
మీనా చేసిన బిర్యానీ పంచాయతీ జరుగుతూ ఉంటుంది. తనకు ఇంట్లో వండినది కాకుండా, బయట బిర్యానీ ఇచ్చిందని.. అందుకే తన ఆరోగ్యం పాడైందని ప్రభావతి ఇంట్లో గొడవ మొదలుపెడుతుంది. రోహిణీ ఆమెకు సపోర్ట్ చేస్తుంది. ‘ఇంట్లో చేసింది మేం కూడా తిన్నాం కదా.. మాకేమీ కాలేదు..అత్తయ్య కు మాత్రమే ఎందుకు అలా అయ్యింది?’ అని రోహిణీ అడుగుతుంది.‘ అంటే.. నీ ఉద్దేశం ఏంటి..?’ అని మీనా సీరియస్ అవుతుంది. బిల్లు చూపించి.. అది బయట కొన్న బిర్యానీ నే అని ప్రభావతి అంటుంది. అది.. ఇప్పటి బిల్లు కాదని..డిసెంబర్ 31 వ తేదీ రోజుది అని.. ఆరోజు రాజేష్, తాను తిన్న బిర్యానీది ఆ బిల్లు అని బాలు నిజం చెబుతాడు.
ఇక.. కామాక్షి చేసిన వింత వంటకం తినడం వల్ల.. ప్రభావతికి అలా జరిగిందని ఆమె భర్త రంగా ఫోన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈ విషయం బయటపడగానే.. రోహిణీ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది. అయితే.. వెళ్తున్నరోహిణీ ని మీనా ఆపుతుంది. ఇక బాలు.. తన భార్యను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అని బాలు వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి మాత్రం తిప్పలు పడుతూనే ఉంటుంది.
రాత్రి మనోజ్ నిద్రపోతూ ఉంటాడు. అయినా కూడా కలలో ఆ లెటర్ గురించి.. ఆ లెటర్ లో రాసి ఉన్నదే గుర్తుకు వస్తూ ఉంటుంది. దీంతో.. నిద్రపట్టక లేస్తాడు. ఆ లెటర్ తీసి మళ్లీ చదువుతాడు. తర్వాత.. ఈ విషయం ఎవరికి చెప్పాలా అని కాసేపు ఆలోచించి... వాళ్ల అమ్మకు ఫోన్ చేసి లేపుతాడు. ఇద్దరూ కలిసి మేడ మీదకు వస్తారు. ‘ఏమైంది?’ అని ప్రభావతి అడిగితే.. ‘ ఆ రోజు ఒక లెటర్ వచ్చింది అని చెప్పాను కదా.. ఈ రోజు ఇంకో లెటర్ వచ్చింది’ అని చెప్పి.. ఆ లెటర్ చదవమని చెబుతాడు. అందులో ‘ మీ అమ్మకు గుండెపోటు వచ్చేలా చేస్తాను’ అన్న లైన్ చదవి.. ప్రభావతి షాకై ఫ్రీజ్ అయిపోతుంది. మనోజ్ వాళ్ల అమ్మను షాక్ నుంచి బయటకు తెచ్చి.. కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉందని చెప్పి.. ప్రభావతిని మరింత భయపెడతాడు. ‘ అర్థరాత్రి ఈ చావు గోల ఏంట్రా? నీకు ఆ లెటర్ ఇచ్చిన వాడిని వెతికావా?’ అని అడుగుతుంది. ‘ వెతికాను అని.. అతను దొంగ అని’ ఏదోదో మాట్లాడతాడు. ఇద్దరూ కలిసి...నిజంగానే ఇంటికి దొంగోడు వచ్చాడని.. ఇటుక రాయితో కొట్టబోతారు. కానీ.. చూస్తే అది రోహిణీ. భయంతో అరుస్తుంది. విషయం ఏంటి? అని రోహిణీ అడిగితే... లెటర్ విషయం చెబుతాడు. ఆ లెటర్ రోహిణీ చదువుతుంది. ఈ లెటర్ చూసి మీరు భయపడుతున్నారా? అని రోహిణీ చాలా కూల్ గా అడుగుతుంది. ‘ ఎవరో మనోజ్ ని ఆటపట్టిస్తున్నారు.. అయినా లెటర్ ఇచ్చిన వాడిని పట్టుకోవచ్చు కదా’ అని రోహిణీ అడిగితే.. వాడు ఒక దొంగ అని.. జైలుకి వెళ్లి వస్తూ ఉంటాడు అని మనోజ్ చెబుతాడు. అయితే.. అది తన మాజీ భర్త పని ఏమో అని.. రోహిణీ డౌట్ పడుతుంది. కానీ.. బయటకు చెప్పదు.. డబ్బు కోసం ఇలా చేస్తున్నారేమో అని చెబుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని ప్రభావతి అంటే.. వద్దని దాని వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని రోహిణీ చెబుతుంది.
నిద్రపోతూ బాలు మధ్యలో ఉలికిపడి లేస్తాడు. పీడకల వచ్చిందా అని మీనా అడిగితే.. మన ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కల వచ్చింది అని బాలు చెబుతాడు. దీంతో.. బాలు ఈ విషయంపై వాదనకు దిగుతాడు. ఇక.. బాలు ఆ పీడకల గురించి ఆలోచిస్తుంటే.. మీనా దిష్టి తీస్తుంది. తర్వాత మళ్లీ పడుకుంటారు.
ఇక.. రోహిణీ.. వాళ్ల అమ్మ, చింటూ కోసం ఇల్లు వెతికే పనిలో పడుతుంది. ఒక ఇల్లు వెతుకుతుంది. ‘ నేను, మా అమ్మ, మా బాబు’ అంటాం అని రోహిణీ చెబుతుంది. అతను భర్త గురించి అడిగితే.. దుబాయిలో ఉంటాడు అని చెబుతుంది. అయితే.. ఇల్లు ఇవ్వను అని అతను చెబుతాడు. కానీ.. అతనికి ఏవేవో చెప్పి రోహిణీ ఒప్పిస్తుంది. అద్దె రూ.20వేలు అని.. అడ్వాన్స్ లక్ష ఇవ్వమని ఇంటి ఓనర్ అడుగుతాడు. రోహిణీ సరే ఇస్తాను అని చెప్పి.. టోకెన్ అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇస్తుంది. లక్ష రూపాయలు ఎలా తెస్తావ్ అని విద్య అడిగితే.. మనోజ్ ని అడుగుతాను అని రోహిణీ అంటుంది.
బాలు.. తన ఫ్రెండ్స్ ని కలుస్తాడు. రాజేష్ పీకలదాకా తాగి.. పడిపోవడం చూసి బాలు షాక్ అవుతాడు. పడిపోయి ఉన్న రాజేష్ ని బాలు లేపుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో.. బాలు, మీనా గొడవపడతారు. ప్రభావతి మరింత రెచ్చ గొడుతుంది