Guppedantha manasu 16th February Episode:శైలేంద్రకు కుర్చీ పనిష్మెంట్, అనుపమ కొడుకే మనో..?

First Published | Feb 16, 2024, 8:50 AM IST

 నాకు ఎండీ సీటు వచ్చేస్తోంది అని ఊహల్లో తేలిపోతూ ఉన్నావ్.. ఈలోపు వాడు వచ్చాడు.. వాడు చెప్పేది చేసేశాడు అని రాజీవ్ అంటాడు.

Guppedantha Manasu

Guppedantha manasu 16th February Episode: కాలేజీ తన సొంతం అయిపోతుందని శైలేంద్ర చాలా కలలు కన్నాడు. కానీ.. చివరి నిమిషంలో అంతా రివర్స్ అయిపోయింది. మనో ఎంట్రీతో శైలేంద్ర కథ అడ్డం తిరిగింది. మనో వచ్చి రూ.40కోట్లు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఈ ఊహించని సంఘటనకు శైలేంద్రకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉంటాడు. రాజీవ్  తో కలిసి శైలేంద్ర ఓ ప్లేస్ కి వెళతాడు. అక్కడ తన ఫ్రస్టేషన్ తీరాలే గట్టిగా అరుస్తూ ఉంటాడు. తాను వేసుకున్న సూట్ కూడా తీసేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయితే... చిన్నగా అరవమని రాజీవ్ అంటాడు. కాస్త కూల్ గా ఉండమని చెబుతాడు.నేను ముందు నుంచి చెబుతున్నా వాడు వస్తాడు వస్తాడు  అని, చివరి నిమిషంలో వాడు వచ్చే ముందు కూడా వాడు వస్తున్నాడు అని నేను చెబుతూనే ఉన్నా.. కానీ నువ్వు నేను చెప్పేది వినకుండా వసుధార సంతకం పెట్టేస్తోంది,.. నాకు ఎండీ సీటు వచ్చేస్తోంది అని ఊహల్లో తేలిపోతూ ఉన్నావ్.. ఈలోపు వాడు వచ్చాడు.. వాడు చెప్పేది చేసేశాడు అని రాజీవ్ అంటాడు.

Guppedantha Manasu

దానికి శైలేంద్ర... అసలు ఎవడువాడు? వాడికీ వసుధారకు ఏంటి సంబంధం..? కాలేజీతో వాడికి సంబంధం ఏంటి అని అరుస్తాడు. అయితే.. తనకు తెలీదని, ఆరోజు కూడా తాను వసుతో మాట్లాడుతుంటే వచ్చి గోల గోల  చేశాడు అని రాజీవ్ చెబుతాడు. అపరిచితుడు మూవీలో హీరో పాపాలు పెరిగిపోయినప్పుడు వచ్చినట్లు.. కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాడేమో అని రాజీవ్ అంటాడు. అయితే.. అసలు ఎవడు వాడు.. అంత డబ్బు ఎవరైనా ఇస్తారా.. అప్పుగా కూడా ఇవ్వరు కదా.. వాడు ఎందుకు ఇచ్చాడు.. చివరి నిమిషంలో కాలేజీ నాకు దక్కుతుంది అనగా  ఎవడో ఒకడు వస్తున్నాడని, లాస్ట్ టైమ్ మురుగన్ వచ్చాడని, ఇప్పుడు వీడు వచ్చాడు అని శైలేంద్ర అంటాడు. లాస్ట్ టైమ్ అంటే రిషిగాడు బతికున్నాడు కాబట్టి.. ఆపేశాడు అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు ఆ రిషిగాడు లేడు కదా .. వాడు లేకున్నా కూడా కాలేజీని సొంతం చేసుకోలేకపోతున్నాను.. ఏంటిది అని ఫ్రస్టేషన్ తో శైలేంద్ర అరుస్తూ ఉంటాడు.


Guppedantha Manasu

రాజీవ్ కూడా.. నీకు ఈ సారి ఎండీ సీటు వచ్చేస్తుందని.. వసుధారను ఎత్తుకెళ్లిపోవచ్చని అనుకున్నానని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని రాజీవ్ అంటాడు. వాడెవడో అనకొండ లా లాస్ట్ మినిట్ లో నా ముందు నుంచే వెళ్లాడని, ఆ షాక్ నుంచి తేరుకొని నేను నీకు విషయం చెప్పేలోగా అంతా జరిగిపోయింది అని రాజీవ్ అంటాడు. ఇక.. ఇద్దరూ తమ ధరిద్రం గురించి మాట్లాడుకుంటారు. కానీ.. రాజీవ్ మాటలకు శైలేంద్రకు ఇంకా విసుగు వస్తుంది. నీకు వసుధార మీద ఎంత ఆశ ఉందో తెలీదు కానీ.. తనకు మాత్రం ఎండీ సీటు మీద చాలా ఆశలు ఉన్నాయని.. దాని కోసం ప్రాణాలు అయినా ఇస్తానని., ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను అని, ఎన్నో కుట్రలు, దారుణాలు చేశానని, ఆఖరికి ప్రాణాలు కూడా తీశానని, అయినా ఆ సీటు మాత్రం దక్కడం లేదని  శైలేంద్ర చెబుతూ ఉంటాడు. మరోసారి మంచిగా ప్లాన్ చేద్దాం అని  చెప్పి.... శైలేంద్రను ఇంటికి వెళ్లమని రాజీవ్ చెబుతాడు.

Guppedantha Manasu

ఇక ఇంటికి వెళ్లమని రాజీవ్ చెప్పడంతో... సరిగ్గా అదే సమయంలో ధరణి చెప్పిన మాటలు గుర్తుకువస్తాయి. మీకు ఆ ఎండీ సీటు దక్కదని.. ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు అని ధరణి చెప్పినట్లే జరగడంతో శైలేంద్ర ఆలోచనలో పడిపోతాడు. అసలే.. ధరణితో ఛాలెంజ్ కూడా చేస్తాడు.. ఎండీ సీటు రాకుంటే నీ కాళ్ల కింద కుక్కలా పడి ఉంటానని, నువ్వు చెప్పింది చేస్తాను అని మాట కూడా ఇస్తాడు. అదే తలుచుకొని భయపడుతూ ఉంటాడు. ధరణి చెప్పినట్లే జరిగిందని.. ఆమె చెప్పినట్లు తన జాతకంలో ఎండీ సీటు రాసి లేదా  అని  తెగ ఫీలైపోతూ ఉంటాడు.

Guppedantha Manasu

ఇక.. మనో కి అనుపమ పెద్దమ్మ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఈరోజు కాలేజీకి వెళ్లావ్ కదా అని అడుగుతుంది. వెళ్లాను అని మనో చెబుతాడు. అనుపమను కలిశావా అని  అడిగితే.. కలిశాను చూశాను అని, మాట్లాడలేదని చెబుతాడు. కనీసం అనుపమ అయినా నీతో మాట్లాడటానికి ట్రై చేసిందా అంటే..జస్ట్ తాను కాలేజీ సమస్య తీర్చడానికి వెళ్లానని అంటాడు. ఆ కాలేజీ కోసం అంత రిస్క్ చేశావ్ అంట రూ.50కోట్ల చెక్ ఇచ్చావంట.. ఆ కాలేజీతోనీకు ఉన్న అఫెక్షన్ ఏంటి? అని ఆ పెద్దావిడ అడుగుతుంది.

అయితే.. ఆ కాలేజీ పద్దతులు, విధి విధానాలు తనకు దగ్గర చేశాయని, డీబీఎస్టీ కాలేజీ ఎటువంటి ప్రాబ్లంలో ఇరుక్కోకూడదని, మిషన్ ఎడ్యుకేషన్ లాంటి గొప్ప ప్రాజెక్ట్ మొదలుపెట్టిందని, రిషితో కూడా ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడానని.. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని.. కేవలం ఆ కాలేజీ బాగుండాలనే కోరుకున్నానని, అంతే తప్ప.. తనకు ఏ స్వార్థం లేదు అని చెబుతాడు. అయితే.. మనో చేసిన పనికి పెద్దావిడ మెచ్చుకుంటుంది. చాలా గొప్ప పని చేశావ్ అని.. నువ్వు సంపాదించినదంతా... మంచి పనుల కోసం కేటాయిస్తున్నావని మెచ్చుకుంటుంది.

Guppedantha Manasu


సీన్ కట్ చేస్తే.. రిషి ఫోటో చూస్తూ వసు ఆనందంగా మాట్లాడుతుంది.  కాలేజీ సమస్య తీరిందని, మనో వచ్చి కాలేజీని మళ్లీ తన చేతిలో పెట్టాడు అని రిషి ఫోటోతో చెబుతూ ఉంటుంది. మీరే అతని రూపంలో వచ్చి సమస్య తీర్చినట్లు అనిపించిందని, అందుకే అతని పేరు అడిగాను అని చెబుతుంది. ఏదో ఒక రూపంలో మీరు వచ్చి ఈ సమస్య తీరుస్తారని అనుకున్నానని.. తాను అనుకున్నట్లే సమస్య తీరిందని.. చాలా సంతోషంగా ఉందని అంటుంది. ఆ కాలేజీ ఇప్పుడు కాదు.. ఎప్పటికీ మనతోనే ఉంటుందని.. ఆ కాలేజీ మనకు ఇల్లు, ఆ కాలేజీ మన దేవాలయం , దానికి ఏమీ కానివ్వను అంటుంది. మీరు ఎక్కడ ఉన్నా.. మీరు రండి సర్.. మీరు వచ్చి అందరి నోళ్లు మూయించండి సర్ అని ఏడుస్తూ మాట్లాడుతుంది.

Guppedantha Manasu

మరోవైపు అనుపమ.. మనో వచ్చి డబ్బులు కట్టిన సందర్భాన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తన పెద్దమ్మకు కాలేజీ సమస్యలో ఉందని చెప్పకుండా ఉంటే బాగుండేదని అనుకుంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతాడు. బానే ఉన్నాను అని అంటుంది. భోజనం చేయమంటే.. ఆకలిగా లేదని చెబుతుంది. టెన్షన్ ఎందుకు పడుతున్నావ్ అని అడిగితే.. అదేం లేదని టెన్షన్ పడుతూనే చెబుతుంది. కాలేజీ సమస్య తీరింది కాబట్టి.... ఇప్పుడు టెన్షన్ ఎందుకు పడతాను అని అంటుంది.

ఆ వెంటనే మనో చాలా మంచి వాడిలా ఉన్నాడని, డబ్బులు ఇచ్చి కూడా. కాలేజీ మీ పేరు మీదే ఉంటుందని, కాలేజీ ఎప్పటికైనా మీదే అని చెప్పాడు కదా అని మహేంద్ర అంటాడు. మనో నీకు తెలుసా? అతను వచ్చినప్పుడు నువ్వు టెన్షన్ పడినట్లు అనిపించింది.. అంతకముందు పరిచయం ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అయితే. దేనికీ సమాధానం చెప్పకుండా తెలీదు అన్నట్లుగా తల ఊపి.. పని ఉందని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu

ఎండీ సీటు వస్తుందని తాను ధరణితో ఛాలెంజ్ చేశానని.. కానీ.. ధరణి చెప్పినట్లే జరిగిందని.. ఇప్పడు తనకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో.. ఇంతకాలం తనని నేను పెట్టిన టార్చర్ కి ఎలాంటి శిక్ష వేస్తుందో అని భయపడుతూ శైలేంద్ర ఇంట్లోకి అడుగుపెడతాడు. అయితే.. కాలికి ఓ కుర్చీ తగులుతుంది. వెంటనే ధరణిని పిలిచి.. ఇంట్లో ఉన్న ఫర్నీచర్ అంతా ఏమైందని అడుగుతాడు. అవన్నీ ఎందుకని.. ఈ కుర్చీ ఒక్కటి సరిపోతుంది కదా అని ధరణి చెబుతుంది. ఈ రోజు నుంచి మీరు ఈ కుర్చీలోనే కూర్చోవాలని.. మీకు కుర్చీ పిచ్చి తగ్గేవరకు  అని చెబుతుంది. అదే.. మీకు ఎండీ సీటు పిచ్చి పట్టింది కదా... ఆ పిచ్చి వదిలేవరకు ఇందులో కూర్చోమని చెబుతుంది.

Guppedantha Manasu

తర్వాత.. ఛాలెంజ్ గుర్తు చేస్తుంది. నా బదులు ఇంటి పని, వంట పని కూడా మీరే చేస్తారు అన్నారు కదా అని చెబుతుంది. అయితే.. తాను మిమ్మల్ని బానిసలా చూడను అని.. ఆ పనులేమీ కూడా మీతో చేయించనని.. కేవలం ఈ కుర్చీలో కూర్చుంటే చాలు అని చెబుతుంది. అయితే...కూర్చోను అని శైలేంద్ర అంటే.. అయితే ఇంటి పనులు చేస్తారా అని అడుగుతుంది.  పందెంలో ఓడిపోతే తాను చెప్పింది చేయాల్సిందే అంటుంది. బలవంతంగా ఆ కుర్చీలో శైలేంద్రను కూర్చోపెడుతుంది. అలా కూర్చున్న శైలేంద్రను చూసి, ఆకుర్చీ మీకు బాగా సూటయ్యిందని.. రాజులా ఉన్నారు అని మురిసిపోతుంది. నా దిష్టే తగిలేలా ఉందని అంటుంది. అయితే.. అదంతా శైలేంద్ర కళ.  ధరణి అలాంటి కుర్చీ ఏమీ పెట్టదు.  కాఫీ కావాలా అని అడుగుతుంది. వద్దు అని వెళ్లిపోతూ ఉంటాడు. ఛాలెంజ్ గురించి మాట్లాడటం లేదేంటని.. తిట్టకపోయినా తిట్టినట్లే ఉందని అనుకుంటూ వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

మహేంద్ర, అనుపమ, వసుధార ఒకచోట కూర్చొని ఉంటారు. అతని పేరు ఏంటి అని మహేంద్ర అడిగితో మనో అని అనుపమ చెబుతుంది. అతను దేవుడిలా వచ్చి.. మనకు సహాయం చేశాడని.. అతను ఎవరు కన్న బిడ్డ అని, వాళ్ల తల్లిదండ్రులకు రుణపడి ఉండాల్సిందే అని మహేంద్ర అంటాడు. ఏమీ ఆశించకుండా రూ.50కోట్లు ఎందుకు ఇస్తాడా అని నేను కూడా ఆలోచిస్తున్నాను అని వసు అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!