అప్పుడే బాబు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపులు కింద దాకా వినిపిస్తూనే ఉంటాయి. దీంతో.. రాజ్ కి బాబు ని హ్యాండిల్ చేయడం రావడం లేదని.. నువ్వు వెళ్లి సహాయం చేయమని అపర్ణకు కాలేలా రుద్రాణి మాట్లాడుతుంది. అపర్ణకు కోపం వచ్చేలా.. రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఒకరి తర్వాత ఒకరు అంటూనే ఉంటారు. ఆ మాటలతో అపర్ణకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపం మొత్తాన్ని రాజ్ మీద చూపిస్తుంది.
రాజ్ బిడ్డను ఎత్తుకొని కిందకు రావడంతో.. రాజ్ పై అపర్ణ ఇంత ఎత్తు ఎగరుతుంది. ఆ బిడ్డను తల్లి దగ్గరే వదిలేసి రమ్మని అంటుంది. అయితే... బాబుని తండ్రి లేని బిడ్డను చేయలేను అని రాజ్ తేల్చి చెబుతాడు. అయితే.. ఇక నుంచి.. నువ్వు , నీ కొడుకు ఇద్దరూ ఈ ఇంటి వారసులు కారని.. ఎలాంటి సంబంధం ఉండదు అని తేల్చి చెబుతుంది. మరి.. అపర్ణ నిర్ణయాన్ని రాజ్ ఎలా తీసుకుంటాడు..అసలు ఆ బాబు ఎవరు..? కావ్య అసలు నిజం ఎలా బయటపెడుతోందనే విషయం ఆసక్తిగా మారింది.