Guppedantha Manasu 21st February Episode:అనుపమ నీకు ఏమౌతుంది? మనుని అడిగేసిన మహేంద్ర, రిషి బతికే ఉన్నాడు..!

First Published | Feb 21, 2024, 8:40 AM IST

 శైలేంద్ర అంటే భయం పోతోందని.. వాళ్లందరికీ తాను అంటే చూపిస్తానని,  అందరికీ వణుకుపుట్టేలా చేస్తాను అని అంటాడు.

Guppedantha Manasu


Guppedantha Manasu 21st February Episode:శైలేంద్ర తనను తాను కొట్టుకుంటూ, తల్లితో కూడా కొట్టించుకున్న విషయం తెలిసిందే. అది చూసి ధరణి ఏకంగా తన అత్తగారు దేవయాణిని బెల్టు తో కొట్టబోతుంది. అదే విషయం దేవయాణి అడుగుతుంది. తన మీద చెయ్యి ఎత్తావేంటి అని..? దానికి ధరణి.. తన భర్తను కొడుతున్నారని అలా చేశాను అత్తయ్యగారు అని సమాధానం ఇస్తుంది. అంతేనా లేక.. మళ్లీ అవకాశం రాదని ఇలా చేశావా అని  దేవయాణి అడుగుతుంది. అవకాశం ఎందుకు రాదు అత్తయ్యగారు, కావాలంటే అవకాశాలు క్రియేట్ చేసుకోవచ్చు.. కేవలం ఆయన్ని కొడుతున్నారనే అలా చేశాను, భర్తను కొడుతున్నా కూడా భార్య ఏమీ చేయడం లేదంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు అత్తయ్యగారు అఅని ధరని చెబుతుంది. అసలు ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే.. మీరు ఉన్నారుగా అత్తయ్యగారు అని అంటుంది. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావ్ అని శైలేంద్ర అడిగితే.. కాఫీ ఇవ్వడానికి వచ్చాను అని చెబుతుంది. మరి కాఫీ ఏది అంటే... మీరు కావాలి అంటే తెద్దామని ఆగాను అని చెబుతుంది. నీ కాఫీ గోల నీదే కానీ... బెల్టు దెబ్బలకు వెన్న రాయాలని తెలీదా అని దేవయాణి సీరియస్ అవుతుంది. దానికి.. ధరణి.. కావాలని కొట్టుకున్నారు కదా.. కాసేపు అయినా నొప్పి భరిస్తారేమె అని ఆగాను అని చెబుతుంది. కావాలంటే.. కొట్టి కొట్టి మీ చేతులు అలసిపోయాయి అత్తయ్యగారు.. మీ చేతులకు వెన్న రాయానా అని అడుగుతుంది. అక్కర్లేదని.. ముందు శైలేంద్రకు రాయమని చెప్పి పంపిస్తుంది.

Guppedantha Manasu

ధరణి వెళ్లిన తర్వాత.. ఇది ఇలా తయారయ్యిందేంటని, ఆకులా అణిగి మనిగి ఉండేదది.. ఇప్పుడు మేకులా తయారయ్యింది, ఈ రోజు నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తిందంటే రేపు ఇంకేం చేస్తుందో అని దేవయాణి అంటుంది. ధరణికి అంత సీన్ లేదు అని శైలేంద్ర చెబుతాడు. తర్వాత.. నీ ఫ్రస్టేషన్ ఏంటి అని దేవయాణి అంటే.. ఎండీ సీటు గురించే అని, మను వచ్చి బోర్డు మెంబర్ గా జాయిన్ అయ్యాడని,  వార్నింగ్ ఇవ్వాలని చూస్తే తన చెంప పగలకొట్టాడు అని  విషయం మొత్తం చెబుతాడు. నువ్వు కూడా వాడి ముఖం పగలకొట్టాల్సింది అని దేవయాణి అంటే.. కాలేజీలో గొడవ ఎందుకులే అని ఆగాను అని, ఈ మధ్య ప్రతి కుక్క తనపై మొరుగుతోంది, కరుస్తోంది అని బాధపడతాడు. శైలేంద్ర అంటే భయం పోతోందని.. వాళ్లందరికీ తాను అంటే చూపిస్తానని,  అందరికీ వణుకుపుట్టేలా చేస్తాను అని అంటాడు.


Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. మను క్యాబిన్ లోకి మహేంద్ర వెళతాడు.  క్యాబిన్ అంతా కంఫర్ట్ గా ఉందా అని అడుగుతాడు. అంతా బాగుందని మను కూడా చెబుతాడు. ఒకవిషయంఅడగాలి అని మహేంద్ర అంటాడు. మీకు మా అనుపమ తెలుసు కదా అని అడుగుతాడు. తెలుసు అని మను చెబుతాడు. ఎంతకాలం నుంచి తెలుసు.. ఎలా పరిచయం అని మహేంద్ర అడుగుతాడు. దానికి మను మనసులో అది మాత్రం చెప్పలేను అని అనుకుంటాడు. ఆ విషయం చెప్పకుండా.. మీకు అనుపమ గారు ఏమౌతారు అని అడుగుతాడు. తను నా ఫ్రెండ్ అని చెబుతాడు. తర్వాత.. తన భార్య జగతి గురించి కూడా చెబుతాడు. తాను జగతి, అనుపమ బెస్ట్ ఫ్రెండ్స్ అని  చెబుతాడు.

Guppedantha Manasu

మరోసారి అనుపమ తో నీకు ఏదైనా గతం ఉందా అని అడుగుతాడు. ఈ విషయం మీరు అనుపమ మేడమ్ ని అడగితే సరిపోయేది కదా అని మను అంటాడు. అడిగాను అని.. చెప్పలేదని, అయినా తను చెప్పదని.. కొన్ని కొన్ని విషయాలు మనసులోనే దాచుకుంటుందని మహేంద్ర అంటాడు. అయితే.. మేడమ్ ఏమీ చెప్పలేదు అంటే ఏమీ లేదనేగా అని మను టాపిక్  డైవర్ట్ చేస్తాడు. ఆ విషయం మహేంద్రకు అర్థమౌతుంది. కచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని మహేంద్ర మనసులో అనుకుంటాడు. తర్వాత.. తమ ఇంటికి లంచ్ కి రమ్మని పిలుస్తాడు. మను రాలేను అన్నా మహేంద్ర వదిలిపెట్టడు. దీంతో.. మను కాదు అనలేక సరే అంటాడు.

Guppedantha Manasu

ఇక వసుధార ఇంట్లో మను గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మను చాలా తెలివిగా మాట్లాడుతన్నాడని, మైండ్ గేమ్ ఆడుతున్నాడని వసుధార అనుకుంటుంది. మంచివాళ్లలా నటిస్తున్నాడని, బద్ర లాగే మను మనసులో కూడా ఏదో ఒక కుట్ర ఉండే ఉంటుంది అని అనుకుంటుంది. పదవి వద్దు అని చెప్పి.. మళ్లీ బోర్డు మెంబర్ అయ్యాడని, తన మనసులో దురుద్దేశం ఉంది, ఏ ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడం లేదు, ప్రతి విషయానికీ రిషి సర్ పేరు చెప్పి నన్ను లాక్ చేస్తున్నాడు. నా వీక్ నెస్ బాగా తెలిసిపోయింది.. అసలు అతని మనసులో ఏముంది..? ఈ విషయాలు తెలుసుకుంటేనే అతను నిజంగా మంచివాడా లేక.. మంచివాడిలా ముసుగు వేసుకున్న చెడ్డవాడా అనే విషయం తెలుస్తుంది. అందుకే తనను ప్రతి క్షణం గమనించాలి, అతని ప్రతి కదలికను గమనించాలి అని అనుకుంటుంది.

Guppedantha Manasu

మరోవైపు శైలేంద్ర గాయాలకు ధరణి వెన్నపూస రాస్తూ ఉంటుంది. చిన్నగా రాయమని శైలేంద్ర అంటే.. తాను చిన్నగానే రాస్తున్నాను అని, గాయాలు పెద్దగా అయ్యాయి అని చెబుతుంది. అమాయకంగా ముఖం పెట్టి..  శైలేంద్రను పొగిడినట్లే పొగిడి తిడుతుంది. తర్వాత.. మను గురించి అడుగుతుంది. అయితే ఏంటి అని శైలేంద్ర అంటే.. తనకు ఈ విషయాలు చెప్పలేదని అలిగాను అంటుంది. నేను నీకు చెప్పేదేముంది..? నీకు అన్నీ ముందే తెలుస్తాయి కదా అని అంటాడు. నాకేమీ తెలుసు అని ధరని అంటే.. ఆ రోజు ఛాలెంజ్ చేశావ్ కదా అని గుర్తు చేస్తాడు.  ఏదో మనసులో అనిపించిందని ధరణి అంటే.. కాదు నీకు జాతకం తెలుసు అని నా చెయ్యి చూసి చెప్పు అంటాడు. తర్వాత రిషి గాడు బతికే ఉన్నాడా లేదా చెప్పమని అడుగుతాడు. రిషి బతికే ఉన్నాడు అని ధరణి అంటుంది.  మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించేది రిషి అని మీ జాతకంలో రాసి ఉంది అని  ధరణి మరోసారి చెబుతుంది. తర్వాత.. ఎండీ సీటు గురించి అడుగుతాడు.. మీకు అసలు ఆ యోగమే లేదు అని ధరని చెబుతుంది.  తర్వాత శైలేంద్ర కు రాజీవ్ నుంచి మెసేజ్ వస్తుంది. పక్కకు వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

ఇక అనుపమ.. తన పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. మనుని కాలేజీకి ఎందుకు పంపావ్ అని అడుగుతుంది. నేను పంపలేదని... నువ్వు కాలేజీ ప్రాబ్లం చెప్పడం వల్లే కదా వాడు వచ్చింది అని వాళ్ల పెద్దమ్మ అంటుంది. అయితే.. మను రావడం వల్ల సమస్య పెరుగుతోందని.. అందరినీ ఇరిటేట్ చేస్తున్నాడని చెబుతుంది. కాలేజీలో డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడనే విషయం చెబుతుంది.  పెద్దమ్మ మాత్రం మురిసిపోతుంది. వాడు ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతుంది. ఉన్నాడని.. ఎవరో భోజనానికి పిలస్తే వెళ్తున్నాడని చెబుతుంది. ఇక మను.. వసుధార ఇంటికి భోజనానికి బయలుదేరతాడు.

Guppedantha Manasu


సీన్ కట్ చేస్తే... శైలేంద్ర, రాజీవ్ లు కలుసుకుంటారు.  ఒంటి మీద దెబ్బలు చూసి, మను కొట్టాడా అని అడుగుతాడు. అవును అని శైలేంద్ర చెబుతాడు. తర్వాత.. ఫ్రస్టేషన్ తో తనను తాను కొట్టుకున్నానని.. కారణం కాలేజీలో మను జరిగిన విషయం చెబుతాడు.  ఏం చేద్దాం అన్నా.. ప్రతి విషయంలోనూ మను అడ్డు వస్తున్నాడని శైలేంద్ర అంటాడు.  ఇద్దరూ కలిసి మను ని ఎలా సైడ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు.తర్వాత వసుధారను నువ్వు తెచ్చుకోలేవా అని రాజీవ్ ని శైలేంద్ర రెచ్చ గొడతాడు. అయితే.. ఈరోజే నా వసుని నేను తెచ్చుకుంటాను అని రాజీవ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!