BrahmaMudi 18th march Episode:పెళ్లి రోజు వేడుకలు.. కీలకంగా రాజ్ నిర్ణయం, భయంలో అనామిక..!

Published : Mar 18, 2024, 02:53 PM IST

మా అక్క నా మీద పంతంతో కావ్యకు కోడలుగా అంగీకరించింది కానీ.. ఇప్పటికీ కావ్య అంటే ఇష్టం లేదు అని అంటుంది.

PREV
18
BrahmaMudi 18th march Episode:పెళ్లి రోజు వేడుకలు.. కీలకంగా రాజ్ నిర్ణయం, భయంలో అనామిక..!
Brahmamudi

BrahmaMudi 18th march Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ హాయిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య మాత్రం.. రాజ్ ఇంటికి వచ్చి ఏం చెబుతాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. విడాకుల విషయం గురించి  భయపడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ ఇంటికి వస్తాడు. రాజ్ ఇంటికి రాగానే.. ఇందిరాదేవి మొదలుపెడుతుంది.  చాలా సేపు సస్పెండ్ లో పెట్టి.. తర్వాత రాజ్, కావ్యల పెళ్లి గురించి మాట్లాడుతుంది. వాళ్ల పెళ్లి జరిగి.. రేపటికి ఏడాది అవుతుందని.. గ్రాండ్ గా  సెలబ్రేట్ చేయాలని  అంటుంది.

28
Brahmamudi

ఇంట్లో అందరూ ఆ మాట విని సంతోషిస్తారు. కానీ.. అపర్ణ మాత్రం మనసులో కావ్యను తిట్టుకుంటుంది. నాకు ఇష్టం లేని వ్యక్తిని సంవత్సరం నుంచి భరిస్తున్నానా, ఇప్పుడు మళ్లీ ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ కూడానా అని అనుకుంటుంది. వెంటనే అపర్ణ మనసులో మాటను  ధాన్యలక్ష్మి బయటపెడుతుంది. మా అక్క నా మీద పంతంతో కావ్యకు కోడలుగా అంగీకరించింది కానీ.. ఇప్పటికీ కావ్య అంటే ఇష్టం లేదు అని అంటుంది.

38
Brahmamudi

తన మనసులో చెప్పిన మాటే ధాన్యం బయటపెట్టినా కూడా.. ఆమె అలా చెప్పడం  అపర్ణకు నచ్చదు. నేను నీకు చెప్పానా..? నాకు ఇష్టం లేకపోతే.. ఇన్ని రోజులు కావ్య ఇంట్లో ఉంటుందా అని అంటుంది.  ఇదే విషయంలో చాలా సేపు డిస్కస్ చేస్తారు. తర్వాత.. రాజ్ మాట్లాడతాడు. మీకు నచ్చినట్లు ఏర్పాట్లు చేసుకోమంటాడు. కానీ... అందరికీ రేపు తాను ఒక విషయం చెబుతాను అంటాడు.

48
Brahmamudi


రేపటి దాకా ఎందుకు.. ఇప్పుడే చెప్పమని ఇందిరాదేవి అంటుంది.  రుద్రాణి కూడా సేమ్  అదే అంటుంది. ఇప్పుడే చెప్పమని అడుగుతారు. కానీ రేపు... కళావతి వాళ్ల పేరెంట్స్ కూడా వస్తారు కదా.. అప్పుడు వాళ్ల ముందే చెబుతానని.. అది తన జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు.

58
Brahmamudi

ఇక రాజ్ ఏం చెబుతాడా అని కావ్య తో పాటు.. ఇందిరాదేవి కూడా టెన్షన్ పడుతుంది. ఇక కావ్య బెడ్రూమ్ కి వెళ్లేసరికి  రాజ్ పడుకుంటాడు.  నెమలి ఈకతో లేపడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి అని రాజ్ విసుక్కుంటాడు. ఉదయం విడాకుల గురించి అడిగాను కదా.. ఇంకా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. రేపు అందరితోపాటే నీకు కూడా చెబుతాను అంటాడు. చేసేది లేక.. ఇక కావ్యకూడా పడుకుంటుంది.

68
Brahmamudi

మరుసటి రోజు  ఉదయాన్నే కావ్య వంటగదిలో టెన్షన్ ఫడుతూ ఉంటుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి కావ్యను తిడుతుంది. రాత్రి రాజ్ ని ఏమైనా అడిగావా అంటుంది. అడిగాను అని.. కానీ చెప్పలేదని అంటుంది. భర్తను ఎలా డీల్ చేయాలో తెలీదని,  మొగుడిని కొంగుకు ఎలా కట్టుకోవాలో తెలీదని అరుస్తుంది. రాజ్ సాయంత్రం ఎం చెబుతాడా అని భయం వేసిందని అంటుంది. కావ్య కూడా అదే చెబుతుంది. అయితే.. మీ ఇద్దరితో దాంపత్య వత్రం చేపిద్దాం అని, దాంట్లో రాజ్ కనుక ప్రమాణాలు చేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదని వాళ్లు అనుకకుంటారు.

78
Brahmamudi

ఇదే విషయం ఇంట్లో అందరికీ ఇందిరాదేవి చెబుతుంది. అయితే.. సాయంత్రం  పార్టీ ఉంది కదా.. మళ్లీ పూజ ఎందుకు అని అపర్ణ దేవి అంటుంది. ఆమె అలా ాఅనడం ఆలస్యం.. అపర్ణకి  కావ్య అంటే ఇష్టం లేదని ధాన్యలక్ష్మి మొదలుపెడుతుంది. నిజానికి అపర్ణ మనసులో అదే ఉంటుంది. కానీ... అందరూ అలా అనే సరికి.. తన కొడుకు సంబంధించిన ఏ విషయం అయినా తనకు ఇష్టమే అంటుంది. మరి కావ్యకు నగలు ఎందుకు ఇవ్వలేదు అని  ధాన్యం అడుగుతుంది. రుద్రాణి వంత పాడుతుంది.  

88
Brahmamudi

వాళ్ల నోళ్లు మూయించి, అపర్ణ పూజ నువ్వు ఆపుతున్నావా అని అడుగుతుంది. లేదు అత్తయ్య.. మీ ఇష్టం మీకు నచ్చినట్లు చేయమని చెబుతుంది. కమింగప్ లో.. ఈ వ్రతం జరగనుంది. మరి వ్రతంలో రాజ్ ప్రమాణం చేస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 

click me!

Recommended Stories