Guppedantha manasu 20th march Episode:మను తండ్రి ఎవరు..? నిజం తెలుసుకొని తలవంచుకున్న వసుధార..!

Published : Mar 20, 2024, 08:39 AM IST

తనకు సమాధానం తెలీదని శైలేంద్ర అరవడంతో... రాజీవ్.. వాడితో నాకు అనవసరం.. తనకు కేవలం తన మరదలు ఉంటే చాలు అనేసి వెళ్లిపోతాడు.  

PREV
18
Guppedantha manasu 20th march Episode:మను తండ్రి ఎవరు..? నిజం తెలుసుకొని తలవంచుకున్న వసుధార..!
Guppedantha Manasu


Guppedantha manasu 20th march Episode:గాయం కావడంతో అనుపమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటుంది. మను ఆమెను అలా చూసి ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర మాత్రం... మను.. అనపమను అమ్మా అని పిలిచిన సందర్భం తలుచుకుంటాడు. ఇన్నిరోజులు కనీసం పరిచయం ఉన్నట్లు కూడా ఒప్పుకోలేదు.. మను.. అనుపమ కొడుకా అని మహేంద్ర అనుకుంటాడు. అదే నిజం అయితే.. మరి అనుపమ భర్త ఎవరు అని ఆలోచిస్తాడు

28
Guppedantha Manasu

వసుధార కూడా.. అనుపమ మేడమ్ , మనులది తల్లీకొడుకుల బంధమా? జగతి మేడమ్ ని రిషి సర్ మేడమ్ అని పిలిచినట్లే మను కూడా మేడమ్ అని పిలుస్తున్నాడు అని తలుచుకుంటుంది. ఇక.. మను అనుపమను చూసి ఏడుస్తూ ఉంటే.. మహేంద్ర పిలవడంతో.. ఆయనను హత్తుకొని మరింతగా ఏడుస్తాడు. అనుపమకు ఏమీ కాదు అని.. మహేంద్ర ధైర్యం చెబుతాడు.

38
Guppedantha Manasu

మరోవైపు శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. మనుపై ఎటాక్ చేయించాలని చూసిన రౌడీని పిలిచి శైలేంద్ర తిడతాడు. వాడి మానానా వాడు వెళ్లిపోయేవాడు.. వాడిమీద ఎటాక్ చేయవద్దు అని చెప్పినా వినకుండా వెళ్లి ఎటాక్ చేయబోయావ్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని శైలేంద్ర అంటాడు. అయితే.. ఆ రౌడీ మాత్రం.. ఆయనను పొడవాల్సిందిపోయి.. ఆవిడకు తగిలింది అంతే కదా అని అంటాడు. ఇక, శైలేంద్ర, రాజీవ్ ఇద్దరూ ఆ రౌడీని తిడతారు. కానీ.. ఆ రౌడీ మాత్రం..  నా వళ్ల.. మీకు అసలు విషయం తెలిసింది కదా అని అంటాడు.

48
Guppedantha Manasu

ఏంటా విషయం అని రాజీవ్ అంటే... మను.. అనుపమను అమ్మా అని పిలిచాడని శైలేంద్ర చెబుతాడు. ఆ మాటకు రాజీవ్ షాకౌతాడు.  ఇన్నాళ్లు వాళ్ల బంధాన్ని ఎందుకు దాచి పెట్టారు? ఆవిడకు పెళ్లి కాలేదు అన్నారు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. తనకు సమాధానం తెలీదని శైలేంద్ర అరవడంతో... రాజీవ్.. వాడితో నాకు అనవసరం.. తనకు కేవలం తన మరదలు ఉంటే చాలు అనేసి వెళ్లిపోతాడు.

58
Guppedantha Manasu


ఇక.. అనుపమ పెద్దమ్మ.. హాస్పిటల్ కి వస్తుంది. మనుని ఓదారుస్తుంది.అసలు ఎలా జరిగింది అని అడుగుతుంది. తన ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకుందని మను చెబుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి.. అనుపమ ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటారు.ఇక.. పెద్దమ్మతో... మను.. ఇచ్చిన మాట తప్పాను అని అంటాడు. గతంలో.. తనను అమ్మా అని పిలవొద్దని అనుపమ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు లే అని ఆవిడ అంటుంది. ఇక.. మను తనకు మహేంద్ర, వసుధారలు తోడుగా ఉన్నారని చెప్పి.. ఆవిడను ఇంటికి పంపించేస్తాడు.

68
Guppedantha Manasu

మను, అనుపమ బంధం గురించి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మను అసిస్టెంట్ వచ్చి.. మను సర్ ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెబుతాడు. ఏ విషయంలో.. ప్రాజెక్ట్ కోసం వెళ్లింది మా ఇద్దరికీ తప్ప.. మరెవరికీ తెలియదని.. ఆయన ఎవరితోనే ఫోటో తీయించారు అని వసుధార కోపంగా అంటుంది. అప్పుడు అసిస్టెంట్ అది కాదని... రాజీవ్ పోస్టర్లు అంటించిన వీడియో చూపిస్తాడు. రాజీవ్ అంటించిన పోస్టర్ల ప్లేస్ లో... బర్త్ డే పోస్టర్లు అంటించారని చెబుతాడు.  నిజం తెలుసుకొని వసుధార సిగ్గుతో తలదించుకుంటుంది.

78
Guppedantha Manasu

ఇక... శైలేంద్ర ఇంటికి వచ్చి దేవయాణికి విషయం చేరవేస్తాడు. అనుపమ.. ఆ మను కొడుకా అని దేవయాణి షాకౌతుంది. అనుపమ కు పెళ్లి కాలేదు కదా.. నువ్వు పొరపాటు పడ్డావేమో అని దేవయాణి అంటుంది. పెళ్లి చేసుకొని ఉంటే నాకు తెలిసేదని, ఎదో గండికోట రహస్యం ఉందని తెలుసకోవాలని అనుపమ అంటుంది. మను నిజంగా అనపమ కొడుకు అయితే.. అతని తండ్రి ఎవరు..? అనుపమ నిజం దాచింది అంటే..  ఏధో రహస్యం ఉందనే అర్థం.. ఆ రహస్యం మనం తెలుసుకోవాలి అని అనుపమ అంటుంది. శైలేంద్ర కూడా తల్లి చెప్పిందానికి సరే అంటాడు.

88
Guppedantha Manasu

ఈలోగా.. హాస్పిటల్ కి ఏంజెల్ వస్తుంది. అత్తయ్యకు ఎలా ఉందని అడుగుతుంది. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు  చెప్పారని వసుధార చెబుతుంది.  మనుని ఎవరో రౌడీ ఎటాక్ చేయాలని చూస్తే... అత్తయ్య ఎందుకు అడ్డు వెళ్లింది అని ఏంజెల్ ఆరా తీస్తుంది. అప్పుడు వసుధార అసలు విషయం చెబుతుంది. మనుగారు.. అనుపమ మేడమ్ కొడుకు అని చెబుతుంది. ఆ మాట విని ఏంజెల్ షాకౌతుంది. మా అత్తయ్య కొడుకా అని అంటుంది. ఈ విషయం మా తాతయ్య కూడా నాకు చెప్పలేదని.. మా అత్తయ్యకు అసలు పెళ్లి కాలేదు  అన్నారు అని ఏంజెల్ అంటుంది. మేము కూడా అదే విషయం ఆలోచిస్తున్నాం అని వసుధార అంటుంది.  

ఏంజెల్, వసుధార మాటలు విని మను ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. కానీ.. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ మాత్రం బయటపడిందని వసు, ఏంజెల్ అనుకుంటారు. కానీ.. వాళ్లిద్దరు ఎందుకు పరిచయం లేనివాళ్లలా ఉన్నారు అని వసు అంటుంది. మను నాకు బావ అవుతాడా అని ఏంజెల్ మనసులో ఆనందపడుతుంది. తర్వాత.. అసలు ఏం జరిగిందని మనుని మహేంద్ర ప్రశ్నిస్తాడు. ఈ విషయం ఇద్దరూ ఎందుకు దాచారని? కారణం ఏంటని అడుగుతాడు. మను మాత్రం నోరు విప్పడు. అనుపమలాగానే.. నువ్వు కూడా అన్నీ దాస్తున్నావా అని మహేంద్ర అంటాడు. ఏంజెల్ కూడా ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని మనుని ప్రశ్నిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి.. మను ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

click me!

Recommended Stories