అందులో నుంచి మను కోపంగా బయటకు వస్తాడు. వచ్చీ రావడమే తుపాకీ బయటకు తీసి.. మా అమ్మ మీద ఎటాక్ చేయించింది ఎవరు అని అడుగుతాడు. మీ అమ్మ ఎవరు బ్రదర్ అని రాజీవ్ ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడతాడు. అప్పుడు శైలేంద్ర... అనుపమగారు వాళ్ల అమ్మని, ఆమె పై ఎటాక్ జరిగిందని చెబుతాడు. ఆ విషయం నిజంగా నాకు తెలీదు అని రాజీవ్ చాలా అమమాయకంగా నటిస్తాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారిపై ఎటాక్ జరిగిన తర్వాతే.. ఆవిడ మీ అమ్మ అని తెలిసిందని చెబుతాడు.