ప్రభాస్ ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ పై సాలిడ్ అప్డేట్ అందింది. గతంలో అనుకున్న డేట్ కంటే ముందుగానే Salaar Cease Fire Part -1 ఓటీటీలోకి రాబోతోంది. ఇంతకీ ఏ ఓటీటీలో, ఎప్పుడు రాబోతుందనే విషయాలు తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫిల్మ్ Salaar Cease Fire థియేటర్లలో సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఇంకా సినిమా హాళ్లకు రప్పించగలుగుతోంది.
26
థియేటర్లలో ఈ మూవీ సందడి చేయబట్టి ఇప్పటికే వారం రోజులు గడిచింది. ఇప్పటి వరకు ప్రపంప వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఈ సందర్భంగా మరో ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
36
ప్రస్తుతం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలోనే వీక్షిస్తున్నారు. కానీ ఓటీటీ ఆడియెన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. Ott Movies పట్ల ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో తెలిసిందే. ఎలాంటి సినిమానైనా ఓటీటీలో చేరుతుండటంతో కాస్తా సమయం తీసుకొని ఓటీటీలోకి వచ్చాకే చూస్తున్నారు.
46
ఈ క్రమంలో సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటూ ఓటీటీ ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో సినిమా లాంగ్ రన్ లో కొనసాగే అవకాశం కనిపిస్తుండటంతో 2024 ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలోకి విడుదల చేస్తారని ప్రచారం జరిగింది.
56
కానీ ప్రస్తుతం సలార్ రిపీటెడ్ ఆడియెన్స్ కనిపించకపోవడం, తదితర కారణాలతో పెద్దఎత్తున ఆడియెన్స్ థియేటర్లకు రాకపోవడంతో లాంగ్ రన్ కష్టమే అనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కంటే ముందే జనవరిలోనే ఓటీటీకి రిలీజ్ చేస్తారని అంటున్నారు.
66
స్ట్రాంగ్ బజ్ ప్రకారం.. Salaar Ott Release Date జనవరి 12 అని చెబుతున్నారు. దీంతో నెల రోజుల కంటే ముందే ఓటీటీలో అడుగుపెట్టబోతుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ యాక్షన్ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ Netflix సొంతం చేసుకుంది.