BrahmaMudi 27th February Episode:ముసలోళ్లకు దసరా పండగ, రాహుల్ పై స్వప్న ప్రేమ, ఆఫీసులో అనామిక రచ్చ..!

First Published | Feb 27, 2024, 11:15 AM IST

ఆమెకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అపర్ణ చాలా సిగ్గుపడుతుంది. ఎప్పుడో శోభనం రోజు సిగ్గుపడ్డావ్.. మళ్లీ ఇప్పుడు సిగ్గుపడుతున్నావ్ అని  సుభాష్ అంటాడు.

Brahmamudi

BrahmaMudi 27th February Episode:ఆఫీసులో కావ్య వేసిన డిజైన్స్ చూసి రాజ్ నచ్చలేదు అంటాడు. ఏ తలకి మాసిన వెదవ కూడా వీటిని బాగున్నాయి అనరు అని అంటాడు. ఆ మాటకు కావ్యకు కోపం వచ్చి.. మా బావ వచ్చిన తర్వాతే మీరు ఇలా మారిపోయారని, ఇంత బాగున్న డిజైన్స్ కూడా బాలేవు అంటున్నారు అని అంటుంది. రాజ్ మాత్రం.. మళ్లీ కొత్త డిజైన్స్ వేసి తీసుకురమ్మని డిజైనర్ శ్రుతికి చెబుతాడు.

Brahmamudi

సీన్ కట్ చేస్తే ఇంట్లో సుభాష్ కూర్చొని ఉంటే.. ప్రకాశం వస్తాడు. రాజ్, కావ్య లు రెస్టారెంట్ లో చేసుకున్న వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ చూపిస్తాడు. రాజ్ కనిపించడు కానీ.. కావ్య కోసం మంచి సర్ ప్రైజ్ ఇచ్చాడు అని  ప్రకాశం అంటాడు. వాళ్లు యంగ్ కపుల్ కదరా ఆ మాత్రం ప్రేమ చూపిస్తే తప్పేంటి లే అని సుభాష్ అంటాడు. పక్కనే అమ్మానాన్న కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది అని కూడా అంటాడు. అయితే.. ప్రకాశం మాత్రం.. ఈ వీడియో మా ఆవిడ చూస్తే పెద్ద  పెంట చేసేస్తుంది అని అంటాడు. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ కూడా తమ భార్యలకు సర్ ప్రైజ్ ఇవ్వాలని ఫిక్స్ అవుతారు.


Brahmamudi

హాల్ లో రుద్రాణి, అపర్ణ, ధాన్యలక్ష్మి కూర్చొని ఉంటారు. అప్పుడే సుభాష్ వచ్చి... అపర్ణను పిలుస్తాడు. ఏంటో చెప్పమని అపర్ణ అడిగితే.. ఏదో ఫైల్ కావాలని అడుగుతాడు. అక్కడే ఉందని తీసుకోమని అపర్ణ అంటే.. కాదు నువ్వు రావాలి అని పిలుస్తాడు. అప్పుడే సుభాష్ చేతిలో గులాబి రుద్రాణి కంటపడుతుంంది. ఈ రోజు వాలంటైన్స్ డే కదా.. అన్నయ్య ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు.. వెళ్లు వదిన అంటాడు. ఆ మాటకు సిగ్గుపడుతూ అపర్ణ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిన తర్వాత సుభాష్.. ఆమెకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అపర్ణ చాలా సిగ్గుపడుతుంది. ఎప్పుడో శోభనం రోజు సిగ్గుపడ్డావ్.. మళ్లీ ఇప్పుడు సిగ్గుపడుతున్నావ్ అని  సుభాష్ అంటాడు.

Brahmamudi

సీన్ కట్ చేస్తే... ప్రకాశం వచ్చి ధాన్యలక్ష్మికి సైగలు చేస్తూ ఉంటాడు. ఈ ఛండాలం మాకు ఎందుకు అని రుద్రాణి అంటే... రుసరుసలాడుతూ ధాన్యం తన గదిలోకి వెళ్తుంది. ఏంటి అని భర్తను అడిగితే... అతను  మర్చిపోతాడు. ఏదో కవర్ చేయాలని చూస్తాడు ఈలోగా.. ఏమైంది మీ అన్నదమ్ములకు అని అడుగుతుంది. అప్పుడు ప్రకాశం కి గుర్తుకు వచ్చి.. ఐలవ్ యూ అని పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. సిగ్గుపడుతూ ధాన్యం కిందకు వస్తుంది. 

Brahmamudi

ధాన్యలక్ష్మిని ఆపి.. మా అన్నయ్య నీకు ప్రపోజ్ చేశాడా.. లేక మర్చిపోయాడా అని అడుగుతుంది. దానికి ధాన్యం.. నాకు మతిమరుపు మొగుడైనా ఉన్నాడు.. నీకు అది కూడా లేదు కదా అని సెటైర్ వేస్తుంది. ముళ్ల కంప అని తెలిసి కూడా అనవసరంగా గెలికాను అని రుద్రాణి తనని తాను తిట్టుకుంటుంది. ముసలోళ్లకు దసరా పండగలు ఎక్కువయ్యాయి అని అనుకుంటుంది.

Brahmamudi

ఇక.. స్వప్న ఆవేశంగా రాహుల్ దగ్గరకు వెళ్తుంది. ఈరోజు ఏంటి అని అడుగుతుంది. ఏమో తెలీదని రాహుల్ అంటే లాస్ట్ ఇయర్ గ్రాండ్ గా ప్రపోజ్ చేశావని, ఈ ఇయర్ మర్చిపోయావని విసుక్కుంటుంది. నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదని.. ప్రేమించినట్లు నటించావ్ అని, కానీ.. నేను నిజంగానే ప్రేమించాను అని చెబుతుంది. ఎమోషనల్ గా మాట్లాడి... ఐలవ్ యూ చెప్పి, చేతిలో గిఫ్ట్ పెడుతుంది.

Brahmamudi


ఆఫీసులో  క్లైంట్ వచ్చారు అని చెప్పడానికి కావ్య వస్తే రాజ్ వినిపించుకోడు. ఈ లోగా శ్రుతి వచ్చి క్లైంట్ వచ్చారు అని చెబుతుంది. ఆయనకు డిజైన్స్ నచ్చలేదని రాజ్ అనుకుంటాడు. కానీ.. వాళ్లు ఆ డిజైన్స్ తమకు బాగా నచ్చాయని చెబుతారు. వాళ్లు వెళ్లిన తర్వాత డిజైన్స్ ని పంపమని రాజ్ అడిగితే.. కావ్య పంపను అంటుంది. నా డిజైన్స్ మీకు నచ్చవు కదా అని సెటైర్లు వేస్తుంది. అయితే... డిజైన్లు పంపకపోతే శ్రుతి ఉద్యోగం తీసేస్తాను అని  రాజ్ అనడంతో.. కావ్య వెంటనే పంపిస్తాను అని శ్రుతికి చెబుతుంది.

Brahmamudi

ఇక ఆఫీసులో కళ్యాణ్ కవిత రాసుకుంటూ ఉంటే.. ఆఫీసులో వాళ్లు వచ్చి.. ఏ కవిత రాస్తున్నారు సర్ అని అడుగుతారు. తన భార్య అనామిక కోసం అని చెబుతాడు. వాళ్లంతా ఆ కవిత్వం వినిపించమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. కావ్య, రాజ్ కూడా వచ్చి ఆ కవిత వినిపించమని అడుగుతారు. అప్పుడే అనామిక లంచ్ తో ఎంట్రీ ఇస్తుంది. ఈ సామ్రాజ్యం మొత్తం దక్కించుకోవాలని అనుకుంటూ లోపలికి వస్తుంంది.

Brahmamudi

కళ్యాణ్ కవితలకు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అనామిక ఏమో.. తనకు అసలు అపాయింట్మెంట్ దొరుకుతుందో  లేదో అనుకుంటూ వచ్చి చూసేసరికి కవితలు చెబుతూ కనపడతాడు. అంతే... కళ్యాణ్ అని సీరియస్ అవుతుంది.  అందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా.. ఇక్కడికి వచ్చి బిజినెస్ చూసుకోకుండా, ఈ పిచ్చి రాతలు రాసుకుంటూ కూర్చున్నావా అని తిడుతుంది. కట్టుకున్న భార్యను మోసం చేస్తావా అని తిడుతుంది. ఇంటికి వెళ్లాక మాట్లడుకుందాం అని కళ్యాణ్  చెప్పినా వినకుండా.. నన్ను మోసం చేస్తావా? నువ్వు బిజినెస్ లో రాణించాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వు ఇలా చేస్తావా అని సీరియస్ అవుతుంది. మధ్యలో కావ్య నచ్చచెప్పాలని చూస్తే.. అది తమ భార్యభర్తల సమస్య అని చెప్పి నోరుమూయిస్తుంది. కళ్యాణ్ కూడా.. తాను ఏమీ మోసం  చేయలేదని నచ్చచెప్పాలని చూస్తాడు కానీ  అనామిక వినిపించుకోదు. అనామిక ప్రవర్తనకు రాజ్, అక్కడ ఉన్నవారంతా షాకతారు. మగవాడు అన్నాక పనిచేసుకుంటూ బతకాలని డైలాగులు కొడుతూ ఉంటుంది. 

Brahmamudi

ఆ మాటలకు రాజ్ కి కోపం వచ్చి.. చాలు అని అరుస్తాడు. ఏదైనా ఉంటే.. నాలుగు గోడల మధ్య బెడ్రూమ్ లో మాట్లాడుకోమని, ఇది ఆఫీస్ అని ఇక్కడ మాట్లాడకూడదు అని చెబతాడు. కవితలు రాసినా, కవిత్వాలు రాసినా నీ భర్త ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో  ఉన్నాడని, అది గుర్తుపెట్టుకోని మాట్లాడమని అంటాడు. ఇంటికి వచ్చాక నీ సంగతి చూస్తాను అని మనసులో అనుకొని అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక రాత్రి కళ్యాణ్ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని అనామిక ఎదురుచూస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి వచ్చి కోపంగా ఉన్నావ్.. ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. అందరూ వచ్చాక చెబుతాను అని అనామిక అంటుంది. ఇంట్లో అందరూ  హాల్ లోకి వస్తారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక అనామిక రచ్చ రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

Latest Videos

click me!