BrahmaMudi Serial Today:అరుణ్ ని వదలని కావ్య, కనకం ప్లాన్ పసిగట్టేసిన రుద్రాణి..?

Published : Dec 06, 2023, 10:40 AM IST

మరోవైపు కళ్యాణ్ అప్పూకి ఫోన్ చేస్తూ ఉంటాడు. తన నిశ్చితార్థం గురించి చెప్పాలని అనుకుంటాడు. కానీ, అప్పూ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. మళ్లీ చేస్తాడు. అయినా కట్ చేస్తుంది. అప్పుడే కనకం బయటి నుంచి వస్తుంది. అది  చూసి కళ్యాణ్ ఆపుతాడు. ఆపి, అప్పూకి ఫోన్ చేయడానికి కనకం ఫోన్ అడుగుతాడు. 

PREV
17
BrahmaMudi Serial Today:అరుణ్ ని వదలని కావ్య, కనకం ప్లాన్ పసిగట్టేసిన రుద్రాణి..?
Brahmamudi


BrahmaMudi Serial Today: అప్పూ తో కళ్యాణ్ పెళ్లి జరిపించడానికి కనకం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికోసమే దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టింది. అక్కడికి వెళ్లాక స్వప్న విషయం తెలిస్తుంది. అయినా కూడా స్వప్న సంగతిని కావ్యకు వదిలేసి అనామికతో కలిసి కళ్యాణ్ పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే,  పెళ్లికి ముహూర్తాలు పెట్టే పంతులు ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. కనకం వేసిన ప్లాన్ లో ఆ పంతులు కూడా పడిపోతాడు. ఆమె చెప్పినట్లే చేస్తానంటాడు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

27
Brahmamudi

కావ్య, అరుణ్ ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకోవడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అరుణ్ కాన్ఫరెన్స్ కి వెళ్లలేదని,కావాలని తప్పించుకున్నాడని, పారిపోయాడు, అదృశ్యమయ్యాడని, ఎక్కడో దాసుకున్నాడు అని అంటుంది.  ఇంట్లో అందరూ వాడి గురించి వదిలేసిన తర్వాత, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని రాజ్ అడుగుతాడు. అన్ని నిందలు పడినా మీ అక్కే అన్నీ దులిపేసుకొని ఉన్నప్పుడు నీకు ఎందుకు అని అడుగుతాడు. ఇక, కావ్య మళ్లీ ఎప్పటిలాగానే భారీ డైలాగులు చెబుతుంది. వినే వాళ్లకు విసుగు వచ్చేదాకా.. నోటికి కూడా తిరగని పదాలతో కావ్య డైలాగులు చెబుతుంది. అది విని రాజ్ కూడా ఇరిటేట్ అయిపోతాడు. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని అడుగుతాడు. కానీ, కావ్య వినదు. దీంతో  రాజ్ కావ్యకు ఇష్టమైన బొమ్మను పగలకొడతాను అంటాడు. కావ్య తన బుర్ర తింటోందని, అందుకే తనకు ఇష్టమైన బొమ్మ పగలకొడతానని భయపెడతాడు. నిజంగానే భయపెడతాడు కానీ, పగలకొట్టకుండా చేతికి ఇచ్చి వెళతాడు. దీంతో, కావ్య మనసులో రాజ్ ని తలుచుకొని మురిసిపోతుంది. మీరు చాలా మంచివారని తనకు తెలుసని నవ్వుకుంటుంది.ఈలోగా రాజ్, పక్కనే ఉన్న వైట్ బోర్డ్ మీద ఏదో రాసేస్తూ ఉంటాడు.

37
Brahmamudi


మరోవైపు కళ్యాణ్ అప్పూకి ఫోన్ చేస్తూ ఉంటాడు. తన నిశ్చితార్థం గురించి చెప్పాలని అనుకుంటాడు. కానీ, అప్పూ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. మళ్లీ చేస్తాడు. అయినా కట్ చేస్తుంది. అప్పుడే కనకం బయటి నుంచి వస్తుంది. అది  చూసి కళ్యాణ్ ఆపుతాడు. ఆపి, అప్పూకి ఫోన్ చేయడానికి కనకం ఫోన్ అడుగుతాడు. ఇచ్చినట్లే ఇచ్చిన కనకం, తర్వాత నిశ్చితార్థం విషయం చెబితే, అప్పూ రాదేమో అని భయపడి మళ్లీ ఫోన్ లాగేసుకుంటుంది.

47
Brahmamudi

ఇక రుద్రాణి కనకం కోసం చూస్తూ ఉంటుంది. ఎక్కడ కనకం వచ్చి తన గదిలో పడుకుంటుందేమో అని రుద్రాణి భయం. అందుకే లోపల లాక్ వేసేసుకుంటుంది.  కనకం డైరెక్ట్  గా రుద్రాణి గదికి వెళ్లి.. డోర్ కొడుతుంది. ఎంతసేపటికి డోర్ రాకపోవడంతో, కనకం తన దగ్గర ఉన్న పిన్ తో ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. కనకం స్టోర్ రూమ్ లో పడుకొని ఉంటుందని రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. కానీ, కనకం అప్పటికే లోపలికి వెళ్లిపోతుంది. రుద్రాణి నైట్ సూట్ తీసుకొని వేసుకుంటుంది. అది తెలియని రుద్రాణి ప్రశాంతంగా వెళ్లి పడుకుందామని  చూసేసరికి తన డోర్ లాక్ తీసి ఉంటుంది. లోపలికి వెళ్లే సరికి, రుద్రాణి డ్రెస్  కనకం వేసుకొని కనిపిస్తుంది. తన డ్రెస్ వేసుకున్నావేంటి అని రుద్రాణి తిడుతుంది. వాళ్లిద్దరి మధ్య కన్వర్జేషన్ ఫన్నీగా ఉంటుంది. నేను లాక్ వేస్తే డోర్ ఎలా తీశావ్ అని అడుగుతుంది. అయితే, పిన్ తో తీసా అని చెబుతుంది. అది విని రుద్రాణి షాకౌతుంది. తనకంటే పెద్ద దొంగలా ఉందని మనసులోనే అనుకుంటుంది.

57
Brahmamudi

ఇక, ఉదయాన్నే ఇంట్లో అందరూ నిశ్చితార్థ ఏర్పాట్లలో ఉంటారు. పంతులు గారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కనకం కూడా రెడీ అవుతుంది. అప్పుడే అప్పూ ఫోన్ చేసి తాను వచ్చానని, బ్యాగ్ తీసుకొని వెళ్లమని అడుగుతుంది. కనకం లోపలికి రమ్మని అడుగుతుంది. కానీ, అప్పూ రాను అని చెబుతుంది. అప్పూని ఎలా ఆపాలని చూస్తుంటే..  సరిగ్గా కళ్యాణ్ కనిపిస్తాడు. వెంటనే కళ్యాణ్ ముందు అప్పూని బుక్ చేస్తుంది. ఇక, కళ్యాణ్ బలవంతంగా అప్పూని లోపలికి తీసుకొని వెళతాడు.

67
Brahmamudi


అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. అక్కడ కూడా కనకం సూసైడ్ లెటర్ చూపించి బెదిరిస్తుంది. దీంతో, పంతులు గారు పెళ్లి ఆపడం ఎలాగో తనకు బాగా తెలుసు అంటాడు. తర్వాత అనామిక కుటుంబసభ్యులు కూడా వచ్చేస్తారు. అందరూ కూర్చొని ఉండగా, మంచి ముహూర్తం చూడమని అపర్ణ అడుగుతుంది. తొందరగా ముహూర్తం పెట్టమని ధాన్యలక్ష్మి అంటుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు  కనకం, పాయిజన్ బాటిల్ ని పంతులు గారికి చూపిస్తూ ఉంటుంది. పంతులు కనకం ని చూసి భయపడుతూ ఉంటాడు. అది రుద్రాణి పసిగట్టేస్తుంది. పంతులు ఎందుకు.. కనకంని చూస్తున్నాడు అనే అనుమానం ఆమెకు కలుగుతుంది.

77
Brahmamudi


పంతులుగారు.. ఎంతసేపటికి చెప్పకపోవడంతో, జాతకంలో దోషం ఉందా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. పంతులుగారు అసలు విషయం చెప్పకుండా నాన్చుతూ ఉంటాడు.  తర్వాత అబ్బాయి జాతకం అమోఘంగా ఉందని, కానీ అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉందని చెబుతాడు. పంతులు ఊరికే కనకాన్ని చూడటం రుద్రాణికి అనుమానం కలుగుతుంది. కమింగప్ లో దోషం ఉండటంతో పెళ్లి ఆపేద్దాం అని ధాన్యలక్ష్మి అంటుంది. కానీ, కావ్య వారందరినీ సంతోషపెట్టడానికి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.

click me!

Recommended Stories