Guppedantha Manasu
Guppedantha Manasu 2nd March Episode: కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ని ఎలా కంటిన్యూ చేయాలి అనే విషయంపై బోర్డు మెంబర్స్ అందరూ చర్చిస్తారు. గతంలో జగతి చేసే పనులన్నీ ఇప్పుడు అనుపమ చూసుకుంటూ ఉంటుంది. దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకు వచ్చిన సంతరా బాబు అని శైలేంద్ర అది వినలేక చస్తాడు. మను మాత్రం.. ఇంకా కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే ఏంజెల్ కాలేజీలోకి అడుగుపెడుతుంది. ఏంజెల్ కి అనుపమ ఎదురుపడుతుంది. అయితే.. ఏంజెల్ ముఖం దిగాలుగా ఉండటంతో ఏం జరిగింది అని అనుపమ అంటే.. రిషి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. రిషి తన బెస్ట్ ఫ్రెండ్ అని, రిషికి అలా జరిగితే కనీసం నాకు చెప్పరా అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు.. అసలు జరిగిన విషయం అనుపమ మొత్తం చెబుతుంది.మొదట రిషి కిడ్నాప్ అయ్యాడని.. వసు చాలా కష్టపడి రిషి ఆచూకీ కనిపెట్టిందని చెబుతుంది. రిషి అనారోగ్యంతో ఉన్నాడని.. కానీ కాలేజీలో ఫెస్ట్ కి రిషిని తీసుకువస్తుంటే.. మరోసారి మిస్ అయ్యాడని, తర్వాత ఓ గుర్తు తెలియని శవం కనిపించిందని, డీఎన్ఏ టెస్టులో అది రిషిదే అని తేలిందని చెబుతుంది. అదంతా చూసి రిషి చనిపోయాడని తామంతా అనుకున్నాం అని.. కానీ.. వసు మాత్రం ఒప్పుకోవడం లేదని, రిషి బతికే ఉన్నాడని మొండిగా ప్రవర్తిస్తోంది అని చెబుతుంది. రిషి ఆత్మ శాంతికి జరిపించాల్సిన కార్యక్రమాలను కూడా జరగనివ్వడం లేదని చెబుతుంది. రిషిని తీసుకువస్తాను అని వసు నమ్మకంగా ఉందని.. ఆ నమ్మకం నిజం కావాలని మేం కూడా కోరుకుంటున్నాం అని అనుపమ చెబుతుంది.
Guppedantha Manasu
అప్పుడు వసుధార, మను ఎంట్రీ ఇస్తారు. వసు ఏంజెల్ అంటూ ప్రేమగా వెళ్లి చేతులు పట్టుకొని ఎప్పుడు వచ్చావ్ అని అడుగుతుంది. ఏంజెల్ మాత్రం డల్ గా ఇప్పుడే వచ్చాను అని.. వసుని హత్తుకుంటుంది. ఏంజెల్ ఏం చెప్పకపోయినా వసుకి అర్థమౌతుంది. రిషి సర్ ఉన్నారని, మూడు నెలలలో రిషి సర్ ని తీసుకువస్తాను అని చెబుతుంది. ఏంజెల్.. నేను నిన్ను నమ్ముతున్నాను, అత్తయ్య నాకు చెప్పిందని.. ఏ విషయంలో అయినా నేను నీకు తోడుగా ఉంటాను అని చెబుతుంది. అయితే.. అనుపమను అత్తయ్య అని పిలవడంతో మనులో డౌట్స్ వస్తాయి.
Guppedantha Manasu
మను ని చూసి.. ఎవరు ఇతను అని ఏంజెల్ అడుగుతుంది. వసు పరిచయం చేస్తుంది. ఏంజెల్ కూడా మనుకి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంటుంది. రిషి సర్ కి ఫ్రెండ్ అని వసు చెబుతుంది. ఆ తర్వాత.. మను... ఈ ఏంజెల్ ఎవరు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అత్తయ్య అని ఎందుకు పిలుస్తుందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఏంజెల్ వచ్చి.. మను ని పలకరిస్తుంది. ఆ తర్వాత వసు-రిషిల ప్రేమ కథను వివరిస్తుంది. వసుధార కచ్చితంగా రిషిని తీసుకువస్తారనే నమ్మకం తనకు ఉందని ఏంజెల్ చెబుతూ ఉంటుంది.
Guppedantha Manasu
దూరం నుంచి అనుపమ వీళ్లను చూస్తుంది. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారేంటి అని అనుపమ కంగారుపడుతూ ఉంటుంది. అనుపమ కంగారపడటం వసుధార కూడా గమనిస్తూ ఉంటుంది. మరోవైపు ఏంజెల్.. మీరు వసుధారకు సపోర్ట్ గా ఉండాలి అని అంటుంది. దానికి మను సరే అంటుంది. తర్వాత.. మీరు అనుపమ గారిని అత్తయ్య అని ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతాడు. ఆమె తనకు మేనత్త అని చెబుతుంది. తన డాడీ వాళ్ల చెల్లెలు అని చెబుతుంది. తన చిన్నప్పుడు వాళ్ల మమ్మీ డాడీ చనిపోయారని.. వాళ్ల తాతయ్య దగ్గర పెరిగాను అని చెబుతుంది. తాతయ్య పేరేంటి అని మను అడుగుతాడు. ఏంజెల్ చెప్పేలోగా అనుపమ ఆపేస్తుంది. టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. దీంతో.. ఏంజెల్ వచ్చి మహేంద్ర సర్ గురించి అడుగుతుంది, బయటకు వెళ్లారు అని వసుధార చెబుతుంది. తర్వాత ఏంజెల్ వెళ్లిపోతాను అని చెబుతుంది. వసు ఉండమని అడుగుతుంది. మళ్లీ వస్తాను అని చెప్పి, వసుకి ధైర్యం చెప్పి ఏంజెల్ వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
మరోవైపు శైలేంద్ర, రాజీవ్ లు కలుసుకుంటారు. మను ఇచ్చిన వార్నింగ్ గురించే శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. మను మనకు శనిలా దాపరించాడని, ఇద్దరికీ చుక్కలు చూపిస్తున్నాడని రాజీవ్ అంటాడు. మను మీద కోపంతో.. శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారు అని రాజీవ్ అడిగితే. నా నుంచి కాలేజీని కాపాడాలని ఆ మను, రిషి గాడికోసం వెతికే పనిలో మీ మరదలు ఉంది అని శైలేంద్ర చెబుతాడు. ఆ మను గాడిని కంట్రోల్ చేయలేమా అని రాజీవ్ అడుగుతాడు. నా మరదలి కోసం నేను చాలా వెదవ పనులు చేశానని, ఏకంగా నా భార్యను కూడా చంపానని రాజీవ్ చెబుతాడు. ఆ మాట విని శైలేంద్ర షాకౌతాడు. నువ్వు కూడా నాలాగే దుర్మార్గుడివి అనుకున్నాను కానీ.. ఇంత నీచుడువి అనుకోలేదు అని శైలేంద్ర అంటాడు. ఆ విషయాల గురించి ఇక మనమే మాట్లాడుకోవాలి అని రాజీవ్ వెటకారంగా అంటాడు. ఇక ఇద్దరూ కలిసి మనుని ఎలా తప్పించాలి? వసుధారను ఎలా దక్కించుకోవాలి అనే దానిపై ప్లాన్స్ వేయాలి అని అనుకుంటారు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న వసుధార కారుు మధ్యలో ఆగిపోతుంది. అప్పుడే మను కూడా అటువైపు వస్తాడు. వసుధార కారు చెక్ చేసి.. కారు స్టార్ట్ చేయమని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.