BrahmaMudi 1st February Episode:నువ్వు నాకు వద్దు తెగించేసిన రాజ్, అత్త దెబ్బకు అనామికకు చుక్కలు..!

First Published Feb 1, 2024, 11:00 AM IST

 నా కోడలి మీద ఎందుకు అరుస్తున్నావ్ అని అడుగుతుంది. వంట నేర్పించమని అడిగితే నా కోడలిమీద అరుస్తావా అంటూ రచ్చ చేయడం మొదలుపెడుతుంది.  ఒక్కరోజు ఆఫీసుకు వెళితేనే అంత అహం పెరిగిపోయిందా అని నానా మాటలు అంటుంది.

Brahmamudi


BrahmaMudi 1st February Episode: శ్వేత భర్త వచ్చి తన శాడిజం చూపించిన విషయం తెలిసిందే. దీంతో.. శ్వేత భర్త అరవింద్ ని రాజ్ కొట్టి తరిమేస్తాడు. తర్వాత శ్వేతను దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు. నీకు నేనున్నాను అని రాజ్ చెప్పడం.. శ్వేతను ఓదార్చడం కావ్య కళ్లారా చూస్తుంది. ఆ మాటలకు కావ్య గుండె పగిలిపోతుంది. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. వెనక బ్యాగ్రౌండ్ లో ఓ సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఏడ్చుకుంటూ కారులో ఇంటికి వెళ్లిపోతుంది.

Brahmamudi


 ఇంట్లో అనామిక అటూ, ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే కావ్య వస్తుంది. వెంటనే అనామిక వెళ్లి.. మీరు పులావ్ బాగా చేస్తారని కళ్యాణ్ చెప్పాడని , నువ్వు చేసి చూపించు.. నేను నేర్చుకుంటాను అని అడుగుతుంది. కానీ.. కావ్య అసలు పట్టించుకోదు. కావ్య పరద్యానంగా వెళ్తుంటే.. అనామిక పిలుస్తూనే ఉంటుంది. సమాధానం కూడా చెప్పకుండా వెళ్తున్నావేంటి.. నువ్వు నాకు ఇప్పుడే నేర్పించాలి అని పట్టుపడుతుంది. నాకు ఇప్పుడు ఓపిక లేదు అనామిక.. ఈ పూటకు నువ్వే ఏదో ఒకటి చేసి పెట్టు అని కావ్య చెబుతుంది. కానీ అనామిక వినిపించుకోదు.

Latest Videos


Brahmamudi

కళ్యాన్ నీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాడు.. నువ్వు ఈ సహాయం కూడా చెయ్యలేవా.. అరగంటే కదా అని అంటుంది.  అయితే.. తనకు వంట చేసే మూడ్ లేదని, అలసిపోయాను అని.. అందరికీ నేను ఒక వంటలక్క అయిపోయాను అని అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది. అయితే ధాన్యలక్ష్మి కోపంగా ఆగు అని అరుస్తుంది. ఇది కదా నాకు కావాల్సింది అని అనామిక సంబరపడిపోతుంది. ధాన్యం వచ్చి.. నా కోడలి మీద ఎందుకు అరుస్తున్నావ్ అని అడుగుతుంది. వంట నేర్పించమని అడిగితే నా కోడలిమీద అరుస్తావా అంటూ రచ్చ చేయడం మొదలుపెడుతుంది.  ఒక్కరోజు ఆఫీసుకు వెళితేనే అంత అహం పెరిగిపోయిందా అని నానా మాటలు అంటుంది.

Brahmamudi

దూరం నుంచి ఇదంతా అపర్ణ  చూస్తూనే ఉంటుంది. కానీ.. కావ్య కూడా ఫ్రస్టేట్ అవుతుంది.  అత్తారింట్లో కావ్య ఇంతలా నోరు తెరవడం ఇదే మొదటిసారి  ‘నాకు ఓపిక లేదు అని చెప్పాను. నేను మీకు వండి వార్చడానికే పుట్టానా..? పుట్టింటి గురించి మాట్లాడతారేంటి? నువ్వు ఎంత నీ లెక్కంత అంటున్నారేంటి? నా బతుక్కి నాకు అహంకారం ఒక్కటే తక్కువ. నేను మీకు పని మనిషిలా కనపడుతున్నానా? అలా అరుస్తారేంటి?’ అని కావ్య అంటుంది. ఎంత ధైర్యం నీకు అని ధాన్యం అడిగితే.. నీకెంత ధైర్యం అని అపర్ణ ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi

‘ నా కోడలు మీద అరవడానికి నీకు ఏం హక్కు ఉంది? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. ఆఫీసుకు వెళ్లి వచ్చింది కాబట్టి అలసిపోయి ఉండొచ్చు. పని చేసి వచ్చింది కాబట్టి.. ఓపిక లేకపోవచ్చు. వంట రాని కోడలిని ఎంచుకోవడం నీది తప్పు. కళ్యాణ్ కి ఏదైనా కావాలంటే నిన్ను అడగమను..లేదంటే వాడి పెళ్లాన్ని అడగమను. ఇంకోటి.. కావ్య ఆఫీసుకు వెళితే.. మీ కోడలే ఇంట్లో వంట చేయాలి’ అని తేల్చి చెబుతుంది. ఏదో పెంట చేద్దాం అని అనామిక అనుకుంటే..అది తనకే రివర్స్ కావడంతో అనామికకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. కావ్యను వెళ్లి రెస్ట్ తీసుకోమని అపర్ణ చెబుతుంది.

Brahmamudi


ఇక.. తన గదిలోకి వెళ్లిన కనీసం లైట్ కూడా వేసుకోకుండా..కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ వెళ్లి లైట్ వేస్తాడు. కావ్య ఏడుస్తూనే ఉంటుంది.ఏధో జరిగిందని కళ్యాణ్ కి అర్థమౌతుంది. అదే విషయం కావ్యను అడుగుతాడు. ఏమైందో చెప్పండి వదిన.. మీ బాధ తీరకపోయినా.. కనీసం నాకు ఉన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందో చెప్పండి అని అడుగుతాడు. ఇక.. కావ్య చెబుతుంది. అది విని కళ్యాణ్ షాకౌతాడు. అన్నయ్య ఇలా మారిపోయాడా.. మీరు ఉండగా.. ఆ శ్వేతను జీవితంలోకి ఎలా రానిస్తాడు అని అంటాడు. మీరు తప్ప ఇంకెవరు చెప్పినా నమ్మేవాడిని కాదు అని అంటాడు.  ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు.. నిలదీయమని చెబుతాడు. ఏమీ అనకుండా మీరు ఊరుకోకూడదని, తాళి కట్టించుకున్నందుకు ప్రశ్నించే అధికారం మీకు ఉందని.. ఇంటికి రాగానే నిలదీయనమి అడుగుతాడు. ఎలా అడిగితే అన్నయ్య నిజం చెబుతాడో ఆలోచించుకో అని సలహా ఇస్తాడు.

Brahmamudi


ఇక రాజ్ ఇంటికి వస్తాడు.. లోపలికి రాగానే  కళ్యాణ్ ఎదురౌతాడు. రాజ్ అడిగిన ప్రశ్నలకు తిన్నగా సమాధానం చెప్పడు. ఇలా మాట్లాడాడు ఏంటి అనుకొని తన గదిలోకి వెళతాడు. కావ్య సీరియస్ గా చూస్తుంది. ఏమైంది...? కింద కళ్యాణ్ కూడా సీరియస్ గా చూస్తున్నాడు.. ఇక్కడ నువ్వు కూడా కాల్చేసేలా చూస్తున్నావ్ అని అంటాడు. నేను కూడా అంత సీరియస్ గా చూడాల్సింది.. మా అమ్మని అడిగి మరీ ఆఫీసులో ఉద్యోగం సంపాదించి.. మధ్యలోనే ఇంటికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు.

కావ్య లేచి.. బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తుంది.  నేను ఆఫీసు నుంచి ఇంటికే వచ్చాను అని.. మీరు ఎక్కడి వెళ్లారు, ఎవరిని కలవడానికి వెళ్లారు అని అడుగుతుంది. మగవాడు అన్నాక.. సవా లక్ష పనులు ఉంటాయని.. ఇప్పుడేంటి అని అంటాడు. ఈ రోజు మీరు వెళ్లిన పని ఏంటి అని అడుగుతుంది. అయితే.. రాజ్.. సలు ఏంటి నీ ఉధ్దేశం ఏంటి అని రాజ్ అడిగితే... నేను మీ భార్యను.. రహస్యంగా కలుసుకునే శ్వేతను కాదు అని అంటుంది.

Brahmamudi

ఆ మాట విని మొదట రాజ్ షాకౌతాడు. తర్వాత.. అంటే ఏంటి..? నన్ను ఫాలో అవుతున్నావా? నన్ను అనుమానిస్తున్నావా, నా మీద నిఘా పెడుతున్నావా? నా వెనకే తిరుగుతున్నావా అని అడుగుతాడు. నేను నా మొగుడి వెనక తిరిగితే తప్పేంటి..? ఆ అమ్మాయితో మీకు సంబంధం ఏంటి అని కావ్య నిలదీస్తుంది. దానికి రాజ్.. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు. అయితే.. కావ్య తాను మీరు తాళి కట్టిన భార్య అని.. మీరు నాకు సమాధానం చెప్పాల్సిందే అని పట్టుపడుతుంది.

రాజ్ మాత్రం.. నేను నిన్ను ఎప్పుడూ భార్యలా చూడలేదు అని అంటాడు. కానీ.. తాను మాత్రం మిమ్మల్ని భర్తగానే చూశాను అంటుంది. మన మధ్య సంబంధం లేదు అని రాజ్ అంటే.. ఆ మాట మీరు కాదని.. పసుపుతాడు, బ్రహ్మముడి చెప్పాలని.. వీటన్నింటి సాక్షిగా మన పెళ్లి జరిగింది అని కావ్య గట్టిగా నే సమాధానం చెబుతుంది.  కానీ... రాజ్ చిరాకుపడతాడు.. నేను ఏరోజూ నిన్ను భార్యలాగా చూడకపోయినా భార్యలాగా బెదిరిస్తున్నావేంటి అని అడుగుతాడు. దానికి కావ్య.. మీరు నన్ను మనిషిలా  కూడా చూడలేదు. కదా అయినా మనిషిలా అర్థం చేసుకున్నాను అని కావ్య బదులిస్తుంది.
 

Brahmamudi

దానికి రాజ్.. ఏదో ఒక రోజు మనం విడిపోవాల్సిన వాళ్లమే అది గుర్తుపెట్టుకో అని అంటాడు. ఆ మాటకు కావ్య షాకౌతుంది. తర్వాత..ఎందుకు విడిపోవాలి..? భార్యగా మీకు సేవలు చేయడంలేదా? కోడలిగా బాధ్యతలు చేయడం లేదా..? ఎందుకు మీ జీవితంలో ఉండకూడదు నాకు సమాధానం చెప్పాల్సిందే అని పట్టుపడుతుంది. నీ తప్పు ఏమీ లేదని.. కానీ నాకు మాత్రం నువ్వు వద్దు అని చెబుతాడు.

దానికి కావ్య.. ఎందుకు అని అడుగుతుంది. ఇష్టం లేదు అనడానికి  కారణాలు ఉండవు అంటాడు.. కానీ కావ్య ఒప్పుకోదు.. నన్ను మించిన అందగెత్త మీకు కనపడిందా? వేరే ఆడదాని మీద మోజు పెరిగిందా? లోపం మీ దగ్గర పెట్టుకొని నన్ను బలి చేస్తున్నారా?  .ఇష్టపడటానికి కారణాలు అవసరం లేదని.. ఇష్టపడకపోవడానికి మాత్రం కారణాలు చెప్పాల్సిందే..ఎందుకు మీకు వద్దు? ఏనాడు నన్ను మీ భార్యగా వద్దు అనుకుంటన్నారు..? ఏ రోజూ నన్ను తాకనూ లేదు. ఏ ముద్దూ ముచ్చటలేకుండా నిస్సారంగా బతుకుతన్నాను. మీతో సర్దుకుపోతున్నాను.. అయినా మీకు ఎందుకు వద్దు.. అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగప్ లో...  రాజ్ తాను నువ్వు నాకు వద్దు అనడానికి కారణాలు రాస్తాను అని వైట్ బోర్డు దగ్గరకు వెళతాడు. కానీ.. రాజ్ కి  ఎలాంటి కారణం దొరకకపోవచ్చు. చూడాలి మరి.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో...?
 

click me!