Guppedantha Manasu
Guppedantha Manasu 1st March Episode: మను సహాయంతో మహేంద్ర వాళ్లు ఉన్న ప్లేస్ కి వెళ్లిన వసుధార.. అక్కడ కర్మకాండలు జరగకుండా ఆపేస్తుంది. తర్వాత ఇంటికి వస్తారు. అయితే... మహేంద్ర, వసు దిగులుగా కూర్చొని ఉంటారు. అనుపమ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. మహేంద్రను తిడుతూ ఉంటుంది. అసలు మాకు చెప్పకుండా నువ్వు ఆ పని ఎలా చేస్తావ్ అని సీరియస్ అవుతుంది. మీ అన్నయ్య ఏం చెప్పారు అని నేను, వసుధార చాలా సార్లు అడిగాం. కానీ నువ్వు ఏమీ చెప్పలేదు అని తిడుతుంటే వసు ఆపుతుంది. మామయ్యను ఏమీ అనొద్దు అని అంటుంది. అది కాదమ్మా.. నువ్వు రిషి ఫోటోకి దండ వేస్తేనే తట్టుకోలేదు.. అలాంటిది ఇలా చేస్తే నువ్వు తట్టుకోలేవని మహేంద్రకు తెలీదా అని అనుపమ అడుగుతుంది.
Guppedantha Manasu
అయితే.. ఈ విషయంలో మామయ్య తప్పేమీ లేదని, ఆ శైలేంద్ర చేసిన కుట్ర.. ఆచారాలు, సంప్రదాయాలుు అని చెప్పి ఫణీంద్ర సర్ మనసు మార్చేశారు. ఫణీంద్ర సర్ మాట కూడా మామయ్య కాదనలేకపోయారు అని చెబుతుంది. వాళ్ల అన్నయ్య చెబితే ఏదైనా చేస్తాడా అని అనుపమ అడుగుతుంది. వెంటనే మహేంద్ర తాను తప్పు చేశానని, కానీ.. తప్పక చేశానని వసుధార అర్థం చేసుకుంది.. సారీ వసుధార అని అంటాడు.
Guppedantha Manasu
వెంటనే వసుధార అయ్యో మామయ్య మీరు అలా అనకండి అంటూ వచ్చి పక్కన కూర్చుంటుంది. మీరు మా ప్రేమ మీద నమ్మకం ఉంచండి మామయ్య.. మూడు నెలల్లో రిషి సర్ ని నేను తీసుకువస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. అనుపమ కూడా.. మహేంద్రకు సారీ చెప్పి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
తర్వాత మహేంద్ర.. రిషి పోటో దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. రిషి ముఖం చాలా బాగుంటుందని, రిషి ఫేస్ చూస్తే.. ఎంత కష్టమైనా తగ్గిపోతుందని అంటాడు. తనకు రిషి-వసుల ప్రేమ మీద నమ్మకం ఉందని , నిజంగా నువ్వు బతికున్నావేమో అనిపిస్తోంది అని అంటాడు. డీఎన్ఏ రిపోర్టు ఏమో చనిపోయింది నువ్వే అని చెబుతున్నాయి. కానీ వసు నమ్మకంగా ఉంది కాబట్టి.. అదే నిజం అయితే బాగుండు అని మహేంద్ర.. రిషి ఫోటోతో అంటాడు.
Guppedantha Manasu
మరోవైపు బెడ్రూమ్ లో బెడ్ మీద శైలేంద్ర కోసం ధరని నాలుగు బెల్టులు రెడీ చేసి ఉంచుతుంది. ఏంటది అని శైలేంద్ర అడిగితే.. మీ కోసమే అని చెప్పి నవ్వుకకుంటూ ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ అయిన ప్రతిసారీ శైలేంద్ర తనను తాను కొట్టుకుంటూ ఉంటాడు. దాని కోసం బెల్టు వాడతాడు. అందుకే ధరణి ఈ సారి నాలుగు రెడీ చేసి ఉంచుతుంది. కొట్టకోమని వెన్నపూస రెడీ చేశాను అని చెబుతుంది. అప్పుడే వచ్చిన దేవయాణి అది చూసి.. ధరనిని తిట్టి పంపించేస్తుంది.
Guppedantha Manasu
తర్వాత.. తల్లీ, కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనకు శని ఉందేమో మమ్మీ.. ప్రతిసారీ మనం వేసే ప్లాన్స్ రివర్స్ అవుతున్నాయి అని శైలేంద్ర అంటే... ఈ సారి ప్లాన్ రివర్స్ అవ్వదని, నువ్వు ఎండీ అవ్వడం ఖాయమని అనుకున్నాను అని దేవయాణి అంటుంది. అసలుు వసుధారకు ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటారు. ఆ మను గాడు వచ్చి ప్లాన్ అంతా రివర్స్ చేశాడని ఫీలౌతారు. ఆ మను గాడు కూడా సేమ్ రిషిలాగే ఉన్నాడని, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడని, అతని మాటలకే మీ నాన్న మనసు మార్చుకున్నాడని, వసుధారకు టైమ్ ఇచ్చాడు అని దేవయాణి అంటుంది. అయినా.. అసలు రిషి బతికిలేడు కదా.. ఆ రిషిని వసుధార ఎలా తీసుకువస్తుంది? నిజంగానే తీసుకువస్తుందంటావా? అని దేవయాణి అంటుంది. దానికి శైలేంద్ర ఫ్ఱస్టేట్ అవుతాడు. నా బొంద..చనిపోయిన వాడిని ఎలా తీసుకొస్తుంది అని శైలేంద్ర అంటాడు.
Guppedantha Manasu
రిషి చనిపోయాడని అందరూ నమ్ముతున్నారు. కానీ ఆ వసుధార మాత్రం రిషిని తీసకువస్తానని ఎలా చెబుతోంది అని దేవాయాణి అంటుంది. అప్పుడే ఫణీంద్ర వచ్చి.. నీలా వసుధార ఆలోచించదు కాబట్టి అని అంటాడు. రావడం రావడమే.. వచ్చి తల్లీ, కొడుకులను చెడామడా తిడుతూ ఉంటాడు. రిషి బతికే ఉన్నాడని వసు నమ్ముతుంది కాబట్టి.. మీరు కూడా అదే నమ్మమని చెబుతున్నాను కానీ.. మీరు ఇంకా అదే చర్చించుకుంటున్నారు అని అంటాడు. రిషి గురించి మీకు ఏదైనా సీక్రెట్ తెలుసా అని అడుగుతాడు. అయితే... తమకు ఏమీ తెలియదని దేవయాణి , శైలేంద్ర చెబుతారు. మీరు ఇక మారరని, వసుధారను ఇబ్బంది పెట్టే పని చేస్తే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
మరసటిరోజు కోసం వసుధార.. మను కోసం అతని క్యాబిన్ కి వస్తుంది. మీతో మాట్లాడటానికి వచ్చాను అని వసుధార చెబుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార థ్యాంక్స్ చెబుతుంది. ఎందుకు అంటే.. రిషి సర్ విషయంలో మీరు తనకు చాలా సహాయం చేశారని, రిషి సర్ బతికే ఉన్నాను అని నేను మామయ్యను చాలా సార్లు నమ్మించడానికి ప్రయత్నించినా వాళ్లు నమ్మలేదని.. పైగా కర్మకాండలు చేయాలని చూశారని.. కానీ.. ఇప్పుడు నన్ను వాళ్లు నమ్ముతున్నారని, మూడు నెలలు సమయం ఇచ్చారని, అందుకే మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కూడా సహాయపడిందని వసు చెబుతుంది.
Guppedantha Manasu
రిషి సర్ బతికే ఉన్నారు అనే మీ నమ్మకాన్ని నేను నమ్మానని.. అందుకే మీకు సపోర్ట్ చేశానని మను చెబుతాడు. నీ ప్రేమ చాలా గొప్పది, రిషి సర్ మీద మీకు ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకున్నాను.. మీ ప్రేమ వెలకట్టలేనిది, చాలా విలువైనది.. అందుకే మీ ప్రేమను నిలపెట్టాలని నేను సపోర్ట్ గా నిలపడ్డాను అంతే తప్ప.. మరేమీ లేదని మను చెబుతాడు. అయితే... మనుని తాను చాలా సార్లు అపార్థం చేసుకున్నానని.. సారీ చెబుతుంది. అయితే.. మీరు అలా మాట్లాడినందుకు తానెప్పుడూ ఫీల్ అవ్వలేదని.. నేను ఎక్కడ కాలేజీకి ద్రోహం చేస్తానో అని మీరు భయపడ్డారని నాకు తెలుసు అని మను అంటాడు. తన ఉద్దేశం అర్థం చేసుకున్నందుకు మరోసారి థ్యాంక్స్ చెప్పి.. వసు అక్కడి నుంచి పని ఉందని వెళ్తుంది.
Guppedantha Manasu
మరోవైపు అనుపమ పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఏంజెల్ నుంచి ఫోన్ వస్తుంది. తాను కూడా కాలేజీకి వస్తున్నాను అని ఏంజెల్ చెబుతుంది. ఏంజెల్ ఎందుకు సడెన్ గా వస్తుందా అని అనుపమ ఆలోచిస్తుంది. తర్వాత... మను క్యాబిన్ వైపు వెళ్తుంది. మను బిజీగా వర్క్ చేసుకుంటూ కనపడతాడు. అయితే.. మహేంద్ర అటు వస్తుండటంతో... అనుపమ వెళ్లిపోతుంది. వెళ్తున్న అనుపమను మహేంద్ర పిలిచి.. మనుతో మాట్లాడదాం రమ్మని పిలుస్తాడు. అనుపమ ఏదో చెప్పి తప్పించుకుంటుంది. ఇక.. మహేంద్ర ఒక్కడే మనుతో మాట్లాడటానికి వెళతాడు.
Guppedantha Manasu
నిన్ను చూస్తుంటే తనకు ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని మహేంద్ర చెబుతాడు. ఇంతకాలం తనకు ప్రతి విషయంలో తన కొడుకు అండగా ఉండేవాడని, కానీ ఇఫ్పుడు దూరమయ్యాడని.. ఆ రోజు నుంచి తన మనసులో ఆందోళన తప్ప మరేమీ లేదని.. కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాతే తనకు ధైర్యం వచ్చిందని చెబుతాడు. అప్పుడు మను.. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోమని అన్నారు కదా.. మరి మన అనుకున్నవారికి కష్టం వస్తే.. సహాయం చేయకుండా ఎలా ఉంటాను అని మను చెబుతాడు.
రిషి వస్తాడు అని వసు ఎంత నమ్మకంగా ఉందో.. ఆ నమ్మకాన్ని నువ్వు కూడా అంతే బలంగా నమ్ముతున్నావు కదా అని మహేంద్ర అంటే.. అవునని.. తనకు వసుధార మేడమ్ చెప్పింది.. నమ్మాలని అనిపిస్తోందని మను చెబుతాడు. ఇక.. మహేంద్ర.. రిషి వచ్చే వరకు ప్రతి విషయంలోనూ వసు కి తోడుగా ఉంటావా? రిషి విషయంలో, కాలేజీ విషయంలో వసుకి సహాయం చేస్తావా మాట ఇవ్వమని ఒట్టు వేయించుకుంటాడు. మను కూడా సహాయం చేస్తానని మాట ఇస్తాడు.
ఇక అనుుపమ.. బోర్డు మీటింగ్ లో.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రాజెక్టును మరింత విస్తరించాలని బోర్డు మీటింగ్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.