Guppedantha Manasu
Guppedantha Manasu 15th march Episode: ఇంటికి వెళ్తున్న మనుకి రాజీవ్ ఎదురుపడతాడు. ఎదురుపడటమే కాకుండా.. వసుకి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు, ప్రతిసారీ నాకు అడ్డుపడుతున్నావ్ అని అంటాడు. కానీ.. మను కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తాడు. వసుధార మేడమ్ జోలికి వస్తే.. చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. బెదిరించడమే కాదు.. నిజంగా చంపేస్తాను అని.. చేతికి పచ్చరాయి ఉన్న వాడి చేతిలోనే నీ చావు రాసి పెట్టి ఉంది..కావాలంటే జాతకం చూపించుకో అని చెప్పి మరీ మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
ఇక.. వసుధార ఇంట్లో మను గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తన పుట్టిన రోజు సంతోషంగా జరుపుకునేలా చేసినందుకు చాలా సంతోషడుతుంది. చాలా సేపు మనుకి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచించి చివరకు ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. నేను వసుధారను అని పరిచయం చేసుకుంటుంది. అయితే.. తన దగ్గర ఫోన్ నెంబర్ ఉందని, పరిచయం చేసుకోవాల్సిన అవసరంలేదని మను అంటాడు. విషయం ఏంటి అని అడిగితే.. తన పుట్టిన రోజు చేసినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది. అసలు.. మీకు బర్త్ డే చేసుకోవడమే ఇష్టం లేదు అన్నారు కదా అని మను అంటే.. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను అని, కానీ.. మీరు చేసిన బర్త్ డే తనకు రిషి సర్ ని గుర్తు చేసిందని చెబుతుంది. అందుకే.. మళ్లీ మళ్లీ థ్యాంక్స్ చెబుతుంది.
Guppedantha Manasu
తాను థ్యాంక్స్ కోసం చేయలేదని, మీ మనసు సంతోషపెట్టడానికి మాత్రమే చేశాను అని మను అంటాడు. అసలు అంత మందితో ఏవీ ఎప్పుడు ప్లాన్ చేశారు అని వసు అడిగితే.. వారం రోజుల క్రితమే చేశాను అని.. అందుకే మహేంద్ర సర్ సహాయం చేశారు అని చెబుతాడు. పుట్టినరోజు నాడు మీరు దిగాలుగా ఉండటం తనకు ఇష్టం లేదని.. సంతోషపెట్టాలనే ఇలా చేశానని.. మీకు ప్రపంచంలో రిషి సర్ కి మించి ఎక్కువ ఏదీ లేదని తెలుసు అని.. అందుకే ఆయన ఉండేలా ప్లాన్ చేశాను అని చెబుతాడు.
Guppedantha Manasu
తర్వాత వసుధార.. ఒక సహాయం కావాలి అని అడుగుతుంది. ఏంటో చెప్పమని మను అంటే... రిషి సర్ వెతకడంలో నాకు సహాయం చేస్తారా అని అడుగుతుంది. ఆల్రెడీ తాను అదే పనిలో ఉన్నాను అని మను అంటాడు. ఏంటి అని వసు అంటే.. కచ్చితంగా సహాయం చేస్తాను అని చెబుతాడు. చాలా మంది తమకు నమ్మకద్రోహం చేయాలని చూస్తున్నారని... రిషి సర్ ని ఒకసారి కిడ్నాప్ చేస్తే తాను కాపాడుకున్నానని.. మరోసారి కనిపించకుండా పోయారని.. జరిగింది మొత్తం చెబుతుంది. అయితే.. రిషి సర్ ఎక్కడున్నా వెతికి మీ దగ్గరకు తీసుకువస్తాను అని మను మాటిస్తాడు. వసుధార సంతోషడుతుంది.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... రాజీవ్ వెళ్లి.. మళ్లీ శైలేంద్రను కలుస్తాడు. మను గాడి మీద తెగ ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. అసలు వాడు ఎవడు భయ్యా.. వాడి చేతిలో నా చావు ఉందని, జాతకం చూపించుకోమని చెబుతాడేంటి అని అంటాడు. ఎలాగైనా ఆ మను గాడి అడ్డు తప్పించుకోవాలని, చంపేస్తాను అని రాజీవ్ అంటాడు. అయితే.. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు వద్దని, కూల్ గా ఉండమని శైలేంద్ర అంటూ ఉంటాడు. అయితే రాజీవ్ మాత్రం వినిపించుకోడు. మాటలు పడింది నేనే కదా.. నా బాధ నీకు ఎలా ఉంటుంది అని రాజీవ్ అంటే,.. నిన్నంటే నన్ను అన్నట్లే అని.. వాడిని ఏదైనా చేస్తే.. ఇద్దరం ఇరుక్కుపోతామని, సమయం చూసి చేద్దాం అని.. తొందరపడొద్దని శైలేంద్ర చెబుతాడు.
Guppedantha Manasu
మన చేతికి మట్టి అంటకుండా ఆ మనుని చంపేద్దాం అని శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. ఎలా అని రాజీవ్ అడిగితే.. తనకు తెలిసిన ఓ రౌడీ ఉన్నాడని.. వాడికి చెబితే పని అయిపోతుందని అంటాడు. సరే అని రాజీవ్ అనగానే.. శైలేంద్ర ఆ రౌడీకి ఫోన్ చేసి..మను ఫోటో పంపి, డీటైల్స్ కూడా ఇస్తాడు. రేపటిలోగా వాడిని వేసేయాలని అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఆ రౌడీ పని అయిపోతుంది సర్ అని చెబుతాడు. ఇక.. మను పీడ విరగడ అయిపోయినట్లే అని శైలేంద్ర, రాజీవ్ సంబరపడిపోతారు. ఈ దెబ్బకు నాకు మరదలు, నీకు ఎండీ సీటు ఖాయం అని రాజీవ్ అంటాడు.