హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి గతం ఉంటుంది. అది చెప్పుకోవడానికి ఏదో ఒక సందర్భం ఖచ్చితంగా వస్తుంది. అంతే కానీ రోజూ అదే మాట్లాడాలి సింపతీ కార్ట్ ఉపయోగించాలని చూస్తున్నాడు. బిగ్ బాస్ షో మైండ్ గేమ్ అని నిఖిల్ తో అన్నాడు. అసలు మైండ్ కానీ, ఫిజికల్ గేమ్ కానీ... ఏమీ ఆడటం లేదు. ఖాళీగా కూర్చుని మాటలు చెబుతున్నాడు. ఇదంతా వర్క్ అవుట్ కాదు... అని ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
కొసమెరుపు ఏంటంటే... గత సీజన్లో పల్లవి ప్రశాంత్ కి నిఖిల్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అతన్ని సమర్థిస్తూ పలు వీడియోలు చేశాడు. పల్లవి ప్రశాంత్ తరపున మాట్లాడినందుకు తనను ట్రోల్ చేసిన వారికి కూడా నిఖిల్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు..