Brahmamudi
BrahmaMudi 15th march Episode: కళ్యాణ్ కారణంగానే తమ కుటుంబం పరువు పోతుందని కావ్య భావిస్తుంది. ఇదే విషయాన్ని కళ్యాణ్ కి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తానేం తప్పు చేశాను అని కళ్యాణ్ అడిగితే.. వీళ్లు అందరూ మాటలు అనడానికి కారణం మీరే అని కావ్య అంటుంది. మీకు పెళ్లి అయ్యింది కాబట్టి.. అప్పూకి దూరంగా ఉండాలని కావ్య అంటుంది. కానీ.. తమది స్నేహం అని.. భారీ డైలాగులు కళ్యాణ్ కొడతాడు. కానీ.. మీరు మగవాళ్లని.. కానీ తన చెల్లి పై అందరూ నిందలు వేస్తున్నారని కావ్య తన బాధను చెబుతుంది, అయినా కళ్యాణ్ అర్థం చేసుకోడు. మా స్నేహంలోని పవిత్రతను మీరు అర్థం చేసుకుంటే చాలు అని కళ్యాణ్ బదులిస్తాడు. కావ్య.. అనామిక అపార్థం చేసుకుంటోంది అని చెప్పినా కూడా.. కళ్యాణ్ వినడు. ఎవరు ఏమనుకున్నా తాను అప్పూని దూరం పెట్టను అని.. అలా దూరం పెడితే, నిజంగానే మా బంధంలో తప్పు ఉందని ఒప్పుకున్నవాళ్లం అవుతామని, ఆ పొరపాటను తాను చేయను అని.. అప్పూని కలవాలి అనుకుంటే కలిసి తీరతాను అని తెగేసి చెబుతాడు. ఈ విషయంలో మీ మాట విననందుకు క్షమించండి అని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Brahmamudi
ఉదయాన్నే కావ్య.. రాజ్ కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ కాఫీ తాగిన రాజ్.. తన కబోర్డ్ లో ఉన్న డబ్బు తీసి కావ్య చేతిలో పెడతాడు. కాఫీ అంత ఖరీదు కాదు అని కావ్య అంటే.. అది కాఫీ కోసం కాదని, నువ్వు వేసిన డిజైన్స్ కోసం అని చెబుతాడు. దానికి శాలరీ ఇస్తున్నారుగా అని కావ్య అంటే... అప్పటి వరకు నువ్వు ఉండవు కదా.. పాస్ పోర్టు కూడా వచ్చేసింది కదా.. మీ బావతో ఫారిన్ వెళ్లిపోతావ్ కదా అని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Brahmamudi
రాజ్ అలా వెళ్లగానే.. ఇందిరాదేవి, భాస్కర్ వస్తారు. అప్పుడే.. కావ్య.. దారి ఖర్చులకు రాజ్ తనకు డబ్బులు ఇచ్చి వెళ్లాడని చెప్పి బాధపడుతుంది. కానీ.. ఇందిరాదేవి కావ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. రాజ్ ది చిన్న పిల్లాడి మనసు అని.. నువ్వు విడిపోతున్నావు అంటే తప్ప.. రాజ్ మనసులో ప్రేమ బయటపడదని, విడాకుల పేపర్ల పై సంతకం పెట్టాల్సిందే అని ఆమె అంటుంది. భాస్కర్ కూడా.. రాజ్ కి నీమీద ప్రేమ ఉందని తనకు కూడా తెలుసు అని.. నువ్వు సంతకం చేయక తప్పదు అని చెబుతాడు. నిర్ణయం నీదే అంటూ... కావ్య చేతిలో విడాకుల పేపర్లు పెట్టి.. వెళ్లిపోతారు.
Brahmamudi
ఇక కావ్య... ఆ విడాకుల కాగితాలు చేతిలో పట్టుకొని.. తన ఆరాధ్య దేవుడు కృష్ణుడు ముందు తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. చాలా సేపు ఆ దేవుడిని నిందిస్తుంది. అందరూ విడిపోవడానికి ఈ కాగితాలపై సంతకం చేస్తారని, తాను మాత్రం.. కలిసి ఉండటానికి చేస్తున్నాను అని.. భారమంతా ఆ దేవుడిపై వేసి కన్నీళ్లతో ఆ పేపర్లపై సంతకం చేస్తుంది. బ్యాగ్రౌండ్ లో సీరియల్ టైటిల్ సాంగ్ ఫ్లే అవుతుంది. వారి పెళ్లినాటి సీన్స్ కూడా వేస్తారు. ఆ సీన్ మొత్తం చాలా ఎమోషనల్ గా సాగింది. తాను ఏడుస్తూ.. చూస్తున్న ప్రేక్షకుల్లోనూ కన్నీళ్లు వచ్చేలా కావ్య నటించింది.
Brahmamudi
తర్వాతి సీన్ లో కావ్య ఆ పేపర్స్ పట్టుకొని తన బెడ్రూమ్ దగ్గరకు వెళ్తుంది. రాజ్ ఆఫీసుకు రెడీ అవుతూ ఉంటాడు. అయితే.. రాజ్ ని వదిలేయడం ఇష్టం లేని కావ్య.. ఆ పేపర్లు విసిరేసి.. వెనక నుంచి రాజ్ ని హత్తుకుంటుంది. నాకు మీరే కావాలి.. మీరు లేకుండా బతకలేను అని ఏడుస్తుంది. ఆసీన్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అయితే.. అదంతా కావ్య కల. అలా చేయాలని మనసులో ఉన్నా.. చెప్పలేక ఆగిపోతుంది.
Brahmamudi
రాజ్ అప్పుడే కావ్యను చూసి... అక్కడే ఆగిపోయావే.. లోపలికి రమ్మని పిలుస్తాడు. మీ అనుమతి కోసం అని అంటుంది. ఏం కావాలి అని రాజ్ అంటే... తన చేతిలోని పేపర్లు చేతిలో పెడుతుంది. స్వప్నకు లాగా నీకు కూడా ఆస్తికావాలా.. ఆ హక్కు నాకు లేదు అని రాజ్ అంటాడు. ఆస్తి కాదని.. విడాకుల పత్రాలు అని చెబుతుంది. ఆ మాట విని రాజ్ షాకౌతాడు. ఈ మాట నేను అనలేదని.. మీరే.. నాకు విడాకులు ఇచ్చి..శ్వేతను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అని కావ్య అంటుంది.
Brahmamudi
భార్యభర్తల మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. కానీ.. అసలు ప్రేమ లేకుండా ఉండటం కష్టం అని కావ్య అంటుంది. సంవత్సరంపాటు.. మీరు మారతారని, నా పై ప్రేమను పెంచుకుంటారని ఎదురు చూశానని.. కానీ మీరు మారరు అనే విషయం అర్థమైందని , ఈ విషయం తెలిసిన తర్వాత కూడా .. ఇంకా నేను మీ జీవితంలో ఉండటం కరెక్ట్ కాదు అని, అందుకే విడాకుల పత్రాలపై సంతకం చేసి తీసుకువచ్చాను అని, మీరు కూడా సంతకం చేసి కోర్టుకు వెళితే వెంటనే విడాకులు వస్తాయి అని కావ్య అంటుంది. ఆ మాటలకు రాజ్ రాయిలా నిలపడి చూస్తూ ఉంటాడు. ఇక.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు మీరు చెబుతారా? నన్ను చెప్పమంటారా అని కావ్య అడుగుతంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.