బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్... నెక్స్ట్ సీజన్ కి ముహూర్తం ఫిక్స్, కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్!

Published : Dec 28, 2023, 02:57 PM ISTUpdated : Dec 28, 2023, 03:44 PM IST

బిగ్ బాస్ షో వేదికగా ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా వెనక్కి తగ్గేదేలే అంటున్నారు మేకర్స్. సీజన్ 7 విన్నర్ అరెస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. ఇవేమీ పట్టించుకోని మేకర్స్ మరో సీజన్ కి సిద్ధం అవుతున్నారట. కంటెస్టెంట్స్ ని కూడా ఫైనల్ చేశారట.   

PREV
18
బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్... నెక్స్ట్ సీజన్ కి ముహూర్తం ఫిక్స్, కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్!
Nagarjuna

బిగ్ బాస్ షో పై ఆరోపణలు, వివాదాలు పరిపాటే. ఈ షో సమాజానికి హానికరం బ్యాన్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కోర్టులో పిటిషన్స్ వేసినా ఫలితం లేదు. ఇక సీజన్ 7 ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అల్లర్లకు పాల్పడ్డారు. పల్లవి ప్రశాంత్ సైతం రూల్స్ అతిక్రమించడంతో అరెస్ట్ అయ్యాడు. టైటిల్ విన్నర్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. షో పరువుపోయింది. 

 

28
Bigg boss telugu ott season 2

ఈ వివాదాల నేపథ్యంలో మేకర్స్ వెనక్కి తగ్గుతారనుకుంటున్న వేళ... ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ మేకర్స్ ఓటీటీ వెర్షన్ కి సిద్ధం అవుతున్నారట. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. 
 

38

 ఈ లిస్ట్ లో బిగ్ బాస్ తెలుగు 7 పాల్గొన్న మాజీ కంటెస్టెంట్ భోలే షావలి కూడా ఉన్నాడట. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన భోలే మొదట్లో హౌస్ మేట్స్ తో టార్గెట్ చేయబడ్డాడు. అయితే అతనిలో మంచి ఎంటర్టైనర్ ఉన్నారని మెల్లగా తెలిసింది. అనుకోని కారణాలతో భోలే 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మరోసారి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. 
 

48
richa panai

అలాగే వినాయకుడు మూవీ ఫేమ్ సోనియా ఎంట్రీ ఇస్తుందట. దూకుడు మూవీలో కూడా సోనియా హీరోయిన్ సమంత ఫ్రెండ్ రోల్ చేసింది. అలాగే మరో హీరోయిన్ రిచా పనయ్ ఎంపిక అయ్యారట. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యముడికి మొగుడు సినిమాలో రిచా పనయ్ హీరోయిన్ గా నటించింది.

58
Bigg boss telugu ott season 2

ఢీ ఫేమ్ యష్ మాస్టర్, సింగర్ పార్వతిని తీసుకున్నారట. జీ తెలుగులో ప్రసారమైన సింగింగ్ షోలో ఆమె రాణించారు. నటుడు భద్రం ఎంపికయ్యాడట. శతమానం భవతి, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో భద్రం నటించాడు. ప్రస్తుతానికి వీరు ఎంపికయ్యారని తెలుస్తుంది. 
 

68

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిబ్రవరి నెలలోనే హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని అంటున్నారు. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. 
 

78
Bigg Boss Nonstop

2022లో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 స్ట్రీమ్ అయ్యింది. బిందు మాధవి టైటిల్ గెలిచిన ఈ సీజన్లో అఖిల్ సార్థక్, అరియనా, ముమైత్ ఖాన్, బాబా భాస్కర్, తేజస్విని, మహేష్ విట్టా, హమీద వంటి టాప్ సెలెబ్స్ పాల్గొన్నారు. 
 

88
Bhadhram

కారణం తెలియదు కానీ 2023లో ప్రసారం కాలేదు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. మరి ఇదే నిజమైతే బిగ్ బాస్ లవర్స్ కి పండగే... 
 

click me!

Recommended Stories