అది నిలబెట్టుకోడం కష్టం... బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై వేణు స్వామి కామెంట్స్ వైరల్ 

First Published | Dec 28, 2023, 5:15 PM IST

బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రైతుబిడ్డ అరెస్ట్ పై వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి కీలక కామెంట్స్ చేశాడు. 
 

Pallavi Prashanth

టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి కొద్దిరోజులుగా నిలవలేదు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లు కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. మోస్ట్ పాపులర్ షో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అరెస్ట్ కావడం సంచలనమైంది. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. రెండు రోజుల అనంతరం కండిషనల్ బైయిల్ మీద విడుదలయ్యాడు.

Pallavi Prashanth


టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి కొద్దిరోజులుగా నిలవలేదు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లు కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. మోస్ట్ పాపులర్ షో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అరెస్ట్ కావడం సంచలనమైంది. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. రెండు రోజుల అనంతరం కండిషనల్ బైయిల్ మీద విడుదలయ్యాడు. 


Pallavi Prashanth

ప్రశాంత్ అరెస్ట్ పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కీలక విషయం చెప్పాడు. మాటల్లో మాటగా ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయంలో ఏమైంది...  డీసీపీ జోయల్ డేవిస్ చాలా పద్ధతి గల మనిషి. కేరళకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. ఆయనంటే అందరికీ భయం. 
 


అలాంటి ఆఫీసర్ పల్లవి ప్రశాంత్ కి దండం పెట్టి వేడుకున్నాడు. అద్దాలు దించుకుని కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పాడు. కానీ పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు. మాట వినకుండా ర్యాలీ చేశాడు. దాని వలన హీరో కావాల్సిన వాడు జీరో అయ్యాడు. ఫేమ్ మొత్తం పోయింది. 
 

కాబట్టి ఫేమ్ తెచ్చుకోవడం ఈజీ... నిలబెట్టుకోవడం కష్టం. అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఈజీ... కాపాడుకోవడం, మంచి జీవితం కష్టం. డబ్బులు సంపాదించడం ఈజీ. విలువలు వదిలేస్తే డబ్బులు సంపాదించవచ్చు. కానీ నిలబెట్టుకోవడం కష్టం... అని అన్నాడు. 
 


పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి తెచ్చుకున్న పాపులారిటీ నిలబెట్టుకోలేకపోయాడు. అనుచిత ప్రవర్తనతో అరెస్ట్ అయి వచ్చిన పేరు పోగొట్టుకున్నాడని చెప్పకనే చెప్పాడు. 

 టైటిల్ గెలిచిన ఆనందం కావచ్చు... అత్యుత్సాహం కావచ్చు. పల్లవి ప్రశాంత్ చేసింది తప్పు. అందుకు మూల్యం చెల్లించాడు. వేణు స్వామి చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. 

Bigg Boss Telugu 7

రైతుబిడ్డగా లక్షల మంది అభిమానం పొందిన పల్లవి ప్రశాంత్ ని అందరూ గమనిస్తూ ఉంటారు. అతడు తనకు వచ్చిన ఫేమ్ గౌరవం నిలబెట్టుకొనేలా ప్రవర్తించాలి.  

Latest Videos

click me!