
Guppedantha Manasu 15th march Episode: మను చేసిన బర్త్ డే వేడుకలను తలుచుకొని వసుధార మనసు పొంగిపోతూ ఉంటుంది. మరోవైపు తనకు తన పుట్టినరోజు కూడా గుర్తు లేదు అని మను చెప్పిన మాట తలుచుకొని అనుపమ బాధపడుతూ ఉంటుంది. అయితే.. వసు ముఖంలో ఆనందం చూసి.. ఎంటి స్పెషల్ బర్త్ డే అని ఆనందపడుతున్నావా అని అడుగుతుంది. కాదని.. మను బర్త్ డే చేసిన విధానానికి ఆనందపడుతున్నానని, అసలు బర్త్ డే నే వద్దు అనుకున్న నాకు.. రిషి సర్ పక్కనే ఉండి చేసినంత సంతోషంగా అనిపించింది అని వసుధార చెబుతుంది.తర్వాత.. మను పై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది.
కొడుకు గురించి అడగడంతో అనుపమ పొంగిపోయి ప్రశంసలు కురిపిస్తుంది. మంచివాడని, ఎదుటివారికి కష్టం వస్తే తట్టుకోలేడని, ఎవరికైనా సహాయం చేస్తాడు అని చెబుతుంది. నిజమే అని.. మొదట వద్దు అన్నా బర్త్ డే చేస్తున్నాడని తనకు కోపం వచ్చిందని కానీ... నేను సంతోషంగా ఉండాలని.. నాకు నచ్చేలా చేశాడు అని వసుధార అంటుంది. అనవసరంగా అందరి ముందు తనని తిట్టానని కూడా గుర్తు చేసుకుంటుంది. ఇందాకా మను గారికి ఫోన్ చేశాను అని.. రిషి సర్ ని వెతకడంలో తనకు సహాయం చేయమని అడిగానని, చేస్తాను అని మాట ఇచ్చాడని చెబుతుంది.
వసు ఆనందానికి అనుపమ కూడా సంతోషిస్తుంది. మనం కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాం కదా.. రిషి తొందరగా తిరిగి రావాలని.. నేను రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అని అనుపమ అంటుంది. అయితే... ఒక్క నిమిషం వసుధార.. కన్ను రెప్పకొట్టకుండా.. అనుపమనే చూస్తుంది. అది గమనించిన అనుపమ.. నన్నుు ఏదైనా అడగాలా అని అంటుంది. అడిగితే చెబుతారా మేడమ్ అని వసు అంటుంది. సమాధానం ఉంటే కచ్చితంగా చెబుతాను అని అనుపమ అనడంతో.. మను గారితో మీకు ఏమైనా శత్రుత్వం ఉందా అని అడుగుతుంది. ఆ మాటకు అనుపమ షాకౌతుంది.
ఎందుకు అలా అడుగుతున్నావ్ వసుధార అని అనుపమ అనడంతో.. మను వచ్చినప్పటి నుంచి మీలో చేంజ్ వచ్చిందని అంటుంది. మను పర్సనల్ విషయాలు అడిగిన ప్రతిసారీ మీరు మధ్యలో దూరి చెప్పకుండా ఆపేస్తారు. మనుని చూసినప్పుడు మీ ఫేస్ లో ఆనందం కనపడుతుంది. కానీ.. ఆ వెంటనే మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. గతంలో.. రిషి సర్, జగతి మేడమ్ ల మధ్య కూడా సేమ్ ఎమోషన్ నిచూశాను.. మీ ఇద్దరి మధ్య కూడా సేమ్ ఎమోషన్ ని నేను చూశాను అని వసు అంటుంది. కానీ... మీకు పెళ్లి కాలేదు అని మీరు చెప్పారు.. సో.. మను మీకు కొడుకు అయ్యే ఛాన్స్ లేదు.. కానీ.. మీకు పెళ్లి అయ్యిందేమో అని నాకు అనుమానం గా ఉంది.. నిజం చెప్పండి మేడమ్.. మీకు పెళ్లి అయ్యింది కదా అని వసుధార అడుగుతుంది.
ఆమాటకు అనుపమ ఎమోషనల్ అవుతుంది. నాకు పెళ్లి కాలేదు.. నేను ఒంటరిదానినే వసుధార.. ఆడదాని మనసు నీకు తెలీదా..? పసుపు కుంకుమలకు ఎంత విలువ ఇస్తుందో నీకు తెలుసు కదా..ఏదో ఒక సమయంలో అయినా.. నిజంగా పెళ్లి అయ్యి ఉంటే భర్త పేరు చెప్పేదాన్ని కదా అని అనుపమ అంటుంది. మరి మీ ఇద్దరి మధ్య గతం ఏంటి..? గతంలో మీకు, మనుకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని వసుధార ప్రశ్నిస్తుంది. గతంలో మీకు ఏదైనా గాయం జరిగిందా..? అందుకే మీరు చెప్పలేకపోతున్నారా అని అడుగుతుంది. కానీ.. అనుపమ తన దగ్గర సమాధానం లేదని.. ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడు అడగొద్దు అనేస్తుంది. గతంలోనూ తాను కూడా అందరినీ ఇలానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేదానిని అని, ఎదుటివాళ్లు ఎంత బాధపడేవారు ఇప్పుడే తెలిసిందని.. నువ్వు కూడా నాకు ప్రశ్నలు వేయకు అని అంటుంది.
నువ్వు సంతోషంగా ఉన్నావ్.. ఎప్పుడూ సంతోషంగా ఉండు అది చాలు.. ఇంకెప్పుడు ప్రశ్నలు వేయకు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే... అనుపమ సమాధానాలు దాటేసింది కానీ.. సమాధానం మాత్రం చెప్పలేదని, ఏదో గతం అయితే ఉంది అనే విషయం వసుకి అర్థం అవుతుంది.