BrahmaMudi serial Today: పంతులునే బ్లాక్ మెయిల్ చేసిన కనకం, ఇక కళ్యాణ్ పెళ్లి అనామికతో జరగడం కష్టమే..!

First Published Dec 5, 2023, 10:24 AM IST

 కనకం చేస్తున్న ఓవర్ యాక్షన్ ని రుద్రాణి పసిగడుతుంది. నిజంగా ఇంటికి తీసుకువెళ్లాలి అనుకుంటే, లాక్కొని వెళ్లాలి కానీ, ఇలా డైలాగులు చెబుతుంది ఏంటి అని ఆలోచిస్తుంది.
 

Brahmamudi

BrahmaMudi serial Today: కనకం స్వప్నను చూడటానికి ఇంటికి వెళ్లేసరికి రుద్రాణి రచ్చ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. స్వప్న కడుపుకు రాహుల్ కారణం కాదని, అరుణ్ కారణం అని అంటుంది. కావ్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న కనకం మొదట బాధపడుతుంది. ఆ తర్వాత ఓవైపు స్వప్న కాపురం బాగుచేయడంతో పాటు, మరోవైపు కళ్యాణ్ తో అప్పూ పెళ్లి కూడా జరిగేలా చేయాలని తీర్మానించుకుంటుంది. ఇప్పుడు స్వప్నును తీసుకొని పుట్టింటికి వెళితే, అప్పూ పెళ్లి కూడా చేయలేను అనుకుంటుంది. అందుకే, ఆ ఇంట్లోనే ఉండాలని అనుకుంటుంది. కానీ, ఆ విషయం బయటకు చెప్పకుండా, స్వప్ను తాను తమ ఇంటికి తీసుకువెళతాను అని మొదలుపెట్టి, ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. తమ బీద అరుపులన్నీ అరుస్తుంది. కనకం చేస్తున్న ఓవర్ యాక్షన్ ని రుద్రాణి పసిగడుతుంది. నిజంగా ఇంటికి తీసుకువెళ్లాలి అనుకుంటే, లాక్కొని వెళ్లాలి కానీ, ఇలా డైలాగులు చెబుతుంది ఏంటి అని ఆలోచిస్తుంది.

Brahmamudi

కనకం మాత్రం తన డ్రామా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అందరి ముందు స్వప్నను తీసుకువెళతాను అని చెబుతూనే, స్వప్న మాత్రం తనతోరాను అని చెప్పేలా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మాటలకు స్వప్న ఆలోచిస్తూ ఉండిపోతుంది. వెంటనే కావ్య కలగజేసుకొని, ‘అక్క కాపురం ఎలా సరిచేయాలా అని ఆలోచించాలి కానీ, నువ్వే నాశనం చేస్తానంటావేంటి అమ్మ, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావ్’ అని కావ్య అంటుంది. రుద్రాణి మాత్రం ‘ లేదు లేదు, మీ అమ్మ చాలా క్లారిటీగా మాట్లాడుతుంది.ఇక్కడికంటే మీ అక్క అక్కడే సుఖంగా ఉంటుంది. మట్టి పిసుక్కోవడం, బొమ్మలు వేసుకోవడం మీకు తెలిసిందే కదా.  పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అదే ఆత్మాభిమానం వదులుకొని , ఈ ఘట్టాన్ని మళ్లీ వెనక్కి తీసుకురాకపోతే అదేమాకు పదివేలు’ అని రుద్రాణి అంటుంది.

Latest Videos


Brahmamudi

ఇదంతా చూసిన చిట్టి‘ రుద్రాణి.. ఇక నువ్వు మాట్లాడింది చాలు.అత్తారింట్లో కూతురికి అన్యాయం జరుగుతుంటే, ఏ తల్లీ చూస్తూ భరించలేదు. అందుకే కనకం అంత ఆవేదన పడుతుంది. అది ఆసరాగా తీసుకొని, అదే అవకాశంగా తీసుకొని పుట్టింటికి పంపించాలని అనుకుంటున్నావా? నెలరోజుల్లో డీఎన్ఏ టెస్టు జరిగే వరకు స్వప్న ఇక్కడే ఉండాలి’ అని తీర్మానం చేస్తుంది.

Brahmamudi

వెంటనే కనకం‘ అమ్మా మీరు పెద్దవారు మీరు చెప్పిన దానికి నేను కాదనలేను. కానీ, అప్పటి వరకు అయినా నా కూతురిని ఈ రుద్రాణి గారు బతకనిస్తారని నేను అనుకోవడం లేదు.’అని అంటుంది. ‘ ఇంట్లో ఇంతమంది ఉన్నాం, నీ కూతురిని కష్టపెడుతుంటే చూస్తూ ఊరుకుంటామా’ అని చిట్టి అంటే, ‘ అవునమ్మా, నా గురించి నేను చూసుకుంటాను. నా గురించి నువ్వేమీ టెన్షన్ పడకు’ అని స్వప్న చెబుతుంది.‘ టెన్షన్ పడకపోవడానికి వచ్చింది జ్వరం కాదు కడుపు. ఆ విషయం లో నేను కాలు కదపకుండా చూసుకోవాలి కదమ్మా. నీ అత్తారింట్లో కన్నతల్లిని నేను ఉండలేను. అందుకే  చెబుతున్నాను. మన ఇంటికి వచ్చేయ్, అక్కడ నేను నిన్ను కాలు కదపకుండా చూసుకుంటాను’ అని కనకం చెబుతుంది. అక్కడ అందరికీ తనను ఇక్కడ ఉంచండి అని హింట్ ఇచ్చింది. వెంటనే చిట్టి.. ‘ నువ్వు ఇక్కడే ఉండి, నీ కూతురిని చూసుకో’ అని సలహా ఇస్తుంది. కనకం తాను కావాలి అనుకున్నది ఇంటి పెద్ద నోటి నుంచి వచ్చేలా చేస్తుంది.

రుద్రాణి మాత్రం అందుకు ఒప్పుకోదు. తప్పు చేసిన స్వప్నను అయినా భరిస్తాను కానీ, ఈ కనకం ని భరించలేను అంటుంది. ‘అదేంటి రుద్రాణి గారు అలా అంటారు. నేనేదో మూలన పడి ఉండేదాన్ని, మీకేం అడ్డుగా ఉంటాను. స్వప్నను ఈ ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లలేను. ఈ తల్లి మనసు అర్థం చేసుకోండి.’ అని కనకం చెబుతుంది. కనకం అంటే అస్సలు నచ్చని వారిలో రుద్రాణితో పాటు అపర్ణ కూడా ఒకరు. అందుకే, ఆమె ఉండటం ఇష్టంలేక అడ్డు పుల్ల వేసే ప్రయత్నం చేస్తుంది. కనకం ఇక్కడ ఉంటే, అక్కడ వాళ్ల ఇంట్లో ఇబ్బంది పడతారు కదా అంటుంది. కనకం మాత్రం అక్కడ వాళ్ల ఆయనను చూసుకోవడానికి తమ అన్నపూర్ణ అక్క ఉందని, ఇక్కడ తన స్వప్నను చూసుకోవడానికే  ఎవరూ లేరని భయంగా ఉంది అంటుంది.

Brahmamudi


కనకంకి ధాన్యలక్ష్మి సపోర్ట్ గా నిలుస్తుంది. ‘రుద్రాణి మాటలు వింటే ఏ తల్లికి అయినా భయంగానే ఉంటుంది. మా అత్తయ్యచెప్పినట్లు మీరు ఇక్కడే ఉండండి కనకం గారు. అప్పుడే మీకు నిశ్చింతగా ఉంటుంది’ అని అంటుంది. ఆ మాటకు అపర్ణ, రుద్రాణి, రాహుల్ ముఖాలు మాడిపోతాయి. ఇక, ఇదే నా శాశనం అని చిట్టి తేల్చేస్తుంది. తర్వాత కళ్యాణ్ పెళ్లి పనులు మొదలుపెట్టాలని, పంతులు గారిని పిలవమని చెబుతుంది. అది విన్న కనకం, ఆ పంతులు ఎవరో కనుక్కోవాలని, అప్పూతోనే పెళ్లి జరపించాలని అనుకుంటుంది.

మరోవైపు మూర్తి ఇంట్లో బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటాడు. అంతలో అన్నపూర్ణకు కనకం ఫోన్ చేస్తుంది. ఇక్కడ జరిగిన విషయాలను చెప్పకుండా, స్వప్న బాగుందని, తన బట్టలను అప్పూకి ఇచ్చి పంపించమని అంటుంది. దానికి అన్నపూర్ణ... అప్పూ ఎందుకులే, అక్కడ కళ్యాణ్ ని చూసి బాధపడుతుంది అని అంటుంది. కానీ, కనకం అప్పూ రావాలని, ఇదంతా అప్పూ కోసమే చేస్తున్నానని, కళ్యాణ్ పెళ్లి అనామికతో జరగదని తెలిస్తే, అప్పూ సంతోషిస్తుందని, తననే పంపమని చెబుతుంది. అది కూడా రేపు కళ్యాణ్ లగ్నపత్రిక రాసే సమయంలో అప్పూ అక్కడ ఉండాలని, ఆపెళ్లి జరగదని అప్పూ వినాలని కనకం అంటుంది. అన్నపూర్ణ సరేనని చెబుతుంది.
 

Brahmamudi


ఇక, అప్పూ ఇంట్లో డల్ గా ఉంటుంది. అక్కడికి అన్నపూర్ణ వచ్చి, ‘మీ అక్క కడుపుతో ఉంది కదా, తనను చూసుకోవడానికి మీ అమ్మను అక్కడే ఉండమన్నారంట.’ అని చెబుతుంది. ఆ ఇంట్లో అంతమంది ఉన్నారుగా, మళ్లీ అమ్మ ఎందుకు అంటుంది. దానికి అన్నపూర్ణ అవన్నీ నాకు తెలీదు, రేపు నువ్వు అమ్మ బ్యాగ్ తీసుకొని వెళ్లు అంటుంది. దానికి అప్పూ తనకు ఇష్టం లేదని చెబుతుంది. అయితే, మీ అమ్మ మీ కోసం అంత కష్టపడుతుంటే, ఆ మాత్రం చేయలేవా అంటుంది. చేసేది లేక అప్పూ కూడా ఒప్పుకుంటుంది.

Brahmamudi

ఇక, స్వప్న వాళ్ల అమ్మ తెచ్చిన స్వీట్లు తింటుంది. అప్పుడు కూడా స్వీట్లు తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్పకపోగా, పిచ్చిగా మాట్లాడుతుంది. అయితే,  స్వప్న తెలివితేటలపై కావ్య సెటైర్ వేస్తుంది. ఇక, స్వప్న, కావ్య ఇద్దరూ కలిసి కనకంని మధ్యలో పెట్టుకొని వాయిస్తారు. వారిద్దరినీ కనకం సముదాయిస్తుంది. తర్వాత కావ్యను తీసుకొని బయటకు వెళ్తుంది. తర్వాత రుద్రాణి.. స్వప్న మీద చాలా కోపంగా ఉందని అంటుంది. అయితే, అక్క ఈ విషయంలో తప్పు చేయలేదని, దానికి సపోర్ట్ గా ఉంటానని చెబుతుంది. ఆ మాట విని హమ్మయ్య అని కనకం అనుకుంటుంది.

తర్వత కళ్యాణ్, అనామికల గురించి ఆరాతీస్తుంది. ఇద్దరూ సఖ్యతగానే ఉన్నారా అని అడుగుతుంది. ఉన్నారని, అందుకే పెళ్లి చేస్తున్నారని కావ్య అంటుంది. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, మన ఇంటి దగ్గర గొడవ పడ్డారని అందుకే అని అంటుంది. వాళ్ల జంట బాలేదని కనకం అంటే, లేదమ్మా..  చూడముచ్చటగా ఉన్నారు అని కావ్య చెబుతుంది. ఆ మాట విని, కావ్య తనకు ఈ విషయంలో సపోర్ట్ చేయదని అర్థంచేసుకుంటుంది. తర్వాత పంతులు వివరాలు అడిగి తెలుసుకుంటుంది. తర్వాత తన పనిని పంతులు దగ్గర నుంచి మొదలుపెట్టాలి అని అనుకుంటుంది.

Brahmamudi

వెంటనే పంతులు దగ్గరకు వెళ్లి మాయ చేయడం మొదలుపెడుతుంది. కళ్యాణ్ పెళ్లి చెడగొట్టమని అడుగుతుంది. మొదట పంతులు ఒప్పుకోను అంటాడు. కానీ, అతనిని కూడా చనిపోతాను అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. తన చివరి కోరిక అంటూ ఓ లెటర్ రాసి, పంతులుకి ఇస్తుంది. అంతేకాదు, తన చావుకు ఆ పంతులే కారణం అని చెప్పడం విశేషం. ఇప్పటికిప్పుడు ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తుంది. వద్దు అని పంతులు అంటే, ఆ పెళ్లి చెడగొట్టమని అడుగుతుంది. ఆయన తాను చెయ్యలేను అంటే, చచ్చిపోతానని విషం బాటిల్ పట్టుకుంటుంది. ఆయనను విపరీతంగా బెదిరిస్తుంది. కనకం బెదిరింపులకు పంతులకు కూడా లొంగిపోతాడు. జాతకాలు కలవలేదని, పెళ్లి జరగకూడదని చెబతానని అంగీకరిస్తాడు. దీంతో కనకం సంతోషంగా వెళ్లిపోతుంది.

రాత్రి తన గదిలో కావ్య ఓ చార్ట్ పేపర్ మీద ఏదో గీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదేంటో చూడటానికి రాజ్ వస్తాడు.ఇద్దరూ చుక్కల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత నువ్వు ఏ చుక్కలు గీస్తున్నావ్ అంటూ, అరుణ్ ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచిస్తున్నానని చెబుతుంది. ఇక, కమింగప్ లో పంతులుగారు.. అనామిక జాతకంలో దోషాలు ఉన్నాయని, ఈ పెళ్లి జరగకూడదని చెబుతాడు.
 

click me!