Guppedantha Manasu
Guppedantha Manasu 23rd march Episode: మా అత్తయ్యను మా ఇంటికి తీసుకొని వెళ్తాను అంటే.. మీరు వద్దు అన్నారు అని ఏంజెల్ బుంగమూతి పెడుతుంది. అయితే.. రిషికి బాలేనప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడు కదా.. ఇప్పుడు మీ అత్తయ్యను మా ఇంట్లో ఉండనివ్వు అని మహేంద్ర అంటాడు. తర్వాత.. అనుపమ ట్యాబ్లెట్స్ వేసుకునే టైమ్ అయ్యిందని మహేంద్ర అంటే.. ట్యాబ్లెట్స్ కారులో ఉన్నాయని తెస్తాను అని ఏంజెల్ అంటుంది.
Guppedantha Manasu
వసుధార.. ఏంజెల్ ని ఆపి. మనుని ట్యాబ్లెట్స్ తెమ్మని చెబుతుంది. ఏంజెల్ పర్వాలేదు.. నేను తెస్తాను అంటుంది. కానీ వసుధార ఆపి.. మనం కాఫీ పెడదాం.. మనుగారు మీరు ట్యాబ్లెట్స్ తీసుకురండి అని చెబుతుంది. మహేంద్రకేమో.. మామయ్య.. మీరు అనుపమ మేడమ్ కి రూమ్ రెడీ చెయ్యండి అని చెబుతుంది. వసుధార ప్లాన్ మహేంద్రకు వెంటనే అర్థమైపోతుంది. తల్లీ, కొడుకులను దగ్గర చేయాలని వసుధార ప్రయత్నిస్తుంది.
Guppedantha Manasu
వాళ్లు అలా వెళ్లగానే మను ట్యాబ్లెట్ తెచ్చి ఇస్తాడు. అనుపమ వేసుకుంటుంది. నిజానికి వారిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారని వసుధార అనుకుంది. కానీ.. వాళ్లు ఏమీ మాట్లాడుకోరు. మను తాను వెళ్తున్నాను అని చెబుతాడు. మహేంద్రకు చెప్పి వెళ్లమని అనుపమ అంటుంది. మీరే చెప్పండి అని.. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని మను అంటే... అవసరం రాదేమో అని అనుపమ అంటుంది. ఆ మాటకు మను మనసు ముక్కలు అవుతుంది. బాధగా వెళ్లిపోతాడు. వసుధార చూసి పిలుస్తుంది. కానీ.. మను పలకుండా వెళ్లిపోతాడు. తల్లీ కొడుకులను దగ్గర చేయాలని వసు వేసిన ప్లాన్ రివర్స్ అయ్యింది.
Guppedantha Manasu
ఇక.. మను బాధగా కారులో వెళ్లిపోతూ ఉంటాడు. తన తల్లి..తన కోసం రక్తం ధారపోసిందని.. అలాంటి తల్లికి బాలేకపోతే కనీసం పక్కనుండి చూసుకోలేని పరిస్థితి నాది అని ఫీలౌతాడు. ఇంకా ఎంతకాలం తాము దూరంగా ఉండాలని? నేను చేసిన తప్పేంటి? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబితే సరిపోతుంది కదా.. ఇంత శిక్ష ఎందుకు? నేను మళ్లీ మా అమ్మతో కలిసి ఆనందంగా ఉండేది ఎప్పుడు అని బాధపడతాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. అనుపమను గదిలోకి తీసుకురమ్మని మహేంద్ర అంటాడు. వసు, ఏంజెల్ తీసుకువస్తారు. అయితే.. మను ఏడి అని మహేంద్ర అడుగుతాడు. వెళ్లిపోయాడు అని అనుపమ చెబుతుంది. నాకు ఒక మాట కూడా చెప్పలేదు అని మహేంద్ర అంటే.. తాను చెప్పమనే అన్నాను అని.. కానీ నన్నే చెప్పమని అన్నాడని అంటుంది. మను వెళ్తుంటే కనీసం నువ్వు ఆపాలి కదా.. ఎందుకు ఆపలేదు? అని అడుగుతాడు. వెళ్తాను అన్నాడు అందుకే ఆపలేదు అని అంటుంది. ఆ మాటకు మహేంద్రకు కోపం వస్తుంది.
ఇంతకాలం అంటే.. మను ఎవరో మాకు తెలీదు.. కానీ ఇప్పుడు నీ కొడుకు అని తెలిసింది కదా.. అలా ఎలా వెళ్లనిస్తావ్ అని అడుగుతాడు. అనుపమ సమాధానం చెప్పదు. ఇక మహేంద్ర అనుపమపై తనకు ఉన్న ఫ్రస్టేషన్ మొత్తం తీర్చుకుంటాడు. అసలు మనుని ఎందుకు దూరం పెడుతున్నావ్ అని ప్రశ్నిస్తాడు. వాడు అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదు అని అనుపమ అంటుంది. సమాధానం లేని ప్రశ్న ఉండదని.. నీకు ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదు అందుకే అలా చేస్తున్నావ్ అని తిడతాడు. అనుపమ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మహేంద్ర మాత్రం అడుగుతూనే ఉంటాడు. నీకు మను అంటే ప్రాణం అని తెలుస్తోంది.. అందుకే.. అతని ప్రాణానికి నీ ప్రాణం అడ్డం వేశావ్..కానీ.. తనని కనీసం అమ్మ అని కూడా పిలవద్దని కూడా చెప్పావంట కదా అని సీరియస్ అవుతాడు. అనుపమ మాత్రం ఏమీ మాట్లాడదు. గతంలో జగతి, రిషిలు కూడా తల్లీ కొడుకులుగా దూరంగా ఉన్నప్పుడ చాలా బాధపడ్డారని, ఇప్పుడు మను కూడా అంతే బాధపడుతున్నాడు అని అంటాడు. అత్తయ్య కూడా బాధపడుతుంది అని ఏంజెల్ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో అనుపమకు నొప్పి రావడంతో.. మహేంద్ర ఆ ప్రశ్నలు ఆపేస్తాడు.
Guppedantha Manasu
వసుధార మహేంద్రను పక్కకు పిలిచి మాట్లాడుతుంది. కాలేజీకి టైమ్ అయ్యిందని.. వెళ్దాం అని.. మేడమ్ ని ఏంజెల్ చూసుకుంటుందని చెబుతుంది. అయితే.. మహేంద్ర.. నువ్వు వెళ్లు నాకు చిన్న పని ఉంది.. అది చూసుకొని వస్తాను అని అంటాడు. ఏం పని అని వసు అంటే చెప్పడు. మనుసులో మాత్రం.. అనుపమ ఈ రోజు ఎలాగైనా నీతో నిజం చెప్పిస్తాను అని అనుకుంటాడు.
ఇక శైలేంద్ర, రాజీవ్ బయట కలుసుకుంటారు. ఏంటి విషయం అని రాజీవ్ అడిగితే... మను గాడు మిస్ అయ్యాడని ఫీలౌతాడు. ఆ అనుపమ నోరు తెరిసినా మనకు ప్రమాదమే అని అంటాడు. అనుపమ నోరు తెరవడం ఏంటి అని రాజీవ్ అంటే... గతంలో రిషిపై ఈ పాండు ఎటాక్ చేస్తుంటే.. అనుపమ చూసిందని చెబుతాడు. ఎందుకైనా మంచిదని పాండుని అండర్ గ్రౌండ్ కి వెళ్లమని చెప్పానని.. ఎవరు నోరు తెరిచినా మనకు ప్రమాదమే.. జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. మనకి కాదు.. నీకు ప్రమాదం అని రాజీవ్ అంటాడు. నేను దొరికితే.. నువ్వు కూడా దొరికినట్లే అని శైలేంద్ర అంటాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పినా.. తన ప్లాన్స్ తనకు ఉన్నాయంటాడు. ఏం చేస్తావ్.. మొన్న పోస్టర్లు అన్నావ్?. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నావ్ ఏం సాధించావ్ అని శైలేంద్ర కౌంటర్ వేస్తాడు. దానికి రాజీవ్.. ఈసారి కొత్త ప్లాన్ వేసుకున్నాను అని చెబుతాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. వసుధార కాలేజీలో పని చేసుకుంటూ ఉంటుంది. మధ్యలో ఆ పోస్టర్ విషయం వసుధారకు గుర్తుకు వస్తుంది. అనవసరంగా మనుని తాను అపార్థం చేసుకున్నాను అని ఫీలౌతుంది. సారీ చెబుదాం అని మను క్యాబిన్ వెళ్తే.. అక్కడ మను ఉండడు. కాలేజీకి రాలేదని తెలుస్తుంది. వెంటనే మనుకి ఫోన్ చేస్తుంది.. కానీ లిఫ్ట్ చేయడు.
Guppedantha Manasu
ఇక ఇంట్లో.. అనుపమకు మహేంద్ర ట్యాబ్లెట్స్ ఇస్తాడు. తర్వాత.. నెమ్మదిగా.. మను గురించి అనుపమను ప్రశ్నిస్తాడు. ఇంతకాలం ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావ్ అని అడుగుతాడు. ఆ విషయం చెబితే.. చాలా మంది బాధపడతారని.. అందుకే చెప్పలేదు అని అనుపమ ఏదేదో సమాధానం చెబుతుంది. తర్వాత.. మహేంద్ర డైరెక్ట్ గా మను తండ్రి ఎవరు అని అడుగుతాడు. మరి.. మహేంద్ర ప్రశ్నకు అనుపమ ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.