BrahmaMudi 19th March Episode:కొంచెం కూడా మారని అత్త, విడాకుల విషయం బయపెట్టిన రాజ్, బాధలో కావ్య..!

Published : Mar 19, 2024, 10:49 AM IST

అపర్ణ.. ఆ నగలు కావ్య చేతిలో పెడుతుంది. కావ్య తనకు వద్దు అని చెప్పినా అపర్ణ వినదు. తీసుకోవాల్సిందే అంటుంది. పెళ్లిరోజునాడు అత్త నుంచి బహుమతి వస్తోంది తీసుకోమని ఇందిరాదేవి చెప్పడంతో కావ్య తీసుకుంటుంది.

PREV
19
BrahmaMudi 19th March Episode:కొంచెం కూడా మారని అత్త,  విడాకుల విషయం బయపెట్టిన రాజ్, బాధలో కావ్య..!
Brahmamudi


BrahmaMudi 19th March Episode: రాజ్, కావ్యల పెళ్లి రోజు అని ఇంట్లో అన్యోన్య దాంపత్య వ్రతం చేయించాలని ఇందిరాదేవి అనుకుంటుంది. అదే విషయం ఇంట్లో అందరికీ చెబుతుంది. అయితే.. అపర్ణ.. సాయంత్రం ఫంక్షన్ చేస్తున్నాంగా.. మళ్లీ ఈ వ్రతం ఎందుకు అంటుంది. అంతే.. కావ్య అంటే అపర్ణకు ఇష్టం లేదని రుద్రాణి, ధాన్యలక్ష్మి రచ్చ  చేస్తారు. అందుకే కావ్యకు ఇప్పటి వరకు బంగారం కూడా ఇవ్వలేదు అని అంటారు. ఆ మాటకు అపర్ణ కోపంతో ఊగిపోతుంది. వెంటనే..పైకి లేచి వెళ్లి.. బంగారం మొత్తం తీసుకొని వస్తుంది.

29
Brahmamudi

‘అది చూసి.. రెచ్చగొడితే... తనకు కావ్య అంటే ఇష్టం లేదని ఒప్పుకుంటుందేమో అనుకుంటే.. ఏకంగా నగలు తెచ్చి ఇస్తోంది.. ఈ రుద్రాణికి వంత పాడితే ఎప్పుడూ ఇలానే జరుగుతుంది.. రుద్రాణి ముఖం మీద కాకి రెట్ట వేయ్య’ అని ధాన్యలక్ష్మి తిట్టుకుంటుంది. తర్వాత.. అపర్ణ.. ఆ నగలు కావ్య చేతిలో పెడుతుంది. కావ్య తనకు వద్దు అని చెప్పినా అపర్ణ వినదు. తీసుకోవాల్సిందే అంటుంది. పెళ్లిరోజునాడు అత్త నుంచి బహుమతి వస్తోంది తీసుకోమని ఇందిరాదేవి చెప్పడంతో కావ్య తీసుకుంటుంది.

39
Brahmamudi

తర్వాత.. అపర్ణ లోపలికి వెళ్లి.. నగలు ఇచ్చినందుకు చాలా ఫ్రస్టేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే.. అక్కడికి కావ్య వస్తుంది. కావ్య గదిలోకి వచ్చినందుకు అపర్ణ సీరియస్ అవుతుంది. లోపలికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. దీంతో కావ్య వెళ్లిపోబోతుంటే మళ్లీ అపర్ణే ఆపి.. ఎందుకు వచ్చావ్.. ఎందుకు వెళ్తున్నావ్ అని అడుగుతుంది. తనకు సమాధానం దొరికింది అని కావ్య చెబుతుంది. మీరు నగలు ఇష్టంతో ఇచ్చారా లేక.. వాళ్లు ప్రశ్నించడం వల్ల ఇచ్చారో అక్కడే అడుగుదాం అనుకున్నానని.. కానీ అక్కడ సరైన సమాధానం రాదని.. ఇక్కడ అడుగుదాం అని వచ్చాను అని చెబుతుంది.

49
Brahmamudi

మీకు నేను గదిలోకి రావడమే ఇష్టం లేనప్పుడు.. మీ మనసులో చోటు ఎలా ఉంటుంది లే అని అంటుంది. ఈ ఇంటికి వచ్చి సంవత్సరం గడిచినా.. మీకు నచ్చలేకపోయానని.. అలాంటప్పుడు తనకు ఈ నగలు అవసరం లేదని కావ్య అంటుంది. అయితే... తాను ఇష్టంతోనే,,వాళ్ల మీద కోపంతోనో ఈ నగలు ఇవ్వలేదని.. అవి ఇవ్వడం తన బాధ్యత అని చెబుతుంది. జీవితంలో ఎప్పటికీ నిన్ను కోడలిగా అంగీకరించలేనని.. నువ్వు కేవలం నా కొడుకు భార్యవి మాత్రమే అని చెప్పేస్తుంది. నగలు మాత్రం పెట్టుకోవాల్సిందే అని చెప్పడంతో.. వాటితోనే కావ్య బాధగా వెనుదిరుగుతుంది.

59
Brahmamudi


ఇక.. కావ్య.. తన పుట్టింటికి ఫోన్ చేస్తుంది. కనకం ఫోన్ ఎత్తడంతో..తమ పెళ్లి రోజు విషయాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత.. సాయంత్రం పార్టీ ఉందని.. రాజ్ మిమ్మల్ని స్వయంగా పిలవమన్నారు అని చెబుతుంది. రాజ్ మనసు మారిందనుకొని కనకం సంబరపడుతుంది. కచ్చితంగా వస్తాం అని చెబుతుంది.

69
Brahmamudi

సీన్ కట్ చేస్తే.. కావ్య పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి, ధాన్యలక్ష్మి... అపర్ణ దగ్గరకు వస్తారు. రాజ్ ఇంకా పూజ దగ్గరకు రాలేదని.. అతనికి అసలు ఈ పూజ చేయడం ఇష్టం లేదని ఏవేవో అంటారు. కావ్య అంటే ఇష్టం ఉన్నట్లు నువ్వు ఎలా అయితే నటిస్తున్నావో.. రాజ్ కూడా అలానే నటిస్తున్నాడేమో చూసుకో అని అంటారు. దీంతో.. రాజ్ ని నేనే తీసుకువస్తాను అని అపర్ణ అంటుంది.

79
Brahmamudi


ఇక.. పూజ సమయం దగ్గరపడుతుంది. కావ్య కూర్చొని సిద్ధంగా ఉంటుంది. రాజ్ ఇంకా రాడు. రాజ్ ఇంకా రాలేదు ఏంటని అడగడంతో... అప్పుడే రాజ్ కిందకు వస్తాడు. పూజలో కూర్చోమంటే కూర్చుంటాడు.  తాను ఆఫీసుకు వెళ్లాలని.. క్లైంట్స్ వెయిట్ చేస్తున్నారని రాజ్ అంటాడు. పెళ్లిరోజుని నీకు తెలుసుకదా.. ఎందుకు మీటింగ్ పెట్టుకున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. అయితే... మీరు పూజ ఉందని ఉదయమే చెప్పారు కదా అని రాజ్ అంటాడు. సాయంత్రం మాత్రం ఎలాంటి పనులు పెట్టుకోకు అని ప్రకాశం అంటే.. అలాగే అని.. తన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు అందరికీ చెప్పాలి కదా అని రాజ్ అంటాడు.

89
Brahmamudi

ఇక.. పూజ పూర్తౌతుంది. ఇద్దరూ ఒకరికి మరొకరు ప్రమాణం చేయాల్సిన సమయం అది. కావ్య ప్రమాణం చేయడానికి రెడీగా ఉంటుంది. రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇందిరాదేవి బలవంతపెడుతుంది. రాజ్ ప్రమాణం చేసేలోగా.. హారతి ప్లేట్ కాలుతోందని.. ఆ వేడి తట్టుకోలేక అపర్ణ కింద పడేస్తుంది. అయ్యో.. అపశకునం జరిగిందని రుద్రాణి అంటే.. అందులో అపశకునం ఏమీ లేదని ఇందిరాదేవి అంటుంది.

99
Brahmamudi

తర్వాత... కావ్య మాత్రం రాజ్ ఏం చెబుతాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక.. అన్నీ బెడ్ మీద పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. ఇంకా ఎందుకు రెడీ కాలేదు అని అడుగుతుంది. అయోమయంలో ఉన్నానని.. ఆయన ఏం చెబుతారో అని కావ్య భయపడుతూ ఉంటుంది. పెద్దావిడ ధైర్యం చెబుతుంది.

కమింగప్ లో.. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. అప్పుడు రాజ్... కావ్య చెయ్యి పట్టుకొని స్టేజ్ మీదకు తీసుకువెళ్లి... తనకు విడాకుల పేపర్లు ఇచ్చింది అనే విషయాన్ని అందరిముందు చెబుతాడు. ఆ మాటకు ఫ్యామిలీ అందరూ షాకౌతారు. మరి.. రాజ్ నిజంగానే విడిపోతాడా లేక.. కావ్యతోనే జీవితాంతం ఉంటాను అంటాడో లేదో చూడాలి. 

click me!

Recommended Stories