BrahmaMudi 28th February Episode:కవి కి కోపం.. అనామికను ఏకిపారేసిన కళ్యాణ్, నువ్వు ప్రేమించింది కవిత్వాన్ని క

First Published | Feb 28, 2024, 10:21 AM IST

ఇంట్లో కనీసం  కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదని వెళ్లిపోబోతుంది. అయితే.. ధాన్యలక్ష్మి ఆపుతుంది. ఈ ఇంట్లో ఇప్పటి వరకు  ఇంత కన్నా పెద్ద రచ్చలు చాలానే జరిగాయని, ఏం జరిగిందో చెప్పమని అంటుంది.
 

Brahmamudi

BrahmaMudi 28th February Episode: ఎంతో ఆశగా ఆఫీసుకు వెళ్లిన అనామికకు ఊహించని షాక్ ఎదురౌతుంది.  కళ్యాణ్ అక్కడ కూడా కవితలుచెబుతూ ఉండటం చూసి రగిలిపోతుంది. అందరి ముందే అరిచేస్తుంది. అయితే.. అది ఆఫీస్ అని, ఇంట్లో తేల్చుకోమని రాజ్ చెప్పడంతో కోపంగా ఇంటికి వెళ్తుంది. సాయంత్రం కళ్యాణ్ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. అనామిక కోపాన్ని చూసి  ధాన్యలక్ష్మి ఏమైందని అడుగుతుంది. ఇప్పుడు కాదని.. అందరినీ పిలిచానని.. అందరూ వచ్చిన తర్వాతే చెబుతాను అని అంటుంది. ఈ లోగా ఇంట్లో అందరూ హాల్ లోకి వస్తాడు. అప్పుడే ఆఫీసు నుంచి కళ్యాన్, రాజ్, కావ్యలు కూడా వస్తారు.

Brahmamudi

కళ్యాణ్ రాగానే.. వచ్చారా... కవి పుంగవా.. నీ వెనక ఎవరు ఉన్నారు..? ఆ సూత్రధారి, కపటధారి అని భారీ డైలాగులు కొడుతుంది. అది విని అపర్ణకు చిరాకుపడుతుంది. నీకు కూడా మీ అత్తలాగా తిక్క ఎక్కిందా..? నార్మల్ గా చెప్పలేవా ఏవేవో మాట్లాడుతున్నావ్ అని తిడుతుంది. అయితే.. వెంటనే అనామిక తనకు ఈ  ఇంట్లో కనీసం  కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదని వెళ్లిపోబోతుంది. అయితే.. ధాన్యలక్ష్మి ఆపుతుంది. ఈ ఇంట్లో ఇప్పటి వరకు  ఇంత కన్నా పెద్ద రచ్చలు చాలానే జరిగాయని, ఏం జరిగిందో చెప్పమని అంటుంది.


Brahmamudi

నీకు వచ్చిన కష్టం ఎవరితో అని అడిగితే.. మీ అబ్బాయితో అని కళ్యాణ్ ని చూపిస్తుంది. మా మనవడు ఏం చేశాడు అని ఇందిరాదేవి అడిగితే.. ఆఫీసుకు వెళ్లి పని చేసుకోమంటే.. కవి సమ్మేళనం మొదలుపెట్టాడు అని చెబుతుంది. ఆఫీసులో కావ్య అక్క, రాజ్ బావ, ఆఫీసు స్టాప్ అందరినీ పోగేసుకొని కవితలు చెబుతున్నాడు అని అంటుంది. అయితే.. ఈ విషయాలన్నీ నువ్వు ఇంట్లోనే అడుగుతున్నావా అని సుభాష్ అడిగితే.. ఆఫీసులో అందరి ముందు కడిగేసే వచ్చింది అని ప్రకాశం చెబుతాడు.

Brahmamudi

భర్తను ఆఫీసులో అందరి ముందు ప్రశ్నిస్తావా అని సుభాష్ అంటాడు. వెంటనే రాజ్ కూడా.. అసలు ఆఫీసులో నువ్వు అన్ని మాటలు అంటున్నా నేను కానీ, నా భార్య కానీ, నా తమ్ముడు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. అయినా నువ్వు ఇంటికి వచ్చి అంత రచ్చ చేస్తున్నావ్..? అసలు ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలీదా? ఆఫీసులో నా తమ్ముడిని ప్రశ్నించే హక్కు నీకు లేదు.. నీకే కాదు మాకు కూడా లేదు. తమ్ముడి భార్యతో బావగారిని ఇలా మాట్లాడటం కూడా నాకు నచ్చడం లేదు అని రాజ్ అంటాడు.

వెంటనే స్వప్న.. ధాన్యలక్ష్మీ ఆంటీ.. నా కోడలు నా కోడలు అన్నారు కదా.. మీ కోడలు ఆఫీసులో అందరి ముందు కడిగిపారేసిందంట. ఇప్పుడు కూడా మీ కోడలు చేసింది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా అని సెటైర్ వేస్తుంది. వెంటనే.. ధాన్యలక్ష్మి.. అదేంటి అనామిక చూసి వచ్చేయాలి కానీ.. ఆపీసులో అందరి ముందు అడిగితే.. నా కొడుకు పరువు ఏం కావాలి అని అంటుంది.
 

Brahmamudi

అత్త కూడా తనకు సపోర్ట్ చేయకపోవడంతో..  మీరందరూ ఒక్కటయ్యారు.. నా భర్త మంచి స్థానంలో ఉండాలని నేను కలలు కన్నాను. బలవంతంగా ఆఫీసుకు పంపాను. అక్కడ ఆయన కవిత్వాలు రాసుకుంటూ కూర్చుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. అని  అనామిక అంటుంది. వెంటనే కావ్య.. అసలు కవిగారు చేసిన తప్పేంటి,..? ఆయన కవిత్వాలు రాస్తారని నీకు తెలుసు కదా..? తెలిసే ఇష్టపడ్డావ్ కదా అని అడుగుతుంది. నా మరదిగారు సరస్వతీ పుత్రుడని, ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప.. సరస్వతీ కటాక్షం లభించదు అని చాలా గొప్పగా చెబుతుంది.

ఇక సందు దొరికిందని.. అసలు అంతా చేసింది నువ్వే.. నా భర్తను అసమర్ధుడిని చేసి.. నువ్వు నీ భర్తను అందలం ఎక్కించాలని అనుకుంటున్నావ్.. అసలు తప్పంతా మీదే. ఆఫీసుకు వచ్చిన కళ్యాణ్ కి కనీసం బావగారు.. పని కూడా ఇవ్వలేదు.. అని తప్పంతా రాజ్, కావ్యల మీదకు తోసేస్తుంది. అది చూసి అందరూ షాకౌతారు.

Brahmamudi

అప్పుడే కళ్యాణ్.. గట్టిగా అనామిక మీద షటప్ అని అరుస్తాడు. కళ్యాణ్ కి కూడా ఇంత కోపం వస్తుందా అనిపించేలా చేశాడు. ఇక తన ఫ్రస్టేషన్ మొత్తం తీర్చేసుకుంటాడు. తన అన్న, వదినలను ఏమైనా అంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. నీ మీద ప్రేమతో తనకు ఇష్టం లేకపోయినా ఆఫీసుకు వెళ్లానని చెబుతాడు. తనకు తన అన్నలాగా క్లైంట్స్ ని డీల్ చేయడం రాదని అలా అని తాను అసమర్థుడిని అయిపోనని చెబుతాడు. నేను నీకు కవిగా తెలుసా? బిజినెస్ మెన్ గా తెలుసా అని ప్రశ్నిస్తాడు. కవులంటే గౌరవం అని, కవిత్వం అంటే ప్రేమ అని చెప్పావని.. ఇదేనా ప్రేమ అని అడుగుతాడు. ఇప్పుడు చెబుతున్నా చూడు.. నేను కవిగానే ఉంటాను. నేను కవిత్వమే రాసుకుంటాను. నాకు నచ్చిన దారిలోనే నేను వెళతాను. నీకు నచ్చినట్లుగా ఉండలేను.. నీ ఆశలు, కలలు నెరవేర్చలేను అని తేల్చి చెబుతాడు. కళ్యాణ్ నిర్ణయానికి అనామికకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంటనే తన గదిలోకి పరుగులు తీస్తుంది.

Brahmamudi

అనామిక అలా వెళ్లిపోయింది ఏంటి  అని ధాన్యలక్ష్మి అంటే.. ఆవేశంలో ఏమైనా చేసుకుంటుందేమో అని రుద్రాణి అంటుంది. కానీ.. పైకి వెళ్లిన అనామిక.. కళ్యాణ్ రాసుకున్న కవితలన్నింటినీ కిందకు విసిరేస్తుంది. ఈ పనికిమాలిన కవితలు రాసుకుంటూ.. వీటినే నమ్ముకొని బతుకుతాను అంటే.. చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తుంది. నీ అభిరుచుల కోసం నా ఆశలను చంపేస్తావా? నీ పిచ్చిరాతల కోసం నేను ఇలానే బతకాలా? నువ్వు చేసేవన్నీ నేను చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతుంది.

ఏం చేస్తున్నావ్ అనామక నువ్వు అని కావ్య అడుగుతుంది. కవిత్వం అంటే అంత చులకనగా ఉందా? ఇవన్నీ నీకు పిచ్చిరాతల్లా ఉన్నాయా? ఒక్క పదం రాయడం కోసం ఒక కవి ఎంత అంతర్మథనం  పడతాడో తెలుసా? ఎంత ప్రసవ వేదన పడతాడో తెలుసా? అని అడుగుతుంది. కళ్యాణ్ మధ్యలో కలగజేసుకొని.. వదిన వదిలేయండి.. కవిత్వంలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోలేని వారికి.. ఈ కాగితాలు పిచ్చి కాగితాల్లే కనిపిస్తాయి అని బాధపడతాడు. తాను రాసిన పేపర్లను తానే ఏరుకుంటూ ఉంటాడు. 

Brahmamudi

కానీ అనామిక వదలదు. ఈ పేపర్లు రాసుకోవడానికి, చదువుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే బాగుంటాయని, కానీ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే.. ఇంటి పెద్ద ఇందిరాదేవి ఆపు అనామిక అని అరుస్తుంది. కవిత్వం గురించి మాట్లాడే హక్కు నీకు లేదని అంటుంది.. ఇప్పుడు చెప్పు... నువ్వు నా మనవడు కలను చూసి చేసుకున్నావా? లేక వెనక ఉన్న ఆస్తిని చూసి చేసుకున్నావా అని అడుగుతుంది. ఆస్తి చూసే చేసుకున్నట్లయితే.. పది తరాలు తిన్నా తరనగనంత ఆస్తి ఉందని.. నువ్వుమీ మట్టిబొమ్మని శిల్పంలా చెక్కినట్లు .. ఏమీ తయారు చేయాల్సిన అవసరం లేదని, వాడి కవిత్వాన్ని కించపరిచే హక్కు లేదని వాయిస్తుంది. ఈ ఇంట్లో నువ్వు చేసిన పని ఎవరికీ నచ్చలేదు అని చెబుతుంది. అందరి ముందు ఆడపిల్లను ఏమీ అనడంలేదని అది తమ సంస్కారం అని.. లోపలికి వెళ్లిపొమ్మని చెబుతుంది. 

అయితే.. ఇంట్లోకి వెళ్తున్న అనామికను కళ్యాణ్ ఆపుతాడు. నువ్వు చెప్పాల్సింది చెప్పావ్.. నేను చెప్పాల్సింది కూడా వినేసి వెళ్లు అంటాడు. ‘నేను నీకోసం బతకను. నాకు నచ్చినట్లు మాత్రమే బతుకుతాను. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటేనే ప్రశాంతంగా బతకగలవ్.. ఇక వెళ్లు’ అని చెబుతాడు. కోపంగా అనామిక లోపలికి వెళ్తుంది. కళ్యాణ్.. తన కవితల పేపర్లను ఏరుకుంటాడు. అందరూ కళ్యాణ్ ని చాలా జాలిగా  చూస్తారు.

Brahmamudi

ఇక కళ్యాణ్ బెడ్రూమ్ లోకి వెళ్లే సరికి అనామిక పడుకొని ఉంటుంది. కళ్యాణ్ తన పేపర్లను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుంటూ ఉంటే. కోపంగా పైకి లేస్తుంది. ఇంకా ఏమైనా చెప్పడానికి మిగిలి ఉందా అని అడుగుతాడు. అనామిక ఏదో చెప్పేలోపే.. ఈ రోజు ప్రేమికుల రోజని, నీకోసం ఎంతో ప్రేమతో కవితరాసి, అది నేను చదువుతుంటే నీ కళ్లలో ఆనందం చూడాలని అనుకున్నానని.. కానీ.. నీకు ఈ కవితను అంకితం చేసే అర్హత కూడా లేదని ఆ పేపర్ ని నలిపేసి పక్కన పడేసి వెళ్లిపోతాడు. కళ్యాణ్ బయటకు వచ్చేసరికి కావ్య బయట ఉంటుంది. కళ్యాణ్ ని అలా చూసి చాలా బాధపడుతుంది. ఆ కవితను కావ్య తీసుకుంటుంది.

Brahmamudi

అప్పుడే అనామిక రుసరుసలాడుతూ బయటకు వెళ్తుంది. కావ్య.. ఆ కవితను చదువుతుంది.  అనామిక బయటకు వెళ్లి.. కళ్యాణ్ మాటలు వింటుంటే.. ఆఫీసుకు వెళ్లేలా లేడని, అధికారం దక్కించుకునేలా లేడు అని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

Brahmamudi

అప్పుడే కావ్య వచ్చి పిలుస్తుంది. అప్పుడు కూడా అనామిక చాలా చిరాకుగా మాట్లాడుతుంది. కానీ కావ్య.. తన కవితలతో... కళ్యాణ్ గొప్పదనం గురించి చెబుతుంది. నీవల్ల కళ్యాణ్ ఇబ్బందిపడుతున్నాడని, ఇద్దరూ మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోమని, నీ కోసం కళ్యాణ్ రాసిన కవిత ఇది అని పేపర్ అందిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగప్ లో.. కావ్య తన పుట్టింటికి వెళతాను అని రాజ్ ని అడుగుతుంది. వెంటనే వాళ్ల బావ వచ్చి.. ఇద్దరం కలిసి వెళదాం అంటాడు. అంతే ఆ మాట విని రాజ్ గుండెల్లో రాయి పడుతుంది. తాను కూడా కావ్య వాళ్ల పుట్టింటికి వెళ్లాలి అని డిసైడ్ అవుతాడు. 

Latest Videos

click me!