Ariyana Glory : చీరకట్టులో అరియానా గ్లోరీ.. కొంగును మెలితిప్పుతూ ఆర్జీవీ గ్లర్ ఫోజులు!

Published : Feb 22, 2024, 07:20 PM ISTUpdated : Feb 22, 2024, 07:23 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)  బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో కుర్ర గుండెల్ని దోచుకునేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

PREV
16
Ariyana Glory : చీరకట్టులో అరియానా గ్లోరీ.. కొంగును మెలితిప్పుతూ ఆర్జీవీ గ్లర్ ఫోజులు!

యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తోంది. వరస పోస్టులతో ఆకట్టుకుంటోంది. తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. 

26

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో చేసిన ఇంటర్వ్యూ తర్వాత ఈ ముద్దుగుమ్మ జీవితం మారిపోయింది. ఓవర్ నైట్ లో సెలబ్రెటీగా మారిపోయింది. ఆ క్రేజ్ తోనే పలు టీవీ షోల్లో అవకాశం దక్కించుకుంది.

36

తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3, 5తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. బీబీ కెఫె, బీబీ జోడీ వంటి షోలలోనూ సందడి చేసింది. టీవీ ప్రేక్షకులను అలరించింది.

46

బుల్లితెరపై వరుసగా ఏదోక షోతో మాత్రం అరియానా అల్లరి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన పోస్టులతో ఆకట్టుకుంటోంది.

56

ముఖ్యంగా ఈ బ్యూటీ పంచుకునే ఫొటోలు ఓ రేంజ్ లో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా చీరకట్టులో అరియానా గ్లోరీ పద్ధతిగా మెరిసింది. ఎర్ర చీరలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. 

66

చీరకట్టులో సంప్రదాయంగా కనిపించింది. కానీ మత్తెక్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది. కొంగును చేతికి చుట్టుకొని ఇచ్చిన కొంటె ఫోజుతో కుర్ర గుండెల్ని పిండేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories