Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన

Published : Dec 19, 2025, 10:31 AM IST

 Gunde Ninda Gudi Gantalu Today: మౌనిక అవమానించినందుకు బాలు బాధపడుతూ ఉంటాడు. బాలు బాధను అర్థం చేసుకొని మీనా ఓదారుస్తుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా చూసేద్దాం... 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

‘ మౌనిక అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదు, ఇంట్లో జరిగిన గొడవలను తను మనసులో పెట్టుకుంది అనుకుంట. అందుకే నేను ఎవరో తెలీదు అంది. నా చెల్లి నాకు దూరం అయిపోయిందేమో అనిపిస్తుంది ’ అని బాలు బాధపడుతూ ఉంటాడు. మౌనిక భుజం మీద బాలు పడుకొని ఎంటాడు. ‘మీరు ఏం బాధ పడకండి.. ఇంట్లో అందరికంటే మౌనికకు మీరు అంటేనే ఎక్కువ ఇష్టం’ అని మీనా నచ్చ చెబుతుంది. ‘ అంత ఇష్టం ఉంటే.. నేను ఎవరో తెలీదని ఎందుకు చెప్పింది?’ అని బాలు అడుగుతాడు. ‘ ఆ మాట చెప్పడానికి తాను ఎంత బాధపడిందో మీరు చూడలేదు కదా’ అని అంటుంది. అంటే.. అని బాలు అర్థంకాక అడిగితే.. ‘ తను వేరే వాళ్ల ఫంక్షన్ లో ఉంది. తన పక్కన ఆ సంజూ ఉండి ఉండొచ్చు. లేదంటే దూరం నుంచి గమనించి ఉండొచ్చు. అందుకే మీతో మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడి ఉండొచ్చు. అంతేకానీ.. మీరంటే ఇష్టం లేక కాదు’ అని మీనా మౌనిక పరిస్థితిని అర్థం చేసుకొని చెబుతుంది. దానికి బాలు‘ నేను కూడా అలానే అనుకున్నాను మీనా.. కానీ తర్వాత అయినా ఫోన్ చేయాలి కదా.. చేయలేదు, నేను ఫోన్ చేసినా తీయాలి కదా.. తీయలేదు’ అని బాలు బాధపడతాడు. దానికి మీనా.. తర్వాత చేస్తుందిలే అని ధైర్యం చెబుతుంది. ‘ మీకు ఒక విషయం చెప్పనా.. మామయ్య ఫోన్ చేసినప్పుడు నేను బాగున్నాను అని మాట్లాడింది. నేను కూడా విన్నాను. కాబట్టి, మీరు మౌనిక గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి’ అని బాలు బాధ పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. బాలుకి నచ్చ చెబుతుంది కానీ.. మౌనిక అలా ఎందుకు చేసింది అని మనసులోనే మీనా కూడా ఆలోచనలో పడుతుంది.

25
సంజూ శాడిజం..

సీన్ కట్ చేస్తే.. ఇంట్లో మౌనిక నిద్రపోవడానికి సిద్ధం అవుతుంటే.. సంజూ వస్తాడు. ‘ సూపర్ మౌనిక. నా పెళ్లానికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీకు నెమ్మదిగా వస్తున్నాయి. నేను సూపర్ హ్యాపీ. పర్లేదు నేను చెప్పినట్లు నువ్వు బాగానే చేస్తున్నావ్.. నువ్వు ఇలానే ఉంటే.. ఎప్పటికీ నా భార్యగా ఈ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు’ అని అంటాడు. దానికి మౌనిక ‘ దేని గురించి మాట్లాడుతున్నారు...?’ అని అడుగుతుంది. ‘ అదే.. ఫంక్షన్ లో మీ అన్నయ్య వచ్చి నీతో మాట్లాడాలని చూసినా నువ్వు పట్టించుకోలేదు కదా.. నేను చూశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా నువ్వు మీ అన్నయ్యను బాధ పెడుతూ ఉండాలి. కళ్ల ముందే ఉన్న చెల్లి పరాయి వారిలా మాట్లాడకుండా ఉంటే వాడు కుమిలిపోతుంటే.. అది కదా నాకు కావాల్సింది. అదే నేను నీ నుంచి కోరుకుంటున్నంది. ఇలా నువ్వు నన్ను సంతోషపెడుతూ.. ఈ ఇంట్లో ఏదో ఒక మూలన హ్యాపీగా పడి ఉండు’ అని అంటాడు.

ఈ లోగా మౌనికకు మీనా ఫోన్ చేస్తుంది. సంజూ ఎదురుగా ఉండటంతో మౌనిక ఫోన్ కట్ చేస్తుంది. దీంతో... ఫోన్ కట్ చేసింది కాబట్టి.. ఏమైందా అని మీనా కంగారు పడుతుంది. అయితే.. ఆ ఫోన్ కాల్ కట్ చేసిందుకు కూడా సంజూ చాలా సంతోషిస్తాడు. వాళ్లు అందరినీ దూరం పెట్టమని , ఇలానే కంటిన్యూ చేయమని చెప్పి పడుకుంటాడు. మౌనిక మాత్రం చాలా బాధ పడుతుంది.

35
మనోజ్ ని వాయించిన ప్రభావతి..

ఇక.. ఇంట్లో రోహిణీ నిద్రపోతుంటే.. మనోజ్ మాత్రం నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఉత్తరం ఎవరు రాశారు? ఎవరి వల్ల తనకు సమస్య రాబోతుందని ఆలోచిస్తూ ఉంటాడు. రోజులో ఎక్కువ టైమ్ తన పక్కన ఉండేది రోహిణి మాత్రమే అని.. తనతోనే సమస్య వస్తుందా అని కాసేపు అనుకొని మళ్లీ కాదులే అని అనుకుంటాడు. తర్వాత ఎవరి వల్ల సమస్య వస్తుందా అని తెగ ఆలోచిస్తాడు. ఫోన్ తీసుకొని బయటకు వచ్చి... వాళ్ల అమ్మకి ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ లో ఫోన్ చేస్తున్నాడేంటి అని ప్రభావతి అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ‘ నాకు నిద్ర రావడం లేదు.. పెరడు దగ్గరకు రావా.. నీకూ విషయం చెప్పాలి.. ప్లీజ్ రా అమ్మా’ అని అడుగుతాడు. తప్పక.. కొడుకు దగ్గరకు ప్రభావతి వెళ్తుంది.

‘ ఏమైంది?’ అని అడుగుతుంది? ‘ భయమైంది’ అని మనోజ్ అంటే.. ‘ మళ్లీ ఏం మింగావ్?’ అని అడుగుతుంది. దానికి మనోజ్.. ‘ మింగడానికి ఏముంది.. కాగితపు ముక్క’ అంటూ తనకు వచ్చిన ఉత్తరం చూపిస్తాడు. ‘ నాకు చుట్టూ ఉన్నవాళ్ల కారణంగా సమస్యలు వస్తాయి అని ఉత్తరంలో రాసి ఉంది. అది నాకు ఇచ్చి, ఉత్తరం ఇచ్చిన వాడు మాయం అయ్యాడు’ అని మనోజ్ చెబుతాడు. దానికి ప్రభావతి..‘ ఎవడు వాడు..? నువ్వు సరిగా చదివి ఉండవు.. నీ చుట్టూ ఉన్నవాళ్లకు నీ వల్ల సమస్యలు వస్తాయి అని రాసి ఉంటాడు’ అని అంటుంది. కాదు అని మనోజ్ ఉత్తరం చూపిస్తాడు. కానీ.. ప్రభావతి పెద్దగా పట్టించుకోదు.. రివర్స్ లో మనోజ్ కి కౌంటర్లు వేస్తుంది. ‘ నెలకు రూ.50వేలు ఇవ్వాలని.. అది తప్పించుకోవడానికి ఈ ప్లాన్ వేస్తున్నావా?’ అని అడుగుతుంది. ‘ నన్ను నమ్మడం లేదా?’ అని మనోజ్ అంటే... ‘ మనసుకు కష్టంగా ఉన్నా.. ఆ బాలు గాడిని నమ్ముతా కానీ.. నిన్ను మాత్రం నమ్మను. నిన్ను పువ్వులో పెట్టి పెంచుకున్న అమ్మని ఎన్ని మాటలు అన్నావో మర్చిపోయావా ’ అని కౌంటర్లు వేస్తుంది. పైకి కోపం చూపించినా మనసులో బాలు పై ఉన్న ప్రేమను బయటపెడుతుంది. ‘ నేను ఎదుగుతుంటే అందరూ కలిసి కిందకు లాగుతున్నారు’ అని మనోజ్ అంటే... లాగి పెట్టి కొడుతుంది. ఇదే నీ భార్యను అంటే.. తాళి తీసి ముఖాన కొడుతుంది అని వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెబుతుంది. ‘ నువ్వు నన్ను ఇంత మాట అన్నావ్ అని తెలిసినా, నేను నిన్ను కొట్టాను అని తెలిసినా బాలు దీపావళి పండగ చేస్తాడు’ అని తిట్టి అక్కడి నుంచి పంపిస్తుంది. తర్వాత మనోజ్ తెలివితేటలకు ప్రభావతి తలబాదుకుంటుంది.

45
మీనా శపథం...

మరుసటి రోజు ఉదయాన్నే రాజేష్ ఇంటికి వస్తాడు. తాను కొన్న రెండో కారును రాజేష్ కి రెంట్ కి ఇస్తున్నాను అని చెబుతాడు. సత్యం మెచ్చుకుంటాడు. అయితే...ఎంత గొప్ప స్నేహితులు అయినా.. ఇచ్చి పుచ్చుకునే దగ్గర కరెక్ట్ గా ఉండాలని సత్యం చెబితే.. ఆ బాధ్యత తాను తీసుకుంటాను అని మీనా చెబుతుంది. మీనా ఇంత స్ట్రిక్ట్ గా ఉంది ఏంటి అని రాజేష్ అంటే.. తనే ఓనర్ కదా అని బాలు అంటాడు. కానీ, మీనా అలా అన్నందుకు కొంచెం కూడా ఫీల్ అవ్వగుండా... భవిష్యత్తులో బాలు మంచి బిజినెస్ మ్యాన్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఆ మాటకు మనోజ్ తెగ ఫీల్ అయిపోతాడు. ‘ ఎవడు పడితే వాడు బిజినెస్ మెన్ అయిపోతారా? అలా కావాలంటే దానికి స్టేటస్ ఉండాలి’ అని అంటాడు. వెంటనే మీనా.. ‘ అవునవును... ఏదో అన్నారు.. ఆ స్టేటస్.. ఈ స్టేటస్ ఎలా వస్తుంది? 4 లక్షల ఫర్నీచర్ మోసపోతే వస్తుందా? ఆ డబ్బు కోసం నా బంగారం ఎత్తుకుపోతే వస్తుందా? రాజేష్ అన్నయ్య విన్నారా? బిజినెస్ మెన్ అంటే ఇలాంటి స్టేటస్ ఉండాలి.. ఎలా మునగాలో చెబుతారు.. ఎలా ముంచాలో చెబుతారు’ అని మీనా గట్టిగా మనోజ్ కి వార్నింగ్ ఇస్తుంది.

మధ్యలో రోహిణీ కలగజేసుకొని.. తన భర్తను అలా ఎందుకు అంటున్నావ్ అని ఫీల్ అవుతంది. అయితే.. మీనా ఏ మాత్రం తగ్గదు.‘ ఇక నుంచి నా భర్తను ఎవరైనా తక్కువ చేసి చూస్తే ఊరుకోను. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని వార్నింగ్ ఇస్తుంది. వెంటనే ప్రభావతి గయ్ మని లేస్తుంది. ‘ సెకండ్ హ్యాండ్ లో రెండు కార్లు కొన్నంత మాత్రాన.. నీ కొడుకు బిజినెస్ మెన్ అయిపోతాడా? మనోజ్ ని చూసి బాలుకి అసూయ’ అని ప్రభావతి అంటుంది. ‘ అవును.. వీడిని చూసి అసూయపడాలి. అసలు.. వీడిని చూసి ప్రపంచంలో ఎవరైనా అసూయ పడతారా?’ అని బాలు సెటైర్ వేస్తాడు. ఇదంతా ఎందుకని.. రాజేష్ ని కారు తీసుకొని వెళ్లమని మీనా చెబుతుంది.రాజేష్ వెళ్లిపోతాడు.

ఆ తర్వాత మీనా అందుకుంటుంది. ‘ ఏ బిజినెస్ మెన్ లు ఎంత వెటకారం చేసినా.. మీరు ఎన్నో కార్లు కొంటారు. జీవితంలో పైకి ఎదుగుతారు’ అని బాలుని పొగిడి మీనా లోపలికి వెళ్లిపోతూఉంటే... ‘ బొమ్మ కార్లు కొంటారేమో’ అని ప్రభావతి సెటైర్ వేస్తుంది. కోపంగా వచ్చిన మీనా ‘ ఏమన్నారు.. ఏమన్నారు.. మళ్లీ మళ్లీ అనండి... అంటూ చిటికెలు వేస్తూ..శపథం వేయబోతుంది... కానీ బాలు ఆపేస్తాడు. ‘ నువ్వు మళ్లీ శపథాలు చేయకు... ఇప్పటికే రెండు పెండింగ్ లో ఉన్నాయి.. అవి అయిపోయాక.. ఇంకోటి చేద్దూవు కానీ’ అని ఆపేస్తాడు. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. గతంలో బంగారం, తమ రూమ్ విషయంలో మీనా ఇలానే ఛాలెంజ్ చేస్తుంది. అందుకే బాలు ఇలా రియాక్ట్ అవుతాడు. కానీ, సత్యం... ప్రభావతికి చురుకలు వేస్తాడు.. బాలుని తక్కువ చేసి మాట్లాడినందుకు తిడతాడు. ప్రభావతి హర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మనోజ్ ని కూడా సత్యం తిడతాడు. తర్వాత... మనోజ్ మాత్రం.. ఆ లెటర్ రాసింది ఎవరో కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. దాని కోసం ఒకరిని కలవాలి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మళ్లీ ఏం సమస్య తెస్తాడో అని రోహిణీ భయపడుతుంది.

55
ఉత్తరం సంగతి తేల్చాలని డిసైడ్ అయిన మనోజ్...

మనోజ్ ని కలవడానికి తన పార్క్ ఫ్రెండ్ వస్తాడు. అతనికి కూడా ఈ లెటర్ విషయం చెబుతాడు. అతనితో కలిసి.. ఓ జోతిష్యడు దగ్గరకు వెళతాడు. ఆ జోతిష్యుడు దగ్గరకు వెళ్లి ఆ ఉత్తరం గురించి చెబుతాడు. కానీ.. అతను రివర్స్ లో మనోజ్ కి సెటైర్లు వేస్తాడు. ఇక.. అతను తర్వాత మనోజ్ కి ఏదో పెద్ద ప్రమాదం రాబోతోందని.. ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులు వేసుకోమని చెబుతాడు. మనోజ్ అతను చెప్పింది నమ్ముతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories