BrahmaMudi 25th March Episode: బిడ్డకు పాలు ఎలా కాయాలో తెలియక ఇబ్బంది పడుతుంటే.. కావ్య.. ఆ పాలు తాను కాచి తెస్తాను అని.. లోపలికి వెళ్లమని చెబుతుంది. రాజ్ వెళ్లిపోతాడు. కావ్య.. పాల సీసా పట్టుకొని లోపలికి వెళ్తుంటే.. ధాన్యలక్ష్మి, అనామిక సెటైర్లు వేస్తారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని కావ్య అంటుంది. కానీ.. తనకు సమాధానం చెప్పాల్సిందే అని.. అపర్ణ పట్టుపడుతుంది. తన మాట అంటే లెక్కలేదా అని నిలదీస్తుంది.