు కోపం వస్తుంది. ఇక కర్మకాండల విషయం గురించి మరోసారి ఫణీంద్ర అడుగుతాడు. అయితే.. అవి జరిపించడం తనకు ఇష్టం లేదని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఎందుకు అని ఫణీంద్ర అడిగితే.. రిషి చనిపోయాడు అంటేనే వసుధార ఒప్పుకోవడం లేదని.. ఇప్పుడు ఈ కర్మకాండలు చేస్తానంటే అస్సలు అంగీకరించదని, అరిచి గోల చేస్తుందని వద్దంటాడు. అయితే... మహేంద్రను ఒప్పించడానికి ఫణీంద్ర, దేవయాణి ప్రయత్నిస్తూ ఉంటారు. వసుకి.. రిషి అంటే పిచ్చి ప్రేమ అని.. తనకు నమ్మడం కష్టంగానే ఉంటుందని, తనకు అర్థమయ్యేలా చెప్పాలి అని మహేంద్రను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. అయితే.. చాలాసార్లు చెప్పి చూసినా వసు నమ్మడం లేదని.. రిషి కచ్చితంగా తిరిగి వస్తాడనే నమ్మకంతోనే ఉంది అని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
రిషి లేడు అనే విషయం నువ్వు నమ్ముతున్నావా అని దేవయాణి అడుగుతుంది. ఫణీంద్ర కూడా సమాధానం చెప్పమంటాడు. అయితే.. తాను చాలా సార్లు చక్ చేసుకున్నానని, డీఎన్ఏ టెస్టు కూడా చేశారని.. అది రిషి బాడీనే అని మహేంద్ర చెబుతాడు. మరి ఇంకెందుకు.. కర్మకాండలు చేద్దాం అని ఫణీంద్ర అంటే.. తనకు రిషి ఆత్మ శాంతపరచడం ఎంత ముఖ్యమో..వసుని జాగ్రత్తగా చూసుకోవడం కూడా తనకు అంతే ముఖ్యం అని మహేంద్ర అంటాడు. వసుధార నమ్మిన తర్వాతే.. ఈ కార్యక్రమాలు చేద్దాం అని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఇలా అయితే..తమ ప్లాన్ రివర్స్ అవుతుందని శైలేంద్రలో భయం మొదలౌతుంది. వెంటనే వాళ్ల అమ్మ దేవయాణికి సైగ చేస్తాడు. దీంతో దేవయాణి రెచ్చిపోతుంది. రిషికి కర్మకాండలు చేయకపోతే ఇంటికి అరిష్టం అదీ ఇదీ అంటుంది. దేవయాణిని ఆగమని ఫణీంద్ర అరుస్తాడు. తర్వాత.. మహేంద్రకు చెబుతాడు. నువ్వు రిషికి కర్మకాండలు చేయకపోతే.. పెదనాన్నగా నాన్న స్థానంలో నిలపడి నేనే చేస్తాను అని చెబుతాడు. రేపే ఈ కార్యక్రమం జరగాలని, ఇది తన ఆర్డర్ అని చెబుతాడు. ఇక అన్నమాటకు ఎదురుచెప్పలేక మహేంద్ర సరే అంటాడు. తాను వస్తానని చెబుతాడు. వసుధారకు తెలీకుండా ఈ కార్యక్రమం జరిపించాలని అనుకుంటారు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. శైలేంద్ర ఏదైనా కుట్ర చేస్తున్నాడా..? మహేంద్ర మామయ్యను ఫణీంద్ర సర్ ఎందుకు రమ్మన్నారు అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అటెండర్ వచ్చి.. ఫైల్ ఇచ్చి సంతకం పెట్టమని చెబుతాడు. మీరు సంతకం పెట్టిన తర్వాత మను సర్ సంతకం పెడతాను అన్నారు అని అటెండర్ చెబుతాడు. ఆ మాటకు వసు కి ఇగో హర్ట్ అవుతుంది. ఎండీ తనే అని.. తనదే చివరి సంతకం కావాలని.. మను ది కాదని.. తెగ సీరియస్ అవుతుంది. సీరియస్ గా మను క్యాబిన్ కి వెళ్లి.. నా గురించి ఏమనుకుంటున్నావ్.. ఎండీ అయిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతుంది.
Guppedantha Manasu
అయితే.. మను మాత్రం తనకు ఆ ఆశలు లేవని, రాములవారి పల్లకి మోయడం లాగా తాను బోర్డు మెంబర్ పదవిని భావిస్తానని.. కేవలం తనకు కాలేజీ మీద బాధ్యత మాత్రమే ఉందని చెబుతాడు. మీరు సంతకం చేసిన తర్వాత అయితే ఎలాంటి సమస్య లేకుండా ఆ ఫైల్ పై సంతకం చేయవచ్చని తాను అనుకున్నాను అని చెబుతాడు. వసుధార వినిపించుకోదు. ప్రశాంతంగా ఆలోచించమని.. చివరకు మీకే అర్థమౌతుందని చెబుతాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే. రిషి కర్మకాండల విషయంలో శైలేంద్ర కుట్రను ధరణి పసిగట్టేస్తుంది. వసు రచ్చ చేసి ఎండీ పదవి దూరం చేసుకోవడం ఖాయమని.. అందుకే ఇలా చేస్తున్నారని.. ఈ విషయం వసుధారకు ముందే చెప్పాలని ఫోన్ ఛేయబోతుంది. అయితే.. అది శైలేంద్ర చూసేసి.. ధరణి దగ్గర ఫోన్ లాగేసుకుంటాడు. ఈ ఒక్కరోజు ఆగితే తాను డీబీఎస్టీ కాలేజీ ఎండీ అవుతానని.. నువ్వు రాణి అవుతావు అని కూడా చెబుతాడు. వసుధారకు ధరని ఈ విషయం తెలియనివ్వకుండా.. అన్ని జాగ్రత్తలు చూసుకోమని తల్లికి చెబుతాడు.
Guppedantha Manasu
ఇక మహేంద్ర కాలేజీకి వెళ్లిపోతాడు. ఎందుకు ఫణీంద్ర సర్ రమ్మన్నారు అని... ఓవైపు అనుపమ, మరోవైపు వసుధార అడుగుతూ ఉంటారు. ఈ విషయం చెబితే.. నువ్వు బాధపడతావమ్మా అని మనసులో అనుకొని.. అన్నయ్య ఆరోగ్యం గురించి మాట్లాడటానికి పిలిచారు అని అబద్ధం చెబుతాడు. అయితే.. దాని కోసం మీ ఒక్కరినే ఎందుకు రమ్మన్నారు అని వసు అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.