Guppedantha Manasu 17th February Episode:చెక్ చింపేసిన మను, గుక్కపట్టి ఏడ్చిన శైలేంద్ర..!

First Published | Feb 17, 2024, 8:57 AM IST

అది కూడా అప్పు అనుకోమన్నాడు.. వీలున్నప్పుడే తిరిగి ఇవ్వమన్నాడు. దేవుడు అనేవాడు కూడా అడిగితేనే వరం ఇస్తాడు, ఇతను అడగకుండానే ఎందుకు ఇన్ని వరాలు ఇస్తాడు? అని వసుధార అంటుంది.

Guppedantha Manasu

Guppedantha Manasu 17th February Episode: ఇంట్లో మహేంద్ర ఆనందంగా మనో చేసిన సహాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. చివరి నిమిషంలో వసుధార కూడా ఏమీ చేయలేక సంతకం పెట్టేస్తుండగా వచ్చియ సహాయం చేశాడని, అతను ఏ తల్లి కన్నబిడ్డో అని, వాళ్ల తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటాడు. వెంటనే వసుధార తాను కూడా అదే ఆలోచిస్తున్నాను అని.. ఏమీ ఆశించకుండా రూ.50కోట్లు ఎందుకు ఇస్తాడా అని అంటుంది. అంటే ఏంటమ్మ నీ ఉద్దేశం అని మహేంద్ర అంటే.. అతను మనకు సహాయం చేశాడు నిజమే, కానీ.. ఆ సాయం వెనక ఏ కుట్ర ఉందో, ఏ మోసం ఉందో మనకు తెలీదు కదా అని వసుధార అంటుంది.

Guppedantha Manasu

అంటే ఏంటమ్మా అని మహేంద్ర మరోసారి అడగగా, ఇప్పటికే చాలా సార్లు మనం చాలా మందిని నమ్మి మోసపోయామని , రీసెంట్ గా భద్ర కూడా సాయం పేరుతో మన పంచన చేరాడని, ఆ శైలేంద్రతో చేతులు కలిపి మన విషయాలన్నీ అక్కడకు చేరవేశాడని, చివరకు మన నాశనం కోరుకున్నాడని గుర్తు చేస్తుంది.

Latest Videos


Guppedantha Manasu

అయితే.. ‘ నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ మనం భద్ర లాంటివాళ్లను, శైలేంద్రను చూసి అందరూ అలానే ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మనకు ఎదురైనవారంతా చెడ్డవారే కావచ్చు. కానీ అందరూ చెడ్డవారే అనుకుంటే ఎలా? సమాజంలో చెడ్డవారు ఎలా ఉన్నారో.. మంచివారు కూడా అలానే ఉన్నారు. ఏమంటావ్ అనుపమ’ అంటాడు.

Guppedantha Manasu

అనుపమ అవును అనేస్తుంది. అయితే... వసుధార మాత్రం మంచివాళ్లు ఉంటారు.. కానీ ఒక్కసారి చూసి మంచివాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వలేం కదా అని అంటుంది. అలా అని చెడ్డవారు అని కూడా అనలేం కదా అని మహేంద్ర అంటే.. మామయ్య మీకు నా ఇంటెన్షన్ అర్థం కావడం లేదు, ఆయన ఇచ్చింది రూ.50కోట్లు, అంత డబ్బంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అయినవారికి డబ్బులు ఇవ్వడానికే ఎవరూ ముందుకు రావడం లేదు, అలాంటిది ఏ సంబంధం లేని  మనకు అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు..? ఏ కారణంతో ఇచ్చాడు..? అది కూడా అప్పు అనుకోమన్నాడు.. వీలున్నప్పుడే తిరిగి ఇవ్వమన్నాడు. దేవుడు అనేవాడు కూడా అడిగితేనే వరం ఇస్తాడు, ఇతను అడగకుండానే ఎందుకు ఇన్ని వరాలు ఇస్తాడు? అని వసుధార అంటుంది.

Guppedantha Manasu

అతని మనసులో ఏదైనా దురుద్దేశం ఉందంటావా అని మహేంద్ర అంటే.. అలా అనడం లేదని, అనుమానిస్తున్నాను అని చెబుతుంది. అసలు అతను ఎవరు..? ఎవరు చెబితే ఎక్కడికి వచ్చాడు..? అతని బ్యాగ్రౌండ్ ఏంటి ? వాళ్ల పేరెంట్స్ ఎవరు? మనం అతనికి ముందే తెలుసా? రిషి సర్ పంపించారు అనుకోండి అంటున్నాడు అంటే రిషి సర్ తనకి ముందే తెలుసా? అని అంటుంది. తెలిసే ఉండచ్చేమో అని మహేంద్ర అంటే.. అయితే.. కాస్త జాగ్రత్తగా ఉండాలి అని వసుధార అంటుంది.

అయితే.. మహేంద్ర మాత్రం అతను మంచివాడిలానే ఉన్నాడని, అంత డబ్బు ఇచ్చినందుకు మరెవరైనా అయితే కాలేజీలో వాటా కానీ, ఏదైనా ప్లేస్ కానీ అడిగేవాడు అని అంటాడు. అలా అడిగితే అనుమానం వస్తుందని  అడగలేదేమో అని వసుధార అని.. అనుపమను ఎందుకు మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. మహేంద్ర కూడా.. అనుపమను ఎందుకు అలా ఉన్నావ్, అతను వచ్చిన దగ్గర నుంచే అలా ఉంది అని అంటాడు. 

కానీ అనుుపమ మాత్రం అదేమీ లేదు అంటుంది. వసు ఊరుకోదు. అన్ని విషయాల్లో మనకు సలహా ఇచ్చే మీరు.. ఇతని విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంది. అయితే,.. తాను ఏమీ చెప్పలేకపోతున్నాను అని చెప్పి సింపుల్ గా తప్పించుకుంటుంది. అయితే మనసులో మాత్రం.. ఇప్పటికే వీళ్లకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే,,, మున్ముందు ఇంకా వస్తాయి.. మను గురించి వీళ్లకు నిజం తెలీకూడదు అని మనసులోనే అనుకుంటుంది.

Guppedantha ManasuGuppedantha Manasu

సీన్ కట్ చేస్తే మను తన అసిస్టెంట్ తో ఆ ఇన్వెస్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. వాళ్లు ఫ్రాడ్ చేశారు అనే విషయం అసిస్టెంట్ రాజు చెబుతాడు. సరిగ్గా అదే సమయానికి వారు చెక్ గురించి అడగడానికి ఫోన్ చేస్తారు. రేపు చెక్ బ్యాంకులో వేసుకోమని మను చెబుతాడు.

Guppedantha Manasu

ఇక ఇంట్లో కూర్చొని శైలేంద్ర ఏడుస్తూ ఉంటాడు. అది చూసి దేవయాణి షాకౌతుంది. నువ్వు ఏడుస్తున్నావా అని అడుగుతుంది, తల్లిని హత్తుకొని మరింత ఏడుస్తాడు. అయితే.. మనం ఏడిపించాలి కానీ... ఏడవద్దు అని  దేవయాణి అంటే... అసలు ఎవడు వాడు మమ్మీ అంటాడు. చివరి నిమిషంలో వచ్చి.. కాలేజీ కాకుండా చేశాడు అని ఏడుస్తూ చెబుతాడు.  ఆ వసుధార సంతకం పెట్టకుండా ఆపేశాడని, ఈ రోజు కూడా మన ఆశలన్నీ అడియాశలు అయ్యాయి అని, వాడు మాత్రం రూ.50కోట్లు చెక్ ఇచ్చాడు అని చెబుతాడు. 

Guppedantha Manasu

దేవయాణి కూడా అసలు ఎవడువాడని, అంత డబ్బు ఇచ్చాడు కాబట్టి తెలిసినవాడు అయ్యి ఉంటాడేమో అని అంటుంది. కానీ వాడు తెలిసినవాడు కాదని.. కనీసం కావాల్సిన వాడు కాదని, తనతో పాటు అందరూ షాకయ్యారు అని శైలేంద్ర చెబుతాడు. తెలిసినవాడు కానప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చాడు అని దేవయాణి అంటే.. సాయం అంట, కష్టాల్లోఉన్నారని తనకు తెలిసిందని.. అందుకే సాయం చేశాను అని చెప్పాడు. కనీసం వడ్డీ కూడా వద్దు అన్నాడు.. దేవుడు ప్రతిసారీ వాళ్లకే సహాయం చేస్తున్నాడని, తనకు మాత్రం ఎందుకు చేయడం లేదు అని ఏడుస్తాడు. దేవుడు నాకు ఎందుకు సహాయం చేయడంలేదు.. నేను అంత రాక్షసుడినా అని  అంటాడు.  దేవయాణి ఓదారుస్తూ ఉంటుంది. ధరణి చెప్పినట్లే జరిగిందని.. ధరణి చెప్పిన మాటలు తలుచుకుంటాడు. తన జాతకంలో శని ఉందేమో.. అందుకే తన కల నెరవేరుతుందేమో అని అంటాడు.

Guppedantha Manasu

అయితే.. శని నీ జాతకంలో కాదని, నీ పెళ్లాం నోటిలో ఉందని.. అది ఏదంటే అదే జరుగుతుందని, దానితో  జాగ్రత్తగా ఉండమని తాను చెబుతూనే ఉన్నానని అయినా నువ్వే వినలేదు, నా మాట లెక్క చేయకుండా ఛాలెంజ్ విసిరావు అని దేవయాణి అంటుంది. అప్పుడు అర్థం కాలేదని.. ఇఫ్పుడు తనకు వణుకుపుడుతోందని, దానిని ఎలా ఫేస్ చెయ్యాలోఅర్థం కావడం లేదు అని శైలేంద్ర భయపడతాడు. ధరణి నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయేమో అందుకే అది అన్నట్లే జరుగుతుంది అని దేవయాణి అంటుంది.

అప్పుడే ధరణి.. ఏమండీ అని ఎంట్రీ ఇస్తుంది. ఆయన కాలేజీకి వెళ్లి వచ్చారేమో బాగా అలసిపోయి ఉంటారని.. కాఫీ కావాలా అని అడుగుదాం అని వచ్చాను అంటుంది. వద్దు అని దండం పెట్టిమరీ వెళ్లమంటాడు. అయితే.. దేవయాణి తనకు కాఫీ తెమ్మని అడుగుతుంది. ఆ విషయంలోనూ ధరణి కాసేపు శైలేంద్ర, దేవయాణిలను ఆడుకుంటుంది. 
 

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే వసుధార,. మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అతనితో మాట్లాడి నిజం ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటుంది, వెంటనే మను కి ఫోన్ చేస్తుంది. కలిసి మాట్లాడాలి అంటుంది. మను సరే అని ఒప్పుకుంటాడు. ఇక.. మను రెడీ అయ్యి బయటకు వెళతాడు.

Guppedantha Manasu

శైలేంద్ర.. ఆ ఇద్దరు ఫైనాన్సర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. రూ.50కోట్లు ప్రాఫిట్ ఇస్తే.. మాకు జస్ట్ రూ.కోటి మాత్రమే ఇస్తారా అని శైలేంద్రతో బేరాలు ఆడుతూ ఉంటారు. వాళ్లు డబ్బుల గురించి బేరాలు ఆడుతుంటే మను అక్కడికి వచ్చి.. నేను సెట్ చేయనా అని అడుగుతాడు. మను ని చూసి వాళ్లు అందరూ షాకౌతారు. మనీ మ్యాటర్ నేను బాగా సెట్ చేస్తాను అని అంటాడు.

వెంటనే శైలేంద్ర సెట్ చేయడం ఏంటి..? మేము ఏదో కాజ్యువల్ డిస్కషన్ లో ఉన్నాం అంటాడు. అయితే.. కాలేజీ సొంతం చేసుకోవాలి అనుకున్న వాడితో కాజువల్ డిస్కషన్ ఏంటి అని మను అడుగుతాడు. దానికి.. ఇంకోసారి మా కాలేజీ జోలికి రావద్దని మాట్లాడుతున్నానని, వార్నింగ్ ఇస్తున్నానని శూలేంద్ర కవర్ చేయాలని చూస్తాడు. కానీ... మను కనిపెట్టేస్తాడు. వాళ్ల చేతిలో ఉండాల్సిన చెక్ మీ చేతిలో ఉంది ఏంటి అని మను అడిగితే.. ఏమౌంట్ , డేట్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను అని చెబుతాడు. నేను కూడా చెక్ చేస్తాను అని మను తీసుకొని ఆ చెక్ ని చింపి పారేస్తాడు.
 

Guppedantha Manasu

చెక్ చింపుతున్నారేంటి అని శైలేంద్రతో పాటు ఫైనాన్సర్స్ కూడా టెన్షన్ పడతారు. దీనినే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు అని అంటాడు. కాలేజీలో వీళ్లను చూసినప్పుడే డౌట్ వచ్చిందని.. ఏ ఫైనాన్స్ కంపెనీ కూడా డైరెక్ట్ గా కాలేజీ ని తీసుకుంటాం అని అనదని,  వీళ్ల వెనక ఎవరు ఉన్నారా అని నిఘా పెట్టానని, ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా కనిపెట్టలేడని, వీళ్ల వెనక ఉంది నవ్వే అని అర్థమైందని మను అంటాడు. వీళ్లకు కమిషన్ ఆశ చూపించి.. వీళ్లను నడిపించింది నువ్వే అని నాకు అర్థమైంది అని మను అంటాడు... వాళ్లతో తనకు సంబంధం లేదని శైలేంద్ర అంటాడు. అయితే ఫైనాన్సర్స్ మా అప్పు తీర్చలేదని  మేం కోర్టు కి వెళతాం అని ఫైనాన్సర్స్ అంటారు. అయితే.. ఆ డాక్యుమెంట్స్ ఫేక్ అని బ్యాగౌండ్ వెరిఫికేషన్ లో తేలిందని మను అసిస్టెంట్ రాజు చెబుతాడు. ఆ మాటలకు ఫైనాన్సర్స్ గుటకలు మింగుతారు. మీ బండారం మొత్తం బయటపెడతాను అని శైలేంద్రకు మను వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

click me!