Guppedantha Manasu 25th March Episode:వసుధార కాలేజీకి వెళ్లిన తర్వాత మహేంద్ర... అనుపమతో మాట్లాడతాడు. ఇంతకాలం మాకు మను నీ కొడుకనే విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఎంత క్లోజ్ అయినా కొన్ని విషయాలు చెప్పలేం మహేంద్ర అని అనుపమ అంటుంది. నీకు, మనుకి మధ్య గొడవేంటి అని అడుగుతాడు. దానికి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అని అనపమ అంటుంది. ఇక. ఏకంగా మహేంద్ర.. మను తండ్రి ఎవరు..? అతను ఏం చేస్తూ ఉంటాడు..? జగతి డెలివరీ తర్వాత.. నువ్వు కనిపించకుండా వెళ్లిపోయావ్..? ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా.. అనుపమ సమాధానం చెప్పడానికి ఇష్టపడదు. అప్పుడే ఏంజెల్ ఎంట్రీ ఇస్తుంది.