Brahmamudi
BrahmaMudi 12th February Episode:కావ్యను ఏడిపించాలని రాజ్.. శ్వేతతో బయటకు వెళతాడు. అయితే.... ఆ గోలలో పడి.. ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందనే విషయం మరచిపోతాడు. కావ్య ఫోన్ చేస్తూనే ఉంటుంది కానీ.. కావాలనే రాజ్ లిఫ్ట్ చేయడు. దీంతో.. లిఫ్ట్ చేయడం లేదని మామయ్య సుభాష్ కి చెబుతుంది. వాళ్లు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోగా... కావ్య కళ్యాణ్ ని పక్కకు పిలిచి అసలు విషయం చెబుతుంది. దీంతో.. ఈసారి కళ్యాన్ ఫోన్ చేస్తాడు. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మా తమ్ముడి ఫోన్ నుంచి కాల్ చేసింది.. ఇప్పుడు చెబుతా చూడు అనుకుంటూ.. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కావ్య అనుకొని రాజ్ ఏదేదో మాట్లాడుతుంటే..కళ్యాణ్ తానే మాట్లాడుతున్నాను అని.. ముద్రీ టీమ్ తో ఉన్న మీటింగ్ గురించి గుర్తు చేస్తాడు.
Brahmamudi
అది వినగానే రాజ్ కి భయం మొదలౌతుంది. మీటింగ్ 11కే చెప్పానని.. ఇప్పుడు 12 అవుతోందని.. ఫాస్ట్ గా వెళ్లాలని ఆఫీసుకు బయలుదేరతాడు. కావ్యను ఏడిపించినందుకే నీకు అలా అయ్యిందని శ్వేత సీరియస్ అవుతుంది. ఇక.. రాజ్ చాలా ఫాస్ట్ గా ఆఫీసుకు వస్తూ ఉంటాడు. మరోవైపు ఆఫీసులో క్లైంట్ ఎదురుచూస్తూ ఉంటారు. సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే డినైజర్ శ్రుతి వచ్చి.. కావ్య మేడమ్ కి ఈ ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసు అని చెబుతుంది.
Brahmamudi
అయితే.. వెంటనే సుభాష్.. కావ్య దగ్గరకు వచ్చి క్లైంట్స్ తో మాట్లాడమని చెబుతాడు. అందుకు కావ్య భయపడుతుంది. రాజ్ తిడతాడేమో అని అంటుంది. వాడికి తాను చెబుతానని.. క్లైంట్స్ దగ్గరకు తీసుకువెళతారు. ఇక కావ్య.. డిజైన్స్ అన్నీ చేసింది తానే కాబట్టి.. వాళ్లకు మొత్తం వివరిస్తుంది. వాళ్లు కావ్య చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయ్యి.. ఆ డిజైన్స్ ఒకే చేస్తారు. దీంతో.. డీల్ ఒకే అవుతుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. ఇంట్లో అప్పూ తన చదువుకోసం ఉన్నవాటిలో అన్నీ సరద్దుకుంటూ ఉంటుంది. పుస్తకాలు కూడా సెకండ్ హ్యాండ్ వి తెప్పించుకుంటున్నట్లు మూర్తి, కనకం కి తెలుస్తుంది. అప్పూ.. డబ్బు ఆదా చేస్తూ.. తన కలను నిజం చేసుకోవడానికి కష్టపడుతోందని.. కళ్యాణ్ ని మర్చిపోయి.. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుందని.. కనకం, మూర్తి సంతోషిస్తారు.
Brahmamudi
మీటింగ్ తర్వాత.. క్లైంట్స్.. కావ్యను పొగుడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి రాజ్, శ్వేతలు వచ్చేస్తారు. వచ్చిన రాజ్ తో కూడా వాళ్లు కావ్య గొప్పతనాన్ని వివరిస్తారు. అది విని రాజ్ ముఖం మాడిపోతుంది. తర్వాత వాళ్లు వెళ్లిపోతారు.
వాళ్లు వెళ్లగానే.. సుభాష్.. రాజ్ ని తిట్టడం మొదలుపెడతాడు. ప్రకాశం... శ్వేతను చూసి ఎవరు అని అడుగుతాడు. అయితే.. కావ్య, కళ్యాణ్ లు ఇద్దరూ కలిసి సుభాష్ ముందు రాజ్, శ్వేతలను ఇరికించేస్తారు. మొత్తానికి ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకుంటారు. ఇక.. కావ్య వల్ల ప్రాజెక్ట్ దక్కిందని మెచ్చుకుంటారు. తర్వాత కావ్య.. కావాలనే మీ ఫ్రెండ్ ని మీ క్యాబిన్ కి తీసుకువెళ్లండి అని చెబుతుంది.
Brahmamudi
ఇక, కీస్ విషయంలో అనామిక, రుద్రాణి కావ్యకు వ్యతిరేకంగా ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. వెళ్లి..అగ్గిపెట్టమని రుద్రాణి చెప్పడంతో.. కీస్ తెచ్చి.. అపర్ణకు ఇస్తుంది. నీ దగ్గరకు ఎలా వచ్చాయ్ అని అపర్ణ అడిగితే.. బెడ్రూమ్ ముందు పడిపోయి కనిపించాయని చెబుతుంది. మంచి ఛాన్స్ దొరికిందని ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది.
Brahmamudi
అత్తగారి పెత్తనం ఇచ్చి ఒక్క పూట కూడా కాకముందే తాళాలు పాడేసుకుందని.. సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. కానీ.. ధాన్యలక్ష్మికి అపర్ణ పంచ్ మీద పంచ్ వేస్తుంది. ప్రకాశం మతి మరుపు టాపిక్ తీసుకువచ్చి మరీ సెటైర్ వేస్తుంది. ఆ తర్వాత రుద్రాణి మీద కౌంటర్ వేస్తుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్లి పది తులాల చైన్ పారేసుకొని వచ్చావ్ కదా అని ధాన్యలక్ష్మి గతంలో చేసిన తప్పులు ఎత్తిచూపుతుంది. తన కొడలు పొరపాటున పడేసుకుంది కానీ.. పొరపాట్లు చేసే మనిషి కాదు అని ఫుల్ సపోర్ట్ ఇస్తుంది
Brahmamudi
నా కోడలు కీ పడేసి ఉంటే ఏం చేసేదానివి అని ధాన్యలక్ష్మి అంటే.. అసలు నీ కోడలికి నేను ఎందుకు ఇస్తాను అని.. ఎప్పటికైనా ఇంటి పెత్తనం పెద్ద కోడలిదే అంటుంది. నువ్వు.. నా మీద కోపంతో నీ కోడలిని నెత్తిన ఎక్కించుకుంటున్నావ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. ఒకప్పుడు నువ్వు కూడా కావ్యను నెత్తిన పెట్టుకున్నావ్ కదా.. నా మీద కోపంతోనే పెట్టుకున్నావా అని అపర్ణ అడుగుతుంది. ఇక వీళ్లు వేసిన ప్లాన్ రివర్స్ అయ్యినందుకు రుద్రాణి, అనామిక ఫీలౌతారు.
ఎప్పటికైనా పెత్తనం పెద్ద కోడలిదే అంటే.. నేను వీళ్లకుదాసోహం అంటూ ఉండాలా అని అనామిక ఫీలౌతుంది. లాకర్ లో డబ్బులు పోయాయని తెలిస్తే.. అప్పుడు మీ పెద్ద అత్త విశ్వరూపం చూపిస్తుందలే అని రుద్రాణి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.