Guppedantha Manasu 10th February Episode:రూ.40కోట్లు అప్పు చేసి కాలేజీని తాకట్టు పెట్టిన రిషి, టెన్షన్ లో వసు

నువ్వు ఇలా భోజనం చేయకుండా కూర్చుంటే రిషి కి నచ్చదు అని.. అన్నం మనకోసం ఎదురు చూడకూడదని అనుపమ ఒప్పించి.. భోజనానికి తీసుకువెళ్తుంది.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 10th February Episode: తాగడానికి సిద్ధమైన మహేంద్రను ఆపి... అనుపమ ఇంటికి తీసుకువస్తుంది. వాళ్లు వచ్చే సమాయానికి వసుధార ఇంట్లో డల్ గా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. భోజనానికి తీసుకురమ్మని అనుపమ చెబుతుంది. అయితే.. వసు మాత్రం రిషితో జరిగిన పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వసుని అలా చూసి మహేంద్ర బాధపడతాడు. రిషి లేడనే విషయం నీకు ఎలా చెబితే నువ్వు నమ్ముతావో అర్థం కావడం లేదు అనుకుంటాడు. నా కొడుకు లేడనే విషయం తెలిసినప్పటి నుంచి నా గుండె పగిలిపోతోందని.. కానీ నేను కూడా ఆ విషయం బయటపెడితే నువ్వు ఏమైపోతావో అని భయంగా ఉందని.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని అనుకుంటాడు.

Guppedantha Manasu

లోపల బాధగా ఉన్నా.. బయటకు మాత్రం నార్మల్ గా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఇంటికి ఎవరైనా వచ్చారా ఏమైనా అన్నారా మహేంద్ర అడుగుతాడు. ఈ దండ ఎవరు తీసుకువచ్చారు..? మళ్లీ శైలేంద్ర వచ్చాడా అని మహేంద్ర అంటే.. రాక్షసుడు వచ్చాడు అని చక్రపాణి చెబుతాడు.


Guppedantha Manasu

రాక్షసుడు ఎవరు అని మహేంద్ర అడిగితే రాజీవ్ వచ్చాడని చెబుతాడు. రాజీవ్ ఎవరు అని అనుపమ అడిగితే.. వాడి స్టోరీ మొత్తం చక్రపాణి వివరిస్తాడు. వాడు మళ్లీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని మహేంద్ర అంటే.. వసుధార కోసం వచ్చాడని.. వాడు చెప్పిన మాటలను కూడా చక్రపాణి చెబుతాడు

Guppedantha Manasu

అయితే.. అనుపమ.. వసుధారకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇలా డల్ గా కూర్చుంటే శైలేంద్ర లాంటి రాబంధువులు, రాజీవ్ లాంటి గుంట నక్కలు ఎదురుచూస్తూ ఉంటారు.. అని మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. తర్వాత.. వసుని భోజనానికి రమ్మని చెబుతారు. కానీ వసు నిరాకరిస్తుంది. అయితే.. నువ్వు ఇలా భోజనం చేయకుండా కూర్చుంటే రిషి కి నచ్చదు అని.. అన్నం మనకోసం ఎదురు చూడకూడదని అనుపమ ఒప్పించి.. భోజనానికి తీసుకువెళ్తుంది.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే రాజీవ్, శైలేంద్ర ఒకచోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార దగ్గరకు వెళ్లిన విషయం రాజీవ్ చెప్పడంతో శైలేంద్రకు పిచ్చి కోపం వస్తుంది. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా.. ఎందుకు వెళ్లావ్ అని శైలేంద్ర అడుగుతాడు. కానీ.. రాజీవ్.. తన మరదలు, తన మనసు అని ఏవేవో చెబుతాడు. రిషిగాడు చనిపోయాడని.. ఈ  సమయంలో తనకు ఓదార్పు అవసరం అని..ఓదార్చడానికి వెళ్లాను అని చెబుతాడు. దానికి శైలేంద్ర.. ఓదార్చడానికి వెళ్లావా.. ఓ దారికి తెచ్చుకోవడానికి వెళ్లావా అని అడుగుతాడు. భలే కనిపెట్టేశావ్ అన్నట్లుగా రాజీవ్ మాట్లాడతాడు.

Guppedantha Manasu

అయితే... ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వడం లేదని.. సింపతీ కోసం దండ తీసుకొని కూడా వెళ్లాను అని.. కానీ  ఏకిపారేసింది అని చెబుతాడు. కొట్టిందా అని శైలేంద్ర అంటే... కొట్టే అంత సీను లేదు కానీ.. మా మామయ్య, మరదలు ఇద్దరూ కలిసి నన్ను తిట్టేశారని చెబుతాడు. ఫోటోకి దండ మేం వేస్తామంటేనే ఒప్పుకోలేదు.. నువ్వు వేస్తానంటే వసుధార ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నావ్ అని శైలేంద్ర అడుగుతాడు. తర్వాత రిషి  చనిపోయాడని నీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. అయితే.. నువ్వే కాదు.. నేను కూడా విలనే, నాకూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వచ్చు అంటాడు రాజీవ్. పెళ్లి వార్తలు ఆలస్యమౌతాయి కానీ.. చావు వార్తలు వెంటనే తెలుస్తాయంటాడు,

Guppedantha Manasu

అయితే.. ఈసారి వెళ్తే వెళ్లావ్ కానీ,,. మళ్లీ వెళ్లకు అని శైలేంద్ర చెబుతాడు.కానీ రాజీవ్ మాత్రం నువ్వు ఏమనుకున్నా సరే, ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే నేను మాత్రం వెళ్తూనే ఉంటాను. ఏదో ఒకటి చేసి ఆ ఎండీ సీటు లాక్కొని నా మరదలిని గెంటేయరాదు.. చంకలో పెట్టుకొని తెచ్చుకుంటాను అని  రాజీవ్ అడుగుతాడు. కానీ.. శైలేంద్ర తాను అదే పనిలో ఉన్నానని చెబుతాడు.  తర్వాత.. నీ మరదలిని ఎండీ సీటుకు దూరం చేసి నీకు దక్కేలా చేస్తాను అని  శైలేంద్ర మాటిస్తాడు. సరే నీ మాట మీద నమ్మకం ఉందని చెప్పి వెళతాను అని రాజీవ్ బయలుదేరతాడు.

అయితే.. వెళ్లే ముందు.. నువ్వు ఆ ఎండీ సీటు కోసం ఏమైనా చేసుకో..ఎంత మందినైనా చంపుకో నాకు పర్వాలేదు. కానీ.. వసుధారకు మాత్రం ఏమీ కాకూడదు. ఎటాక్స్, మర్డర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తావేమో..? నా మరదలికి ఏదైనా అయితే నా మనసు తట్టుకోలేదు. అని రాజ్ చిన్న గా శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు. దానికి శైలేంద్ర.. తాను వసుధారను ఏం చేస్తాను అని అంటాడు. దానికి రాజీవ్.. వసుధారకు రిషి అంటే ఎంత ఇష్టమో.. నాకు వసుధార అంటే అంతకు మించిన ఇష్టం. వసుధారను ఏదైనా చేస్తే.. నిన్ను నేను చంపడానికి కూడా వెనకాడను. కుర్చీ నీది.. కుర్చీలో మరదలు పిల్ల నాది.. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి రాజీవ్ వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. వసుధార కాలేజీలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే.. కాలేజీకి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వారు వచ్చి.. మొదట రిషి సర్ చనిపోయారు అనే విషయాన్ని అడుగుతారు. కాదని.. అది నిజం కాదని.. ఎప్పటిలాగానే వసుధార చెబుతుంది. ఆ తర్వాత.. వాళ్లు.. తమ దగ్గర రిషి సర్ రూ.40కోట్ల అప్పు తీసుకున్నారని.. ఇవిగో ప్రూఫ్స్ అని చెబుతారు. వాటిని వసు నమ్మదు. అవన్నీ ఫేక్ అని చెబుతుంది. కానీ వాళ్లు వదలరు. తాము చాలా కష్టాల్లో ఉన్నామని.. తమ డబ్బు తమకు ఇవ్వాల్సిందేనని.. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతారు. వెంటనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి.. మా సమస్యను సాల్వ్ చేయాలని.. అప్పటి వరకు అక్కడి నుంచి తాము కదలమని వాళ్లు బయట బీష్మించుకొని కూర్చుంటారు.

Guppedantha Manasu

వాళ్లు బయటకు కూర్చోవడానికి వెళ్లగానే.. వసుధార మహేంద్రకు ఫోన్ చేస్తుంది. ఓ సమస్య వచ్చిందని చెబుతుంది. ఏంటి అని మహేంద్ర అడిగితే... రిషి రూ.40కోట్ల అప్పు విషయం బయటపెడుతుంది. తొందరగా కాలేజీకి రమ్మని , బోర్డు మీటింగ్ పెడతాను అని వసు అంటుంది. వెంటనే వస్తాం అని మహేంద్ర చెబుతాడు. విషయం అనుపమకు చెప్పి.. ఇద్దరూ కాలేజీకి బయలుదేరతారు.

వసుధర బోర్డు మీటింగ్ పెడుతుంది. అయితే.. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది శైలేంద్ర అనే విషయం అర్థమౌతుంది. బోర్డు మెంబర్స్ కూడా ఆ పేపర్లు చేసి.. రిషి సర్ ఇలా చేశారు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మహేంద్ర, అనుపమ కూడా వస్తారు. అయితే.. అది పొరపాటు అని, తమ రిషి అలా చేయడు అని  మహేంద్ర అంటాడు. అయితే.. పొరపాటు కాదని..  రిషి సర్ తమ దగ్గర డబ్బులు తీసుకున్నాడని.. ఆ డబ్బులు కట్టలేకపోతే కాలేజీ తాకట్టు పెట్టారని వాళ్లు చెబుతారు. అయితే.. రిషి అలా చేసే వ్యక్తి కాదని.. కాలేజీ అంటే రిషికి ప్రాణం అని.. తన ప్రాణం అయినా అడ్డువేస్తాడు కానీ కాలేజీని తాకట్టు పెట్టడు అని మహేంద్ర నమ్మకంగా చెబుతాడు.
 

Guppedantha Manasu


వాళ్లు మాత్రం తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. రిషి సర్ గొప్పవారే అని.. కాకపోతే అవసరం ఎలాంటి వ్యక్తిని అయినా కిందకు లాగేస్తుందని వాళ్లు అంటారు. రిషి సర్ గొప్పవారు కాబట్టే తాము ఆ డబ్బులు ఇచ్చామని వాళ్లు చెబుతారు. అయితే.. మీరు పర్సనల్ గా వచ్చారా లేక.. కంపెనీ నుంచా అని అనుపమ అడుగుతుంది. తాము ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చామని వాళ్లు చెబుతారు. తమ దగ్గర రాత పూర్వకంగా  డాక్యుమెంట్స్ ఉన్నాయని... చూడమని ఇస్తారు. శైలేంద్ర.. తాను కూడా ఆ డాక్యుమెంట్స్ చూశానని.. రిషి డబ్బులు తీసుకున్నట్లే ఉంది అని చెబుతాడు. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని అనుపమ కూడా చెబుతుంది. మహేంద్ర మాత్రం.. అవి ఫేక్ అని కొట్టిపారేస్తాడు. రిషి కాలేజీ తాకట్టు పెట్టాడంటే రిషి గురించి తెలిసిన వారు ఎవరూ నమ్మరు అని, అలాంటి పని రిషి చేయడు అని మహేంద్ర అంటాడు. అయితే... వాళ్లు కోర్టు వెళతాం అని బెదిరిస్తారు. వెళ్లమని మహేంద్ర అంటాడు. అయితే.. వాళ్లు కోర్టుకు వెళితే.. వాళ్లే గెలుస్తారు అని అనుపమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!