Guppeantha Manasu serial Today:శైలేంద్రపై ఎటాక్ గురించి అనుపమ ఆరా, రిషి కి భయపడుతున్న దేవయాణి

First Published Dec 5, 2023, 8:27 AM IST

 శైలేంద్ర తనకు ఏమీ కాలేదని, నువ్వు కంగారుపడవద్దని, అందరి ముందు తొందరపడి నోరుజారకు అని సలహా ఇస్తాడు. నాకోసం ఏడ్వడం తప్ప, మరో పని చేయవద్దు అని చెబుతాడు.
 

Guppedantha Manasu


Guppeantha Manasu serial Today:మహేంద్ర హాస్పిటల్ లో ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో అనుపమ ఫోన్ చేస్తుంది. అప్పటికే వీళ్ల ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ కి వెళ్లిందని అనుపమకు తెలుస్తుంది. అందుకే ఎవరికి ఏమైందని, ఎందుకు హాస్పిటల్ కి వెళ్లారో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తుంది. కానీ, అసలే చిరాకులో ఉన్న మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇష్టపడడు. కట్ చేస్తాడు. కానీ, అనుపమ ఊరుకోదు మళ్లీ ఫోన్ చేస్తుంది. చేసేది లేక లిఫ్ట్ చేసి, తాను బిజీగా ఉన్నానని మాట్లాడలేనని చెబుతాడు. హాస్పిటల్ లో అంత బిజీ ఏంటి అని అనుపమ అడుగుతుంది. దీంతో మహేంద్ర ఓతెలిసిపోయిందా అంటాడు. హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు అని అడిగితే, శైలేంద్ర మీద ఎటాక్ జరిగిందంట అని మహేంద్ర చెబుతాడు. స్పెసిఫిగ్ గా అంట అని చెప్పడంతో అనుపమకు అనుమానం వస్తుంది.

Guppedantha Manasu

అదే అడిగితే, ఆ ఎటాక్ నేను చూడలేదు, ధరణి చెప్పిందని, అయితే, తాను మాత్రం అన్నీ నమ్మలేను అని చెబుతాడు. ఎటాక్ ఎవరు చేసి ఉంటారు అంటే.. తెలీదని చెబుతాడు. ఇక, వరసగా అనుపమ ప్రశ్నలు అడుగుతుంటే ఇరిటేట్ అవుతాడు. తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఈ కేసును కూడా ముకుల్ ఇంటిరాగేట్ చేస్తున్నాడంటే, అతనికి ఫోన్ చేస్తే మొత్తం అన్ని విషయాలు తెలుస్తాయి అని మనసులో అనుకుంటుంది.

Latest Videos


Guppedantha Manasu

మరోవైపు దేవయాణి తన కొడుకు దగ్గరకు వెళ్తుంది. నిద్రపోతున్నాడనుకొని వెళ్లిపోబోతుంటే, చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు.కూర్చోమని అడుగుతాడు. తాను నిద్రపోలేదని, నటిస్తున్నానని, ప్రస్తుతానికి తనను ఈ నటన మాత్రమే కాపాడుతందని చెబుతుతాడు. అయితే, దేవయాణి మాత్రం, నీకు ఇంత పెద్దగాయాలు అయ్యాయని తెలిసేసరికి చాలా భయమేసిందని తన తల్లి ప్రేమ చూపిస్తుంది. కానీ, శైలేంద్ర తనకు ఏమీ కాలేదని, నువ్వు కంగారుపడవద్దని, అందరి ముందు తొందరపడి నోరుజారకు అని సలహా ఇస్తాడు. నాకోసం ఏడ్వడం తప్ప, మరో పని చేయవద్దు అని చెబుతాడు.

Guppedantha Manasu

నీకు ఇంత జరిగినా రిషి చూడటానికి రాలేదు అని దేవయాణి ఫీలౌతుంది. అది విని శైలేంద్ర కూడా షాకౌతాడు. ‘రిషికి నువ్వుంటే చాలా ఇష్టం. అలాంటిది నీకు ఇంత పెద్దగాయం అయితే చూడటానికి కూడా రాలేదు. ఆ వాయిస్ నీది అవునో కాదో తెలుసుకోవడానికే రిషి వెళ్లి ఉంటాడు. ఆ వాయిస్ విన్నప్పుడు రిషి షాకయ్యాడు. కనీసం నోటివెంట ఒక్కమాట కూడా రాలేదు. ఇప్పుడు నిన్ను చూడటానికి రాలేదు. ఆ నిజం తెలుసుకోవడానికే వెళ్లి ఉంటాడు. జగతిని చంపింది నువ్వే అని తెలిస్తే, వాడు ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. మనకు రోజులు దగ్గరపడ్డాయేమో అనిపిస్తుంది’అని దేవయాణి అంటుంది.

‘ప్రతిరోజూ మనరోజే, ఏ ఒక్క క్షణం కూడా మనకు విరుద్దంగా ఉండదు. ఒకవేళ మనకు బ్యాడ్ టైమ్ ఎదురౌతుందని అనిపిస్తే,  దానిని గుడ్ టైమ్ గా ఎలా మార్చాలోనాకు బాగా తెలుసు. నువ్వు రిషి విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనూ కంగారుపడకు, భయపడకు. ధైర్యంగా ఉండు. ఏది ఏమైనా చివరకు నువ్వు కోరుకున్నట్లే, నేను ఆ ఎండీ సీటులో కూర్చుంటాను.’ అని శైలేంద్ర అంటాడు.
 

Guppedantha Manasu


‘నీ మీద ఎటాక్ చేసింది ఎవరు?’ అని దేవయాణి అంటే.. వాడు నీకు కూడా తెలుసు మామ్ అంటాడు. ‘వాడెవరో చెప్పు నాన్న, నా కొడుకును హాస్పిటల్ పాలు చేసిన వాడిని నామరూపాలు  లేకుండా చేస్తాను. వాడు ఎవడో చెప్పు’ అని అడుగుతుంది. అయితే, వాడి పేరు శైలేంద్ర అని, వాడి తల్లిపేరు దేవయాణి అని చెబుతాడు. దేవయాణికి ఏమీ అర్థం కాదు. అదే విషయం మళ్లీ అడుగుతుంది. అప్పుడు శైలేంద్ర కూల్ గా.. తనపై ఎటాక్ తానే స్వయంగా చేయించుకున్నాను అని జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు.

Guppedantha Manasu


ఆరోజు ఏం జరిగిందంటే.. శైలేంద్ర ఫోన్ కాల్ మొత్తం వినేస్తాడు. తర్వాత ఎవరికో ఫోన్ చేసి ప్లాన్ చెబుతాడు. అనంతరం ధరణి పక్కన కూర్చొని ప్రేమగా స్వీట్లు తినిపిస్తూ ఉంటాడు. అది చూసి ధరణి పొంగిపోతుంది. తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదని చెబుతుంది. శైలేంద్ర కూడా ప్రేమగా మాట్లాడతాడు. నిన్ను చాలా సార్లు బాధపెట్టానని, తిట్టానని క్షమాపణలు చెబుతాడు. అప్పుడే ముగ్గుర రౌడీలు అక్కడకు వచ్చి, శైలేంద్రపై ఎటాక్ చేస్తారు. బాగా కొట్టి, ఆ తర్వాత కత్తితీసుకొని శైలేంద్రను పొడిచేస్తాడు.  అయితే.. అదంతా శైలేంద్ర కావాలని తనపై తానే ఎటాక్ చేయించుకుంటాడు. ధరణి, అది చూసి బాగా ఏడుస్తుంది. అని.. అసలు విషయం శైలేంద్ర దేవయాణితో చెబుతాడు.

ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి తన మీద తానే హత్యాయత్నం చేయించుకున్నానని చెబుతాడు. ఎవరైనా ఇలా చేస్తారా? నీ ప్రాణాలు పోతే ఎం చేసేవాడివి అంటూ దేవయాణి తిడుతుంది. కానీ, తాను అంతా ప్లాన్ చేసుకునే చేశానని చెబుతాడు. ఇదంతా ధరణి కళ్లముందే జరిగింది అంటాడు. అప్పుడే ధరణి కూడా ఎంటర్ ఇస్తుంది. అవును అత్తయ్యగారు అని అంటుంది. అది విని.. మిగిలినదంతా కూడా వినేసింది ఏమో అని వాళ్లిద్దరూ కంగారుపడతారు. కానీ, తర్వాత వినలేదు అని తెలిసి ఊపిరిపీల్చుకుంటారు.

అయితే, ధరణి మాత్రం, రౌడీలు ఎటాక్ చేస్తుంటే, తాను తన భర్తను కాపాడుకోలేకపోయానని తెగ ఫీలౌతుంది. వెంటనే దేవయాణి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడుతుంది. తాను అసలు భయటకువెళ్లొద్దని చెప్పినా, మీరు వెళ్లారని అంటుంది. పాపం, ధరణి వీళ్ల యాక్టింగ్ తెలియక నిజంగానే బాధపడుతూ ఉంటుంది. తర్వాత ధరణి, శైలేంద్ర దగ్గర తానే ఉంటాను అని చెబుతుంది.
 

Guppedantha Manasu

మరోవైపు అనుపమ, ముకుల్ ని కలిసి శైలేంద్రపై జరిగిన ఎటాక్ గురించి ఆరా తీస్తుంది. కానీ, ముకుల్ మాత్రం  అలా సీక్రెట్స్ బయటపెట్టకూడదు అని అంటాడు. తాను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని, చెప్పమని అడుగుతుంది. కానీ, ముకుల్ కేసు విషయాలు బయటపెట్టకూడదని, తాను చెప్పను అని అని తేల్చేస్తాడు. చాలా రకాలుగా ముకుల్ నుంచి విషయం రాబట్టాలని అనుపమ ప్రయత్నిస్తుంది. కానీ, ముకుల్ చెప్పకూడదని, అతని తన పనికి విరుద్దం అని చెప్పేస్తాడు. కానీ తనకు మహేంద్ర బాగా తెలుసుని, అతని పర్మిషన్ తీసుకొని చెప్పమని చివరి అస్త్రంగా చెబుతుంది. దానికి ముకుల్ పడిపోతాడు. వెంటనే మహేంద్రకు ముకుల్ ఫోన్ చేస్తాడు.

ఆ ఫోన్  చేసి, ఇలా అనుపమ డీటేల్స్ అడుగుతోందని చెప్పాలా వద్దా అని ముకుల్ అడుగుతాడు. దానికి మహేంద్ర.. తాను తమ క్లోజ్ ఫ్రెండ్ అని కాకపోతే, ఈ విషయాలు మాత్రం చెప్పొద్దని, ఇంకోసారి తనను మీరు కలవొద్దని చెప్పేస్తాడు. మహేంద్ర చెప్పొద్దు అన్నాడని.. తాను చెప్పదలుచుకోవడం లేదని ముకుల్ కూడా చెప్పేస్తాడు. అయితే,  ఎవరు చెప్పినా చెప్పకున్నా, తాను నిజం తెలుసుకుంటానని అనుపమ డిసైడ్ అవుతుంది. మహేంద్ర మాత్రం.. ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే, నీకు కూడా ప్రమాదం జరుగుతుందనే వద్దు అంటున్నాను అనుపమ అని తనలో తాను అనుకుంటాడు.

మరోవైపు మహేంద్ర నీరసంగా ఉన్నాడని ఫణీంద్ర జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు. అసలే రక్తం ఇచ్చావని, ఇంటికి వెళ్లి రెస్టు తీసుకోమని చెబుతాడు. కానీ, మహేంద్ర మాత్రం వద్దూ ఇక్కడే ఉంటాను అని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

click me!