Shraddha Das : ‘చూడటానికి అలాగే కనిపిస్తుంది, కానీ’.. వైరల్ గా శ్రద్ధా దాస్ వర్కౌట్!

First Published | Feb 9, 2024, 7:54 PM IST

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పోస్టులు, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. 

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das)  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వరుస పోస్టులు పెడుతూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తోంది. 

తన ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. కిర్రాక్  అవుట్ ఫిట్లతో అదరగొడుతోంది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది.


ఈ క్రమంలోనే శ్రద్ధా దాస్ ఫిట్ నెస్ పైనా ఫోకస్ పెడుతోంది. క్రేజీగా వర్కౌట్స్ చేస్తూ తన అభిమానులను ఇన్ స్పైర్  చేస్తోంది. వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను, ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. 

మరోవైపు తన అభిమానులను ఆకట్టుకునేందుకు ఇంట్రెస్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ లెగ్ వర్కౌట్స్ చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. 

వర్కౌట్ అవుట్ ఫిట్ లో ఒంటి కాలిని కొన్ని నిల్చోబెట్టిన డబ్బాలపై నుంచి దాటిస్తూ ఉంది. అయితే ఈ వీడియోను పంచుకుంటూ... ‘చూడటానికి ఈజీగా కనిపిస్తుంది.. కానీ కాదు’ అని చెప్పుకొచ్చింది.

ఇలా ఈ ముద్దుగుమ్మ వరుసగా వర్కౌట్స్ చేస్తూ తన అభిమానులను మోటీవేట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫిట్ నెస్ పై ఆమె పెట్టిన ఫోకస్ కు అభినందించారు. 

Latest Videos

click me!