Guppedantha Manasu 19th February Episode:నీ దుర్మార్గాలకు చరమగీతం పాడుతా శైలేంద్రకు వార్నింగ్, కాలేజీలోకి మను

First Published | Feb 19, 2024, 9:23 AM IST

ప్రతిసారీ ఇలానే చేస్తాను..? నీకు వచ్చి కాపడటానికి కుదురుతుందా అని అడుగుతాడు. అయితే.. తాను కుదిరేలా చేస్తాను అని, నీ దుర్మార్గాలకు చెరమ గీతం పాడతాను అని శైలేంద్రకు మను వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. కాలేజీ పోయి, డబ్బులు పోయినందుకు శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతాడు.

Guppedantha Manasu


Guppedantha Manasu 19th February Episode:కాలేజీ పై కుట్ర చేసింది శైలేంద్ర అనే విషయం మనుకి తెలిసింది. ఫైనాన్సర్స్ కి ఇచ్చిన చెక్ ని మను చింపి వాళ్ల ముఖానే పడేస్తాడు. చెక్ ఎందుకు చింపారు అని వాళ్లు అంటే.. అసలు అప్పు లేదని మను అసిస్టెంట్ అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావ్ అని శైలేంద్ర అంటే..నీ బండారం మొత్తం బయటపెడతాను అని మను అంటాడు.

Guppedantha Manasu

దానికి శైలేంద్ర.. నీ బండారం కూడా బయటపడుతుంది కదా అంటాడు. తాను లేని అప్పుని క్రియేట్ చేస్తే... నువ్వు లేని అప్పు తీర్చినట్లు బిల్డప్ ఇచ్చావ్ కదా.. నీకు నాకు తేడా ఏంటి అని  శైలేంద్ర అంటాడు. నేను నీ అంత దుర్మార్గుడిని కాదు అని మను అంటే.. నువ్వు అంతకు మించిన జగత్ కంత్రీవని, ఏమీ లేకుండానే కాలేజీ రూ.50కోట్లు అప్పు పడేలా చేశావ్ అని, అసలు ఎవర్రా నువ్వు హీరోవా, విలన్ వా, కాలేజీకి నీకు సంబంధం ఏంటి? అని అడుగుతాడు. అయితే.. ఏ సంబంధం లేదని, కాలేజీ కష్టాల్లో ఉంటే వచ్చాను అని చెబుతాడు.

అయితే.. శైలేంద్రకు ఆ మాటకు ఫ్రస్టేషన్ వస్తుంది. ఏ సంబంధం లేకుండా కాలేజీని ఎందుకు కాపాడావ్ అని అడుగుతాడు. నువ్వు నా కుటుంబానికి చుట్టానివా? లేక వసుధారకు ఏమైనా అవుతువా? మొత్తం నా ప్లాన్ అంతా పాడు చేశావ్.. లేకపోతే ఈ పాటికి వసుధార ఎండీ సీటు నుంచి కిందకు దిగేది అని అంటుంది. అలా జరగకూడదనే అలా చేశాను అని మను అంటాడు. దీంతో.. నీకు పాపం తగులుతుందని, చెక్ ఆశ చూపించి చింపేశావ్ అంటాడు. పాప పుణ్యాల సంగతి పక్కన పెడితే.. నువ్వు ఇవన్నీ చెబుతుంటే కామేడీగా ఉందని మను అంటాడు. కాలేజీ పేరుతో తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ డబ్బులు కాజేయాలని చూశావ్.. నీ అంత దుర్మార్గుడిని నేను ఎప్పుడూ చూడలేదని అంటాడు. అయితే.. తాను దుర్మార్గుడినే అని.. ఇక నుంచి దుర్మార్గాలు చేస్తూనే ఉంటాను అని, ప్రతిసారీ ఇలానే చేస్తాను..? నీకు వచ్చి కాపడటానికి కుదురుతుందా అని అడుగుతాడు. అయితే.. తాను కుదిరేలా చేస్తాను అని, నీ దుర్మార్గాలకు చెరమ గీతం పాడతాను అని శైలేంద్రకు మను వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. కాలేజీ పోయి, డబ్బులు పోయినందుకు శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతాడు.


Guppedantha Manasu

ఇక, కాలేజీలో రిషి ఫోటోకి  దండలు వేసి, దండాలు పెడుతూ ఉంటారు. అది చూసి వసుధార కు కోపం వస్తుంది. రిషి సర్ చనిపోయారని, ఇలా చేయకతప్పదని కాలేజీలోవాళ్లు అంటారు. కానీ, వసుధార ఒప్పుకోదు. రిషి సర్ బతికే ఉన్నారని, ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నారు అని చెబుతుంది. కానీ.. కాలేజీ స్టాఫ్ అంగీకరించరు.

Guppedantha Manasu

మీరు భ్రమలో ఉన్నారని, ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారని ఆగామని అంటారు. వసు ఎంత చెప్పినా వినకుండా దండలు వేయాలని చూస్తారు. దీంతో.. మను వచ్చి వాళ్లను ఆపేస్తాడు. ఇక్కడికి వీడు ఎందుకు వచ్చాడు అని శైలేంద్ర అనుకుంటాడు.

Guppedantha Manasu

వెంటనే మను... ఎండీ గారికి నచ్చకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. తప్పక చేస్తున్నాం అని వాళ్లు చెబుతారు. మీకు మీరే చేస్తున్నారా లేక ఎవరైనా చెబితే చేస్తున్నారా అని అడుగుతాడు. ఎవరో చెబితే మేం ఎందుకు చేస్తాం.. మాకు చేయాలనిపించి చేస్తున్నాం అని చెబుతారు. అయితే..  మీరు వసుధార మేడమ్ మాటకు గౌరవం ఇస్తారని తనకు తెలుసని, అయినా ఇలా ఆమెను బాధపెట్టేలా చేస్తున్నారంటే.. మీ వెనక ఎవరో ఉన్నారని,వారు ఇలా ఎందుకు చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు అంటాడు. అయితే.. ఆ మాటలకు వసుధార కూడా షాకౌతుంది. శైలేంద్ర ముఖం మాడిపోతుంది.

తర్వాత.. రిషి కి సంతాప సభ  చేయాలి అనుకున్నవారికి ఫుల్ గా క్లాస్ పీకుతాడు. అయితే.. మను ఎందుకు వచ్చాడా అని అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది.  ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదని అందరికీ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. మను వార్నింగ్ తో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మను చేసిన పనికి మహేంద్ర సంతోషిస్తాడు. థ్యాంక్స్ చెబుతాడు. వెంటనే మను అసిస్టెంట్ వచ్చి.. మీ క్యాబిన్ రెడీ అయ్యింది అని చెబుతాడు. క్యాబిన్ రెడీ అవ్వడం ఏంటి అని వసుధార వాళ్లు షాకౌతారు. శైలేంద్రకు కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. తనకు శనిలా దాపురించాడని, ప్రతి విషయంలో అడ్డు వస్తున్నాడని టెన్షన్ పడుతూ ఉంటాడు.
 

Guppedantha Manasu

తర్వాత వసుధార.. మహేంద్ర, అనుపమలతో మాట్లాడుతూ ఉంటుంది. మను సహాయం చేసినప్పుడే అతని మనసులో ఏదో దురుద్దేశంతో ఉండే ఉంటుందని, ఎవరి పర్మిషన్ లేకుండా క్యాబిన్ ఏర్పాటుచేసుకున్నాడు అని వసు సీరియస్ అవుతుంది. అప్పు తీర్చినంత మాత్రాన.. ఎలాంటి పర్మిషన్ లేకుండా అలా చేస్తాడా? రూ.50కోట్లు ఇచ్చినందుకు తనను ఏమీ అనకూడదని అతని ధైర్యమా అని కోపంగా మాట్లాడుతుంది.

Guppedantha Manasu

అయితే.. మహేంద్ర.. మను నీను మంచి చేస్తున్నాడు కదా, సంతాప సభ కూడా ఆగేలా చేశాడు కదా అని అంటాడు. అయితే.. ఆ మంచి వెనక కూడా ఏదో కుట్ర ఉందని, వసు అనుమానిస్తుంది. ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదని, క్యాబిన్ ఏర్పాటు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. ఇక్కడ వసుధార, మహేంద్ర ఇద్దరూ కలిసి అనుపమను ఆడేసుకుంటారు. ఎవరికీ ఏమీ చెప్పలేక.. అనుపమ సతమతమౌతూ ఉంటుంది. అప్పుడే ప్యూన్ వచ్చి.. బోర్డు మీటింగ్ ఉందని, మినిస్టర్ గారు కూడా వచ్చారని చెప్పడంతో.. వసుధార వాళ్లు కూడా వెళతారు.

Guppedantha Manasu

వసుధార అనుమతి లేకుండా బోర్డు మీటింగ్ పెట్టారని తెలిసి శైలేంద్ర కూడా షాకౌతాడు. ఎందుకు ఈ మీటింగ్ పెట్టారు అని శైలేంద్ర అడిగితే.. మను పెట్టాడు అని మినిస్టర్ చెబుతాడు. ఎందుకు ఏంటి అని శైలేంద్ర అడుగుతుంటే కాసేపు ఆగమని మినిస్టర్ అంటాడు. శైలేంద్ర ఆగకపోయివడంతో.. ఫణీంద్ర కంట్రోల్ చేస్తాడు. వాళ్ల నాన్న కొద్ది రోజులు ఇంకా హాస్పిటల్ లో ఉంటే బాగుండని శైలేంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు.

Guppedantha Manasu

మను ఇలా చేయడంతో ఓవైపు వసుధార, మరోవైపు శైలేంద్ర.. ఏం జరుగుతందో అర్థం కాక ఎవరి ఆలోచనల్లో వారు ఉంటారు. అప్పుడే మనో ఎంట్రీ ఇస్తాడు. డీబీఎస్టీ కాలేజీ డైరెక్టర్లలో తాను కూడా ఒకరుగా ఉండాలని మను అనుకుంటన్నాడని మినిస్టర్ చెబుతాడు. ఆ మాటకు శైలేంద్ర, వసుధార షాకౌతారు.  ఎందుకు ఆ పదవి ఇవ్వాలి అని శైలేంద్ర అడుగుతాడు. 

Guppedantha Manasu

ఒక బోర్డు మెంబర్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ తనకు ఉన్నాయని, అలాగే తాను కూడా కాలేజీ బాగు కోరుకుంటున్నాను అని మను సమాధానం ఇస్తాడు. రూ.50కోట్లు ఇచ్చాను కదా.. బోర్డు మెంబర్ గా ఉండేందుకు ఆ అర్హత సరిపోదా అని అడుగుతాడు. కానీ డబ్బులు ఇచ్చిన రోజు ఎలాంటి పదువులు ఆశించను అని  చెప్పారు కదా.. ఇఫ్పుడు ఎందుకు అడుగుతున్నారు అని వసు ప్రశ్నిస్తుంది. అయితే.. తాను కాలేజీ బాగుకోసం మాత్రమే ఆ పదవి అడుగుతున్నాను అని చెబుతాడు. ఆ కాలేజీ కష్టాల్లో ఉందని వచ్చానని, డబ్బు ఇస్తే సరిపోతుందని అనుకున్నానని, కాలేజీకి సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తేలీక తనకు పదవి వద్దు అన్నాను అని , కానీ.. ఈ రోజు కాలేజీకి తన అవసరం ఉందని అనిపించిందని, కాలేజీని కాపాడటానికి పదవి అడుగుతున్నాను అని చెబుతాడు. అయితే.. వసు మాత్రం అతని మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉందేమో అని అనుమానంగా ఉందని వసుధార అనుమానం వ్యక్తం చేస్తుంది. శైలేంద్ర కూడా తనకు కూడా అలానే అనిపిస్తోందని అంటాడు. 

Guppedantha Manasu

కానీ మను మాత్రం.. అందరినీ మ్యానేజ్ చేస్తాడు. చాలా మంది కాలేజీని నాశనం చేయాలని చూస్తున్నారని, వాళ్ల ఆట కట్టించడమే తన ధ్యేయం అని చెబుతాడు. శైలేంద్ర గురించి మనుకి తెలిసిందేమో అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. ఇక.. మనుకి మినిస్టర్ ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!