
BrahmaMudi 23rd February Episode: కావ్య ఆఫీసులో బావను పరిచయం చేసి రాజ్ లో టెన్షన్ పెంచుతుంది. అక్కడితో సరిపోదని.. ఏకంగా ఇంటికే తెచ్చి పెడుతుంది. అది చూసి రాజ్ కి మండిపోతూ ఉంటుంది. తనకు సవతిలా దాపరించాడు అని రాజ్ కి మండిపోతూ ఉంటుంది. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఇంట్లో అందరూ కావ్య బావను ఇంట్లోనే ఉండమని చెబుతారు. ఇక రాత్రిపూట కావ్య, ఆమె బావ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే.. రాజ్ చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. సరదాగా మాట్లాడుకుంటున్నామని సోదిలాగా సాగదీసి మరీ చెబుతారు. రాజ్ తలనొప్పి గా ఉందని కనీసం టీ అడిగినా..ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవచ్చు కదా అని అంటుంది. టీ మాత్రం ఇవ్వదు. వాళ్ల బావతో ఆయన ఆఫీసుకు వెళ్లిన తర్వాత...మనం మాట్లాడుకుందాం అని అంటుంది. అది చూసి రాజ్ కి మరింత చిరాకు తెచ్చుకుంటాడు.
మరుసటిరోజు తెల్లారిన తర్వాత అప్పూ జాగింగ్ చేసి అలసిపోయి వచ్చి కూర్చుంటుంది. ఒకరోజు అప్పూ కాపాడిన అంకుల్ వచ్చి.. అప్పుడే అలసిపోతే పోలీసు అవ్వలేవు అని చెబుతాడు. మీకు ఎలా తెలుసు అని అప్పూ అడిగితే..తాను రిటైర్డ్ పోలీసు అని చెబుతాడు. అప్పూ నమ్మదు. అప్పుడే ఓ కానిస్టేబుల్ వచ్చి ఆయనకు సెల్యూట్ చేయడంతో అప్పూకి నిజం తెలిసి నమ్ముతుంది. ఆయనను అప్పూ ట్రైనింగ్ ఇవ్వమని అడుగుతుంది. ఆయన అందుకు ఒప్పుకుంటాడు. ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిందని, అప్లై చేయమని చెబుతాడు. తర్వాత.. ట్రైనింగ్ లో భాగంగా మరోసారి అప్పూతో రన్నింగ్ చేపిస్తాడు.
ఇక.. ఇంట్లో రాజ్.. కళావతి తనకు కాఫీ ఇవ్వలేదని చూస్తూ ఉంటాడు. కావ్య ఏమో.. తన బావకు ప్రోటీన్ షేక్ ఇస్తున్నాను అని చెబుతుంది. బావకు ఇచ్చిన తర్వాత.. మీకు బ్లాక్ కాఫీ ఇస్తాను అని చెబుతుంది నాకన్నా.. నీకు బావ ఎక్కువ అని అడిగితే.. తనకు తన బావకు మధుర జ్నాపకాలు చాలా ఉన్నాయని, మన మధ్య గొడవలు తప్ప ఏమీ లేవు కదా.. తన బావకే ఇస్తాను అని చెబుతుంది. అతిథి దేవో భవ అని మన పెద్దలు చెప్పారు కదా అని కావ్య అంటే.. పతియే ప్రత్యక్ష దైవం అని కూడా చెప్పారు అన రాజ్ గుర్తు చేస్తాడు. కానీ.. పతి పోస్ట్ పర్మినెంట్ కాదు కదా అని కావ్య అంటే.. కాఫీ కోసం భార్య పోస్టు పర్మినెంట్ చేయలేను.. మీ బావకే ఇచ్చుకో పో అంటాడు. కావ్య కూడా వెళ్లిపోతుంది.
గార్డెన్ లో కూర్చున్న అనామికకు వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. ఇంటి పెత్తనం నీ చేతికి వచ్చిందా అని అనామిక ని వాళ్ల అమ్మ అడుగుతుంది. లేదని.. కావ్య చేతికి వెళ్లిపోయిందని అనామిక చెబుతుంది. మీ డాడీ బిజినెస్ లో ఫెయిల్ అయినట్లు.. నువ్వు అత్తారింట్లో ఫెయిల్ అవుతావని అనుకోలేదని వాళ్ల మమ్మీ అంటుంది. ఇంకో ప్లాన్ ఉందని అనామిక అంటుంది. ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పించానని.. ఫస్ట్ నైట్ జరగాలంటే తాను చెప్పినట్లు చేయాలని ముడి పెట్టానని.. దీంతో కళ్యాణ్ చచ్చినట్లు ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పుకున్నాడని అనామిక వాళ్ల అమ్మకు చెబుతూ ఉంటుంది. ఆ మాటలను రుద్రాణి దూరం నుంచి వినేస్తుంది. అనామిక ప్లాన్ మొత్తం వినేసి.. తనలాగానే కంత్రీ అని అర్థమౌతుంది.
ఇక.. అనామిక మాత్రం.. ఆఫీసులో రాజ్ ని తప్పించి, కళ్యాణ్ కి మొత్తం అధికారం వచ్చేలా చేస్తానని... అప్పుడు కళ్యాణ్ కింగ్ అవుతాడని, తాను క్వీన్ అవుతానని.. అప్పుడ కంపెనీ మాత్రమే కాదు.. ఈ ఇల్లు మొత్తంతన కంట్రోల్ లో ఉంటుంది అని చెబుతూ ఉంటుంది. అనామిక ప్లాన్ అదిరిపోయిందని.. అది జరిగేలా తాను చేస్తానని.. రాజ్ ని తప్పించే వరకు సపోర్ట్ చేసి.. కవిగాడికి పట్టా కట్టే సమయంలో కళ్యాణ్ ని తప్పించి.. ఆ స్థానంలో తన కొడుకును కూర్చోపెడతాను అని, అప్పుడు తన కొడుకు కింగ్ అవుతాడని, తాను కింగ్ మేకర్ అవుతాను అని రుద్రాణి అనుకుంటుంది.
తర్వాత రాజ్ తన బ్లాక్ కాఫీ ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ లోగా కావ్య తీసుకువస్తుంది.. కాఫీ మరే పెట్టుకున్నారా అని కావ్య అడుగుతుంది. వాళ్ల అమ్మ పెట్టించిందని రాజ్ చెబుతాడు. దానికి కావ్య.. నేను వెళ్లిపోయాక మీ పనులు ఆవిడే చెయ్యాలి కదా అని కావ్య అంటుంది. రాజ్ మాత్రం.. నీ స్థానంలో నువ్వు వెళ్లిపోయాక వేరే అమ్మాయి వస్తుంది అని రాజ్ అంటాడు. అయితే... ఈ మంచి విషయం అందరికీ చెప్పమని అందరినీ కావ్య పిలుస్తుంటే.. రాజ్ నోరు మూస్తాడు. కాసేపు ఇద్దరూ ఇదే విషయం గురించి వాదించుకుంటూ ఉంటారు. రాజ్ నేను ప్రశాంతంగా వ్యాయామం చేసుకోవాలంటే. ఆ ప్రశాంతత నీకు దక్కనివ్వను గా అని కావ్య అనుకుంటుంది.
బయటకు వెళ్లగానే.. ఇందిరాదేవికి కావ్య బావ ఏదో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అది చూసి కావ్య పొగిడేస్తుంది. కావ్య విడాకుల విషయం తెస్తుంది. అందరికీ వినేలా ఎందుకు అరుస్తున్నావ్ ఏంటి..? ఎవరు విన్నా వినకపోయినా మా బావ వింటే... తనను పెళ్లి చేసుకుంటాడు అని చెబుతుంది. అది విని రాజ్ షాకౌతాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని రాజ్ అంటాడు. ఎవరికీ చెప్పకపోయినా మా బావకి చెబుతాను అని కావ్య అంటే.. వద్దు అని రాజ్ కంగారుపడతాడు.
ఇక.. ఇందిరాదేవికి స్పాండిలైటిస్ ఉందని కావ్య బావ ట్రీట్మెంట్ చేస్తుంటే.. రాజ్ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాడు. కానీ రాజ్ ట్రీట్మెంట్ కి ఇందిరాదేవికి నొప్పి వస్తుంది. ఈలోగా బావ రాజ్ ని వృశ్చికాసనం వేయమని అడుగుతాడు. రాజ్ అది చేయలేను కాఫీ తాగాను అంటాడు. ఏది చెప్పినా ఏవేవో సాకులు చెబుతాడు. తర్వాత పద్మాసనం వేస్తానని చెప్పి.. రాజ్ బిగుసుకుపోతాడు. ఇక కావ్య బావ ఫోటోలు తీస్తూ ఉంటాడు. సీన్ ఫన్నీగా ఉంటుంది. రాజ్ ఫోన్ వచ్చినట్లు తప్పించుకొని పారిపోతాడు. అందరూ నవ్వుకుంటారు.
కావ్య మాత్రం రాజ్ చాలా ఇబ్బందిపడుతున్నాడని ఫీలౌతుంది. అయితే.. మీ బావకన్నా తానేమీ తక్కువ కాదని నీ ముందు నిరూపించుకోవాలని తాపత్రయడపుతున్నాడని.. ప్రేమ బయటపడుతుంది లే అని ఇందిరాదేవి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వాలంటైన్స్ డే ప్రోగ్రాం పెట్టి మరింత ఏడిపించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ఆ సంగతి రేపు చూద్దాం..