Gunde Ninda Gudi Gantalu Today: టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మీనా, పోటీకి పోయి కాళ్లు విరగ్గొట్టుకున్న ప్రభావతి

Published : Dec 25, 2025, 10:03 AM IST

 Gunde Ninda Gudi Gantalu: రవి వాళ్ల రెస్టారెంట్ లో జరిగే బెస్ట్ కపుల్ పోటీలకు ప్రభావతి కుటుంబం మొత్తం వచ్చేస్తారు. ఈ పోటీల్లో ప్రతి ఒక్కరూ తమ తమ టాలెంట్స్ చూపిస్తూ ఉంటారు. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో టీవీ కంటే ముందుగానే చూద్దాం... 

PREV
13
గుండె నిండా గుడి గంటలు

రోహిణీ, శ్రుతి తమ తమ టాలెంట్స్ చూపిస్తారు. తర్వాత మీనా వంతు వస్తుంది. మీనా కళ్లుమూసుకొని మూడు నిమిషాల్లో మూడు మూరల పూలు కడుతుందని బాలు అంటే.. అక్కడ కూడా ప్రభావతి సెటైర్ వేస్తుంది. కానీ.. అవేమీ పట్టించుకోకుండా.. మీనా వెళ్లి కళ్లకు గంతలు కట్టుకొని పూలమాల కడుతుంది. కేవలం మూడు నిమిషాల్లో నాలుగు మూరల పూలమాల కడుతుంది. అందరూ అభినందిస్తారు. ఆ తర్వాత ప్రభావతి తన టాలెంట్ చూపిస్తాను అని స్టేజీ మీదకు వెళ్తుంది. వెంటనే అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది.

23
మౌనమే నీ భాష.. అదరగొట్టిన జంటలు..

ఆ తర్వాత మౌనమే నీ భాష అనే కాంటెస్ట్ పెడతారు. ఒకరికి సినిమా పేరు ఉన్న కార్డు చూపిస్తే... వారు సైగ చేసి తమ భాగస్వామికి చేసి చూపించాలి. దానిని వారు అర్థం చేసుకోవాలి. ఈ పోటీకి మనోజ్, రోహిణీ తాము అంటూ ముందుకు వస్తారు. మనోజ్ చీటీ తీస్తే.. అందులో ‘ ఇంటి దొంగ’ అనే సినిమా టైటిల్ వస్తుంది. వెంటనే యాంకర్ తో.. ఇది మా బాలుగాడు రాశాడా అని మనోజ్ అడిగితే... కాదని..తమ జ్యూరీ మెంబర్స్ రాశారు అని ఆ యాంకర్ చెబుతుంది. తర్వాత ఆ సినిమా పేరు అర్థం అయ్యేలా చెప్పడానికి మనోజ్ చాలా తిప్పలు పడతాడు. చివరికి రోహిణీ దానిని కనిపెడుతుంది. కింద పోడియంలో కూర్చొన్న బాలు అప్పుడు కూడా మనోజ్ పై పంచులు వేస్తాడు. ‘ రావయ్యా ఇంటి దొంగ’ అంటూ పాటలు పాడతాడు. తర్వాత శ్రుతి, రవి ల వంతు వస్తుంది. శ్రుతి చీటీ తీసి అర్థం అయ్యేలా చెప్పడానికి సైగలు చేస్తుంది. రవి కూడా కరెక్ట్ గా కనిపెడతాడు. తర్వాత ప్రభావతి, సత్యం వెళతారు. ప్రభావతి చీటీ తీసి.. సైగలు చేస్తుంది. సత్యం సరిగా చెప్పలేకపోతే ప్రభావతి తల బాదుకుంటుంది. ఈ సీన్ చూడటానికి చాలా బాగుంటుంది. ఎప్పటికో తిప్పలు పడిన తరవాత సత్యం కూడా కరెక్ట్ ఆన్సర్ చెబుతాడు. తరవాత బాలు, మీనా వంతు వస్తుంది. మీనా చీటీ తీసి.. సైగలు చేస్తుంది. బాలు కూడా కరెక్ట్ గా గెస్ చేస్తాడు. ఆ తర్వాత కామాక్షి తన భర్తతో కలిసి వెళ్తుంది. రంగా వచ్చి చీటీ తీసి.. సైగలు చేస్తూ ఉంటాడు. కామాక్షి చెప్పలేక ఏదోదో చెబుతుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. కామాక్షి చెప్పలేకపోతుంది. దీంతో... పోటీ నుంచి ఎలిమినేట్ అవుతారు. పోటీ లో ఓడిపోయినందుకు రంగా.. కామాక్షిని పిచ్చి తిట్లు తిడతాడు. వీళ్లు ఓడిపోయినందుకు ప్రభావతి చాలా సంతోషిస్తుంది.

33
రొమాంటిక్ గేమ్ ని ట్రాజెడీ చేసిన ప్రభావతి

తర్వాత... రొమాంటిక్ గేమ్ ఒకటి పెడతారు. పైన ఒక గులాబీ పువ్వును వేలాడదీస్తారు. భర్త భార్యను ఎత్తుకుంటే.. భార్య ఆ పువ్వును నోటితో అందుకోవాలి. పోటీ ప్రకటించగానే.. సత్యం నేను ఎత్తుకోలేను అని చెప్పేస్తాడు. ప్రభావతి తాను చాలా తక్కువ వెయిట్ ఉంటానని అంటుంది. ఈ లోగా కాంపిటీషన్ మొదలౌతుంది. రవి, శ్రుతి చివరి క్షణంలో ఓడిపోతారు. రోహిణి, మనోజ్ మాత్రం చాలా బాగా ఆడి గెలుస్తారు. బాలు, మీనా కూడా చాలా సింపుల్ గా ఆడి గెలుస్తారు. తర్వాత.. ప్రభావతి.. సత్యం ని తీసుకొని వెళ్తుంది. అయితే.. తన భర్త హార్ట్ పేషెంట్ అని.. తనను ఎత్తుకుంటే ప్రమాదమని.. కుర్చీ ఎత్తుకొని అందుకుంటాను అని అడుగుతుంది. జడ్జ్ లు ఒకే చెప్పడంతో.. కుర్చీ ఎక్కి పువ్వు అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ.. అందుకోలేక... కిందపడుతుంది. ఆమె కాలికి దెబ్బ తగులుతుంది. ప్రభావతి కోసం ముగ్గురు కోడళ్లు పరుగులు తీస్తారు. అక్కడి తో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories