
ప్రభావతి లేని సమయంలో మీనా, శ్రుతి చాలా ప్రేమగా ఉంటారు. మీనా దగ్గరుండి మరీ.. శ్రుతికి ప్రేమగా భోజనం పెడుతుంది. కానీ.. ‘ అత్తయ్యను తలుచుకుంటే భయం గా ఉంది.. దొరికేస్తామేమో’ అని మీనా అంటే..‘ దొరికినప్పుడు చూద్దాం లే’ అని మీనా ధైర్యం చెబుతుంది. తర్వాత.. మీనా చేసిన వెంటను శ్రుతి బాగా పొగుడుతుంది.. నీ చేతిలో ఏ మ్యాజిక్ ఉంది అని శ్రుతి అడిగితే... అందరూ తృప్తిగా తినాలని వండుతుంది కాబట్టి.. అంత టేస్టీగా ఉంటుంది.. అని సత్యం అంటాడు. ఇక.. వీళ్లిద్దరూ ప్రేమగా ఉండటాన్ని చూసి.. సత్యం ఆట పట్టిస్తాడు. నిజంగా ప్రభావతి వచ్చినట్లు నాటకం ఆడతాడు. వెంటనే ఇద్దరూ అలర్ట్ అయిపోయి.. గొడవ పడినట్లు నాటకం ఆడతారు. అది చూసి సత్యం నవ్వేస్తాడు. దీంతో.. సత్యం ప్రాంక్ చేశాడని.. వాళ్లిద్దరికీ అర్థమౌతుంది. తర్వాత.. మీనా.. ప్రభావతికి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
‘ మీనా మన అందరినీ ఇంత బాగా చూసుకుంటుంది కదా..కానీ ఆంటీకి ఎందుకు నచ్చదు?’ అని శ్రుతి అడుగుతుంది. ‘ నేను మీనాని ఈ ఇంటికి కోడలిగా తీసుకురావడమే ప్రభావతికి ఇష్టం లేదు. మీనా.. ప్రభతో ఎంతో ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తుంది. కానీ.. ఆ అవకాశం మీ ఆంటీ ఇవ్వదు’ అని సత్యం చెబుతాడు. ‘ నేను అయితే మీనా అంత సహనంగా ఉండలేను అంకుల్.. తప్పుగా అనుకోకండి’ అని శ్రుతి చెబుతుంది.
సీన్ కట్ చేస్తే..మనోజ్ దగ్గరకు ఒక రౌడీ వస్తాడు. వచ్చి.. మనోజ్ కి ఒక లెటర్ ఇచ్చి.. అందులో ఏముందో చదవమని చెబుతాడు. ఎవరు నువ్వు అని అడిగితే.. తిక్క తిక్కగా సమాధానం చెబుతాడు తప్ప.. విషయం చెప్పడు. లెటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. అందులో.. ‘ మీ అమ్మకు గుండెపోటు వస్తుంది.. నీ తమ్ముడు హంతకుడు అవుతాడు. నువ్వు ఆత్మ హత్య చేసుకుంటావ్..’ అని రాసి ఉంటుంది. దీంతో.. ఆ లెటర్ ఇచ్చిన వ్యక్తి కోసం మనోజ్ వెతుకుతాడు. చాలా సేపటి తర్వాత ఆ లెటర్ ఇచ్చిన రౌడీ దొరుకుతాడు. ‘ ఎవరు నువ్వు.. నా గురించి ఏం తెలుసు నీకు?’ అని మనోజ్ అడుగుతాడు.. ‘ నాకు అన్నీ తెలుసు.. నువ్వు జాగ్రత్తగా ఉండు’ అని వార్నింగ్ ఇస్తాడు. మళ్లీ అతను మాయమైపోతాడు. అతను పెద్ద దొంగ అని.. జైలు నుంచి పారిపోయి వచ్చాడు అని చెప్పి వేరే వ్యక్తి మనోజ్ ని మరింత భయపెడతాడు.
ఇక.. బాలు కారులో వెయిట్ చేస్తూ ఉంటే.... మీనా ప్రభావతి కోసం లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. ఆ తొందరలో బాలుకి సంబంధించిన ఏదో బిల్లు కాస్త.. ప్రభావతి లంచ్ బ్యాగులో పడిపోతుంది. అది బాలు, మీనా ఇద్దరూ చూసుకోరు. ఇక ప్రభావతి. డ్యాన్స్ క్లాసులో పిల్లలకు క్లాసులు చెబుతూ ఉంటుంది. వారిలో ఉన్న.. ప్రేమ జంట.. ఒకరినొకరు చూసుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. దీంతో.. ఆ ప్రేమ్ కుమార్ కి కామాక్షి సెటైర్లు వేస్తుంది. ఈలోగా బాలు. మీనాని దింపేసి.. తనకు ట్రిప్ వచ్చిందని వెళ్లిపోతాడు. మీనా లంచ్ బాక్స్ తెచ్చి ఇస్తుంది. అయితే.. ఆలస్యంగా తెచ్చినందుకు ప్రభావతి సీరియస్ అవుతుంది. మీనా ప్రభావతి కోపాన్ని పట్టించుకోకుండా.. తిక్క తిక్క సమాధానాలు చెబుతుంది.
మీనా తనకు అర్జెంట్ గా పూలు ఇవ్వాలని చెప్పినా వినకుండా... భోజనం వడ్డించే వెళ్లమని ఆర్డర్ వేస్తుంది. వీళ్లు భోజనం చేసేలోగా.. ఆ ప్రేమ జంట తమ పని తాము కానిస్తారు. ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ ఉంటారు. మరోవైపు మీనా రుచిగా వండి పెట్టినా కూడా.. మీనాపై ఏదో ఒక సెటైర్లు వేస్తూనే ఉంటుంది. తర్వాత మీనా పని ఉందని వెళ్లిపోతుంది. వెళ్తుండగా... ఆ ప్రేమ జంట ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే.. మీనా కంట పడుతుంది. ఆ ప్రేమ్ కుమార్.. మీనాని చూసి కాస్త కంగారు పడతాడు. ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో.. డ్యాన్స్ మంచిగా నేర్చుకో తమ్ముడు అని సలహా ఇచ్చి మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది..
సాయంత్రం.. ప్రభావతి.. గ్యాస్ తో ఇబ్బంది పడుతూ ఉంటుంది.. జీరా వాటర్ తాగమని రోహిణీ సలహా ఇస్తుంది. అప్పుడే మీనా వచ్చి.. ఏమైందని అడుగుతుంది. తనకు తెచ్చిన భోజనం ఎక్కడ తెచ్చావ్ అని.. అది తిన్న దగ్గర నుంచి తనకు ఇబ్బందిగా ఉందని ప్రభావతి.. మీనాని తిడుతుంది. ఇంట్లో చేసిందే అని మీనా అని చెప్పినా కూడా ప్రభావతి వినదు. తేన్పులు వస్తున్నాయని తెగ అవస్థలు పడుతుంది. ఆ సంచిలో బిర్యానీ బిల్లు దొరికింది అని.. అని బిల్లు కూడా చూపిస్తుంది.ఆ బిల్లు.. బాలు కారులో ఉన్నప్పుడు పొరపాటున పడిన బిల్లు కావడం విశేషం. రోహిణీ కూడా.. మీనాదే తప్పు అని తిడుతుంది.
సరిగ్గా.. అదే సమయానికి బాలు వస్తాడు. అప్పుడే.. మీనాపై ప్రభావతి అబద్ధాలు చెబుతుంది. ఇంట్లో వండిన బిర్యానీ కాకుండా బయటది తెచ్చి పెట్టిందని తిడుతుంది. రోహిణీ కూడా.. ప్రభావతికి వంత పాడుతుంది. బాలు సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..