అంతే.. తన కొడుకుని అన్ని మాటలు అంటావా అని మధ్యలో ధాన్యలక్ష్మి రచ్చ మొదలుపెడుతుంది. అపర్ణ అక్క ఆమెదో రాజమాతలాగా అందరినీ శాసిస్తోంది అని అంటుంది. వెంటనే అనామిక కూడా.. పెద్ద అత్తయ్యకు మనం అలానే కనపడతాం కదా అత్తయ్య అంటుంది. మధ్యలో ఇందిరాదేవి దూరి... ఇప్పుడు ఏం జరిగిందని అంత రాద్దాంతం చేస్తున్నారు.. అవమానం ఏముంది ఇక్కడ అని సీరియస్ అవుతుంది. పనిలో పనిగా.. ధాన్యలక్ష్మి,అనామిక, రుద్రాణిలను కలిపే తిడుతుంది. మీరు పక్షపాతం చూపిస్తున్నారని.. ప్రతి విషయంలోనూ అక్క నా కొడుకుని, మీ కొడుకును తిడుతోందని మొన్న ఆయన ఏదో మర్చిపోయారని తిట్టింది.. ఈ రోజు వాడు తొక్కలో కేక్ పడేశాడు అని తిట్టింది అని అంటుంది.