BrahmaMudi 17th February Episode:బావొస్తున్నాడని రాజ్ కి కావ్య సర్ ప్రైజ్, అనామిక మరో పంచాయతీ

First Published | Feb 17, 2024, 10:53 AM IST

నువ్వు చెప్పినట్లు చేశాను కదా అని కళ్యాన్ అంటే.. ఫ్లయ్యింగ్ కిస్ ఇచ్చి దానితో సరిపెట్టుకోమని చెబుతుంది. పాపం.. కళ్యాణ్ అలిగి పడుకుంటాడు. 

Brahmamudi

BrahmaMudi 17th February Episode:రాజ్ శ్వేతతో మాట్లాడుతుంటే కావ్య.. ప్రశాంతంగా మాట్లాడుకోమని చెబుతుంది. కావ్య రియాక్షన్ కి రాజ్ కి మతిపోతుంది. నిన్న జెలస్ ఫీలయ్యింది.. ఈరోజు ఏంటి ఇలా మారింది అనుకుంటాడు. ఇక పడుకునేది ప్రశాంతంగా పడుకోకుండా.. రేపు మీకు ఓ సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెబుతుంది. ఏంటా సర్ ప్రైజ్ అని రాజ్ అడిగితే.. చెబితే అది సర్ ప్రైజ్ ఎలా అవుతుంది అని కావ్య బదులిచ్చి పడుకొని నిద్రపోతుంది. ఇక ఆ సర్ ప్రైజ్ ఏంటా అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు.

Brahmamudi

మరోవైపు బెడ్రూమ్ లో అనామిక.. కళ్యాణ్ ని పిలవడంతో.. పాపం ఏదో అనుకొని ఆశపడతాడు. కానీ అవేమీ కాదని.. ఆఫీసులో నీకు అప్పగించిన పని ఏంటి..? అక్కడ ఏం చేశావ్ అని అడుగుతుంది. కానీ కళ్యాణ్ అక్కడ కూడా.. ఎంప్లాయిస్ అందరికీ  తన కవితలు రాసి వినిపిస్తూ ఉంటాడు. ఆ విషయమే గుర్తు చేసుకుంటాడు. ఆ విషయం చెబితే అనామిక ఏమంటుందో అని.. తాను చేయని పనులన్నీ చేశాను అని చెబుతాడు. అది విని అనామిక సంతోషపడుతుంది. తన వల్లే.. నీ టాలెంట్ అందిరికీ తెలిసిందనది.. రోజూ ఆఫీసుకు వెళ్లమని సలహా ఇస్తుంది. నువ్వు చెప్పినట్లు చేశాను కదా అని కళ్యాన్ అంటే.. ఫ్లయ్యింగ్ కిస్ ఇచ్చి దానితో సరిపెట్టుకోమని చెబుతుంది. పాపం.. కళ్యాణ్ అలిగి పడుకుంటాడు. అనామిక మాత్రం తాను అనుకున్నది సాధిస్తున్నాను అని సంబరపడిపోతూ ఉంటుంది.


Brahmamudi

ఆ సర్ ప్రైజ్ ఏంటా అని రాజ్ కి నిద్రపట్టదు. కావ్య మాత్రం హాయిగా పడుకుందని.. తనకు మాత్రం నిద్ర పట్టడం లేదని  తలబాదుకుంటాడు. అదేంటో తెలుసుకోవాలని నిద్రపోతున్న కావ్యను లేపుతాడు. ఉలిక్కిపడి నిద్రలేచిన కావ్య...  అప్పుడే పెళ్లి అయిపోయిందా అని ఓవర్ చేస్తుంది. రాజ్ మాత్రం సర్ ప్రైజ్ ఏంటో చెప్పమని అంటాడు. అయితే.. తనకు కలలో మీకు పెళ్లి అయ్యిందని చెబుతుంది. కానీ,. ఎంత అడిగినా సర్ ప్రైజ్ గురించి మాత్రం చెప్పను అని అంటుంది. ఇంకోసారి నిద్రలేపితే.. వెళ్లి హాల్ లో పడుకుంటాను అని బెదిరిస్తుంది. పాపం రాజ్ కి మాత్రం సర్ ప్రైజ్ ఎంతో తెలీక తిప్పలు పడుతూ ఉంటాడు.

Brahmamudi

తన బెడ్రూమ్ లో స్వప్న కూర్చొని ఉంటుంది. పనమ్మాయి జ్యూస్ తెచ్చి ఇస్తుంది. అయితే.. తనకు జ్యూస్ తన అత్తే ఇవ్వాలని స్వప్న అంటుంది. ఈ రోజు నుంచి మీ పనులు చూసుకోవడానికి నన్ను పెట్టుకున్నారు అని కొత్త పనమ్మాయి చెబుతుంది. అలాంటి నిర్ణయాలు ఏవైనాఉంటే తానే తీసుకోవాలని.. అత్త మీద యుద్ధానికి స్వప్న బయలుదేరుతుంది. రుద్రాణి మంచిగా పాటలు వింటూ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.  పిడుగులాగా స్వప్న ఊడిపుడుతుంది. నా పనులు పక్కన పెట్టి రిలాక్స్ అవుతున్నావా అత్త.. చెప్తా నీ సంగతి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. పాటలో మైమరచిపోయిన రుద్రాణితో స్వప్న డ్యాన్స్ కూడా చేయిస్తుంది. తర్వాత తేరుకొని స్వప్నను చూసి రుద్రాణి బయపడుతుంది.

రావడం రావడమే... తన బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడుతుంది. పని అమ్మాయికి నా కడుపు మీద అక్కరు ఉండదని,  మీరు అయితే. భయంతో ఒళ్లు జాగ్రత్త పెట్టుకొని చేస్తారని.. మీరే చేయాలి అని స్వప్న అంటుంది. అయితే.. నేను సేవలు చేయలేను అని రుద్రాణి అంటే.. పాపాల చిట్టా  స్వప్న విప్పేస్తుంది. రూ.2లక్షల గుట్టు ఇంట్లో వాళ్లకు చెప్పనా అని భయపెడుతుంది. మీకు పనులు కావాలంటే పనమ్మాయితో చేయించుకోమని.. నా పనులు మాత్రం మీరే చేయాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.  అయితే ఒక్కఛాన్స్ వస్తే.. నీకు అడ్రస్ లేకుండా చేస్తాను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.

Brahmamudi


తెల్లారిందాక.. రాజ్ ఆ సర్ ప్రైజ్ గురించే కలవరిస్తూ ఉంటాడు. లేచి చూస్తే పక్కన కావ్య ఉండదు. దీంతో.. తన కోసం కిచెన్ లోకి పరిగెడతాడు. రాత్రంతా సర్ ప్రైజ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదా అని కావ్య అడిగితే.. ఇప్పడైనా చెప్పు అని అడుగుతాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి కావ్యను రెడీ అవ్వమని చెబుతుంది

Brahmamudi

అయితే.. ఆ సర్ ప్రైజ్ ఏంటి అని రాజ్ అడుగుతాడు. కానీ.. తనకు కూడా తెలేదని జస్ట్ సర్ ప్రైజ్ అని మాత్రమే చెప్పిందని ఇందిరాదేవి అంటుంది. తలబాదుకుంటూ రాజ్ వెళ్లిపోతుంటే... కొద్ది గంటల్లో నీకు దిమ్మ తిరగడం ఖాయం అని ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది.

Brahmamudi

బెడ్రూమ్ లో కావ్య మంచిగా రెడీ అవవుతుంది. మళ్లీ అప్పలమ్మలా రెడీ అయ్యావేంటి అని రాజ్ అంటే.. తన కట్టుబట్టుకు ఫ్యాన్స్ ఉన్నారు అని కావ్య అంటుంది. తర్వాత.. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న విషయాన్ని చెబుతుంది. ఎందుకు అంటే.. సిగ్గుపడుతూ.. తన బావ అమెరికా నుంచి వస్తున్నాడని,  ఆరు ఎడుగుల ఎత్తు ఉంటాడని, ఎర్రగా, బుర్రగా ఉంటాడని, అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడని చెబుతుంది. అయితే.. అవన్నీ తనకు నాకెందుకు అని రాజ్ చిరాకుపడతాడు.

Brahmamudi

అయితే.. ఈ పరవశానికి కారణం ఉందని కావ్య అంటుంది. ఒకప్పుడు  మా బావ తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని.. కానీ దురదృష్ట వశాత్తు మీకు నీతో పెళ్లి అయిపోయిందని చెబుతుంది.  ఆ మాటకు రాజ్ కి కోపం వస్తుంది. అయితే.. ఆ మాట గతంలో మీరే చెప్పారు కదా అంటుంది. హింట్ మాత్రమే ఇచ్చి.. మా బావను కలవడానికి ఎయిర్ పోర్టుకు వెళ్తానని.. డైరెక్ట్ గా బావను ఆఫీసుకు తీసుకువస్తాను అని చెప్పి వెళ్తుంది.  పేరు ఏంటి అంటే..  బావ అని చెప్పి సిగ్గుపడి వెళ్లిపోతుంది. సర్ ప్రైజ్ అంటే ఇదా తొక్కలోది అని అనుకుంటాడు.

Brahmamudi

ఇక కళ్యాణ్ ఆఫీసుకు రెడీ అవుతాడు. కానీ.. ఆఫీసుకు వెళ్లొద్దని ఇద్దరం కలిసి  అని అనామిక సిగ్గుపడితే.. కళ్యాణ్ ఏదో ఊహించుకుంటాడు. కానీ అది కాదని షాపింగ్ కి వెళదాం అని అడుగుతుంది. అయితే.. క్రెడిట్ కార్డు తెస్తాను అంటాడు. ఎక్కడ ఉంది అంటే.. కావ్య ఒదిన దగ్గర అంటాడు. ఆ మాటకు అనామికకు పిచ్చి కోపం వస్తుంది. మీ దగ్గర డబ్బు లేదా అంటే.. అడిగిన వాళ్లందరికీ దానం ఇచ్చేవాడిని అని చెబుతాడు. క్రెడిట్ కార్డు మర్చిపోతూ ఉంటానని ఇంట్లో వాళ్లు అందరూ ఇలా చేశారు అని అంటాడు. ఇప్పుడు వెళ్లి కావ్యను అడుక్కుంటావా అని అనామిక కోపంగా అడుగుతుంది. వదిన అంటే అమ్మతో సమాబనం కదా  అని కళ్యాణ్ అంటే.. తనకు నామూషీగా ఉందని అంటుంది. కావ్యను అడిగితేనే వెళ్లాలి అంటే..త నకు షాపింగ్ అవసరం లేదని చెబుతుంది,

వెంటనే వెళ్లి అత్తగారితో పంచాయితీ పెడుతుంది. కావ్యకు ఉన్న అధికారాలు నాకు ఉన్నాయా లేవా అని అడుగుతుంది. నా భర్తతో షాపింగ్ కి వెళ్లాలన్నా కావ్య దగ్గర డబ్బులు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నాకు ఎందుకు అని ధాన్యలక్ష్మిని అడుగుతుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది.ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

ఇక కమింగప్ లో.. కారులో కావ్య తో పాటు ఆమె బావ కూడా దిగుతూ ఉంటాడు. ఎవరా అని చూడటానికి రాజ్ తిప్పలు పడుతూ ఉంటాడు. ఆ తంతు రేపటి ఎపిసోడ్ లో చూడాలి

Latest Videos

click me!