Guppedantha Manasu
Guppedantha Manasu 19th march Episode: రాజీవ్ ప్రింట్ చేయించిన కొత్త ప్రేమ జంట పోస్టర్లు చూసి అనుపమ తప్పుగా అనుకుంటుంది. గట్టిగా చెంపలు కూడా వాయిస్తుంది. కొట్టి బాధపెడుతుంది. కాలేజీలో నుంచి వెళ్లిపోమ్మని చెబుతుంది. కాలేజీలో నుంచి వెళ్లిపోకపోతే నా శవాన్ని చూస్తావ్ అనడంతో.. మను కాలేజీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. వెళ్లే ముందు కనీసం వసుధారకు అయినా నిజం చెప్పాలని అనుకుంటాడు. కానీ.. వసుధార కూడా వినిపించుకోదు. మీరు నాకు కాలేజీ విషయంలో అండగా ఉన్నారని, రిషి సర్ ని వెతకడంలోనూ సహాయం చేస్తారని అనుకున్నాను అని.. కానీ మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని అనుకోలేదు అంటూ.. మనుని అసలు విషయం చెప్పనివ్వదు. దీంతో.. మను బాధగా వెళ్లిపోతూ ఉంటాడు.
Guppedantha Manasu
ఆ సీన్ చూసి శైలేంద్ర సంబరపడిపోతాడు. మనుగాడు కాలేజీ నుంచి వెళ్లిపోతున్నాడని ఆనందపడతాడు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడిపోతారు అని అంటారు. కానీ.. నేను తీసిన గోతిలో మనుగాడు పడిపోయాడు అని శైలేంద్ర అనుకుంటాడు. ఇక.. ఈ విషయం వెంటనే భయ్యాకి చెప్పాలి అనుకుంటాడు. వెంటనే రాజీవ్ కి ఫోన్ చేస్తాడు.
Guppedantha Manasu
అయితే.. అప్పటికే రాజీవ్ కి మను కాలేజీ వదిలి వెళ్లిపోతున్న విషయం తెలిసిపోతుంది. ఎప్పుడు పార్టీ చేసుకుందాం అంటాడు. ఎందుకు అంటే.. మనుగాడు కాలేజీ వదిలేసి వెళ్లిపోతున్నాడు కదా అని అంటాడు. ఈ విషయం నీకు ఎలా తెలుసు అంటే... తెలుసుకున్నాను.. నాకు అదే పని కదా అంటాడు. ఇక.. ఇద్దరూ మను కాలేజీ వెళ్లిపోతున్నందుకు ఆనందంగా మాట్లాడుకుంటారు. ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ మనుగాడు అడ్డు తగులుతూ వచ్చాడని, ఇప్పుడు వాడి పీడ విరగడ అయిపోయిందని.. మళ్లీ వాడు కాలేజీలో అడుగుపెట్టడు అని అనుకుంటారు. ఇంతకీ అనుపమ.. మనుని ఎందుకు పంపించి ఉంటుంది అని శైలేంద్ర అంటే.. ఎందుకు అయితే.. మనకు ఎందుకు బ్రదర్.. ఇక నంచి వాడిని తప్పించడానికి మనం ఎలాంటి ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. అయితే.. శైలేంద్ర కూడా.. మను ని చంపమని ఒకడికి చెప్పాను కదా.. వాడికి ఇక అవసరం లేదు అని చెబుతాను అంటాడు. రాజీవ్ సరే అంటాడు.
Guppedantha Manasu
శైలేంద్ర వెంటనే.. మను ని చంపడానికి సపారీ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి.. తాము చేసుకున్న డీల్ క్యాన్సిల్ చేయమంటాడు. కానీ.. ఆ రౌడీ మాత్రం ఒక్కసారి తనకు పని అప్పగించి.. డబ్బులు ఇస్తే.. దానిని మధ్యలో ఆపను అని, కచ్చితంగా పూర్తి చేయాల్సిందే అని అంటాడు. వద్దు అని శైలేంద్ర చెప్పినా.. ఆ రౌడీ వినిపించుకోడు. పని పూర్తి చేసుకొని... మీకు ఫోన్ చేస్తాను అంటాడు. వాడు మాట వినకపోవడంతో శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతాడు. ప్రతి ఒక్కడూ తమను తాము హీరో, విలన్ అనుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ ఆటిట్యూడ్ పెరిగిపోయింది అని తిట్టుకుంటాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. అనుపమ కొట్టిన దెబ్బలు, అన్న మాటలు తలుచుకుంటూ మను బాధగా కాలేజీ లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే మహేంద్ర వస్తాడు. మను ని పలకరిస్తాడు. మను ముఖం దిగాలుగా ఉండటం మహేంద్ర గమనిస్తాడు. ఏమైంది అని అడిగితే.. మను నిజం చెప్పడు. అప్పుడు మహేంద్ర.. తన జేబులో నుంచి కంకణం బయటకు తీస్తాడు. ఆ కంకణం.. తాను రిషి కోసం చేయించాను అని.. మంచి సందర్భం వచ్చినప్పుడు రిషికి తొడగాలి అనుకున్నాను అని చెబుతాడు. రిషి లేని సమయంలో నువ్వు నాకు కొడుకులా అండగా ఉన్నావ్.. అప్పుడు రిషి ఏవిధంగా నాకు సపోర్ట్ గా నిలిచాడో.. ఇప్పుడు నువ్వు అంతే సపోర్ట్ గా ఉన్నావ్.. అందుకే నీకు ఇది తొడగాలి అనుకుంటున్నాను అని చెబుతాడు.
Guppedantha Manasu
వీళ్ల మాటలను దూరం నుంచి అనుపమ, వసుధార వింటూనే ఉంటారు. కానీ.. తనకు అలాంటివి ఏమీ వద్దు అని మను సున్నితంగా తిరస్కరిస్తాడు. మీరు చూపించిన, ప్రేమ అభిమానానికి సంతోషం అని.. మీరు తనను కొడుకు లా ఎలా భావించారో.. నేను కూడా మిమ్మల్ని తండ్రిలాగా, గురువులాగా భావించాను అని చెబుతాడు. తర్వాత.. తాను కాలేజీని వదిలేసి వెళ్తున్న విషయం చెబుతాడు. తాను వచ్చిన పని పూర్తి అయ్యిందని.. ఇక.. మళ్లీ రాను అనేసి వెళ్లిపోతాడు.
మను అలా ఎందుకు ఉన్నాడో అర్థంకాక.. వెంటనే అనుపమను మమహేంద్ర ప్రశ్నిస్తాడు. తానే వచ్చాడు.. తానే వెళ్తున్నాడు.. మనకు ఎందుకు అని అనుపమ అంటుంది. కారణం చెప్పమని మహేంద్ర అంటాడు. కానీ.. అనుపమ చెప్పదు.. నాకు తెలీదు అంటుంది. అయితే.. వసుధారను చెప్పమని మహేంద్ర అడుగుతూ ఉంటాడు.
Guppedantha Manasu
ఈలోగా .. శైలేంద్ర పురమాయించిన రౌడీ.. మనుని చంపడానికి రెడీగా ఉంటాడు. మను కాలేజీ నుంచి బయటకు రాగానే.. ఫోటో చూసుకొని కన్ ఫార్మ్ అవుతాడు. చంపడానికి కత్తి బయటకు తీస్తాడు. దూరం నుంచి అది అనుపమ కంట పడుతుంది. మను అంటూ అరుచుకుంటూ వస్తుంది. అనుపమ ఎందుకు ఇలా చేస్తుందని.. మహేంద్ర, వసుధార కూడా వెనకే పరిగెడతారు. ఈలోగా.. ఆ రౌడీ మనుని పొడవబోతుంటే అనుపమ అడ్డు వస్తుంది. ఆ కత్తి అనుపమకు గుచ్చుకుంటుంది. రౌడీ అక్కడి నుంచి పరారౌతాడు.
Guppedantha Manasu
అనుపమకు గాయం కావడంతో... మను.. అమ్మా అని పిలుస్తాడు. అది విని, మహేంద్ర, వసుధార.. దూరం నుంచి శైలేంద్ర కూడా షాకౌతారు. తర్వాత తేరుకొని.. అనుపమను మహేంద్ర, వసుధార హాస్పిటల్ కి తీసుకొని వెళతారు.
Guppedantha Manasu
హాస్పిటల్ లో..అనుపమకు చికిత్స జరుగుతూ ఉంటుంది. అది చూసి మను కి తమ మధ్య జరిగిన గతం గుర్తుకువస్తుంది. ఆ గతం తాలుకూ విషయాలను మను గుర్తు చేసుకుంటాడు. అనుపమ తనను అమ్మ అని పిలవద్దని చెప్పిన సందర్భం తలుచుకుంటాడు.
Guppedantha Manasu
మను ఏదో పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కోపం వచ్చిన అనపమ.. ఇక నుంచి తనను అమ్మ అని పిలవద్దని.. నీకు నేను ఏమీ కాను అని చెబుతున్నట్లుగా చూపించారు. మరి ఆమె అలా ఎందుకు అన్నది తెలియాలంటే.. పూర్తి గతం రివీల్ అవ్వాల్సిందే. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.