Sohel : ‘నా సినిమాను కావాలనే తొక్కారు.. అయినా భయపడను’.. వాళ్లకి సోహెల్ స్ట్రాంగ్ కౌంటర్

First Published | Feb 9, 2024, 5:13 PM IST

బిగ్ బాగ్ సోహెల్ (Sohel) ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తున్నారు. తాజాగా తన లేటెస్ట్ మూవీ రిజల్ట్ పై సోహెల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

Bigg Boss Telugu బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో సోహెల్ టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ క్రేజ్ తో హీరోగా సినిమా అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. చివరిగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ (Mister Pregnant) మూవీతో అలరించారు. 

తాజాగా తానే నిర్మాతగా వ్యవహరిస్తూ తీసిన చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’ (Bootcut Balaraju). ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. 


దీంతో సోహెల్ తన శక్తి మేరకు సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఎలాంటి వల్గర్ సీన్లు లేవని... ఫ్యామిలీతో కలిసి సరదా చూసి ఎంజాయ్ చేసే సినిమా అంటూ ప్రమోట్ చేస్తూనే ఉన్నార. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన సినిమాపై స్పందించారు. 

హైదరాబాద్ లోని మాదాపూర్ లో నిర్వహిస్తున్న గ్రాండ్ గాలా ఈవెంట్ (Grand Gala Carnival Event)కు వెళ్లిన సోహెల్ మీడియాతో తన సినిమా గురించి మాట్లాడారు. తన సినిమాను కావాలనే వెనెక్కి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

సోహెల్ మాట్లాడుతూ... ‘నా సినిమాకు కొందరు సోషల్ మీడియా వ్యక్తులు కావాలని వెనక్కి లాగారు. నెగెటివ్ ప్రచారం చేశారు. మీరు ఎన్ని చేసినా నేను భయపడను. మొన్న నేనే కన్నీటితో నా ఆవేదనను వ్యక్తం చేస్తే దాన్ని కూడా వైరల్ చేశారు. 

అయినా దాని వల్ల నాకే మేలు జరిగింది. ఎక్కువ మందికి రీచ్ అయ్యి థియేటర్లకు వెళ్తున్నారు. నెక్ట్స్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తా.. ఒక్కటే చెప్తున్నా నాకు సినిమా తప్ప మరొకటి లేదు. బూట్ కట్ బాలరాజు సినిమాను అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేయాలని మరోసారి కోరుతున్నాను.’ అని చెప్పుకొచ్చారు. 

Latest Videos

click me!