BrahmaMudi 22nd March Episode: కొడుకు తప్పును సమర్థించిన అపర్ణ, కావ్య నిర్ణయానికి కనకం షాక్..!

First Published | Mar 22, 2024, 1:34 PM IST

నీ కూతురు జ్యేష్టా దేవిలా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ సమస్యలే అని మాట్లాడుతుంది. ఆ మాటలకు కనకం బాధపడుతుంది. నిలదీస్తుంది. కానీ అపర్ణ ఊరుకోదు..

Brahmamudi

BrahmaMudi 22nd March Episode:పెళ్లిరోజు నాడు రాజ్ మారిపోతాడని.. తన ప్రేమను అంగీకరిస్తాడని కావ్య చాలా సంబరపడుతుంది. కానీ.. ఆమె ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. ఓ పసిబిడ్డను తీసుకొని వచ్చి నా కొడుకు అని చెప్పడంతో అందరూ షాకైపోతారు. అయితే... బిడ్డను తీసుకువెళ్లి తన గదిలో నిద్రపుచ్చుతాడు. వెనకాలే వెళ్లిన కావ్య.. రాజ్ ని నిలదీస్తుంది. ఆ బిడ్డ ఎవరు..? నిజంగా నీ కొడుకేనా అని అడుగుతుంది. తనకు అన్యాయం ఎందుకు చేశారని ప్రశ్నిస్తుంది. నేను కలిసి ఉందా అన్నాను.. మీరు విడిపోదాం అన్నారు.. నేను విడిపోదాం అన్నాను.. మీరు కలిసి ఉందాం అంటారు అనుకున్నాను. కానీ.. ఇలా బిడ్డతో నిలపడ్డారు..? అందరూ కనపడుతున్న బిడ్డ గురించే మాట్లాడుతున్నారు కానీ.. ఆ బిడ్డ తల్లి ఎవరు అనే విషయాన్ని ఎవరూ అడగడం లేదు. ఎవరు.. ఆ బిడ్డ తల్లి ఎవరు అని నిలదీస్తుంది. రాజ్ ఇటు తిరిగేలోగా.. బాబు ఏడుస్తాడు. దీంతో... రాజ్ సమాధానం చెప్పకుండా ఆ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. కావ్య అక్కడి నుంచి వచ్చేస్తుంది.

Brahmamudi

ఓవైపు.. కనకం ఏడుస్తూ ఉంటుంది. తన కూతురికి అన్యాయం జరిగిందని ఇందిరాదేవి ని ప్రశ్నిస్తూ ఉంటారు. కనకం, మూర్తి ఇద్దరూ కలిసి.. తమ కూతురికి మీరే న్యాయం చేయాలని అడుగుతారు. మీరు ఇంటి పెద్ద అని.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అని వేడుకుంటారు. ఆ మాటలు అపర్ణ చెవిన పడతాయి. కనకం అంటూ సీరియస్ గా వస్తుంది. ఇది మా ఇంటి సమస్య అని.. మేమే.. వచ్చిన సమస్యను ఎలా తీర్చుకోవాలా అని చస్తుంటే. ఇప్పుడు మా బాధలో మేమున్నాం.. మా పెంపకాన్నే ప్రశ్నిస్తున్నారు.. మీకు న్యాయం చేయమని.. మా అత్తగారిని నిలదీస్తున్నారా, . అంటూ సీరియస్ అవుతుంది.

Latest Videos


Brahmamudi

అయితే.. తాము కేవలం మా బాధ చెప్పుకుంటున్నామని.. తమ కూతురి బాధను కడుపులోనే దాచుకొని బాధపడుతోంది అని కనకం అంటుంది.  మూర్తి, కనకం నచ్చచెప్పాలని చూసినా అపర్ణ ఊరుకోదు. అసలు.. నీ కూతురు జ్యేష్టా దేవిలా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ సమస్యలే అని మాట్లాడుతుంది. ఆ మాటలకు కనకం బాధపడుతుంది. నిలదీస్తుంది. కానీ అపర్ణ ఊరుకోదు.. నీ కూతురి కారణంగానే.. నా కొడుక్కి దరిద్రం పట్టుకుందని, నీ కూతురు బాధ తట్టుకోలేక నా కొడుకు ఇలా చేశాడని అంటుంది.  ఎక్కువ మాట్లాడితే.. మీకు మర్యాదకూడా ఉండదుు అని అంటుంది.

Brahmamudi

ఆ మాటలకు కనకం కూడా ఊరుకోదు. సంవత్సరకాలంలో మీరు మాకు ఇచ్చిన మర్యాద ఏమీ లేదని.. ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేమీ లేదని కనకం అంటుంది. తన కూతురు కడుపు రగిలిపోతోందని కనకం అంటే.. అంతగా రగిలిపోతుంటే.. నీ కూతురిని నువ్వే నీ పుట్టింటికి తీసుకొని వెళ్లు అని అంటుంది. ఆ మాటకు కనకం..తీసుకొని వెళతాను.. అంటుంది. నా కూతురిని పుట్టింటికి తీసుకొని వెళతాను అని అంటుంది. ఆ మాటకు కావ్య ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi

అమ్మా.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అనుకుంటూ వస్తుంంది. అయితే.. మీ అత్తగారు చూశావా... ఏం అంటున్నారో అని అంటుంది. పుట్టింటికి రమ్మని అడుగుతుంది, కానీ. కావ్య.. నేను ఏ తప్పు చేశానని పుట్టింటికి రావాలి అని అడుగుతుంది. తనకు  ఎందుకు అన్యాయం చేశారో.. ఆ మనిషిని అడిగి తేల్చుకునే వరకు తాను పుట్టింటికి రాను అని కావ్య తేల్చి చెబుతుంది.అంతేకాదు.. తన పుట్టింటి వాళ్లను ఇంటికి వెళ్లిపొమ్మని చెబుతుంది. కనకం వికపోతే.. అప్పూని పిలిచిమరీ.. ఇంటికి పంపించేస్తుంది.

click me!