
Guppedantha manasu 13th December Episode:శైలేంద్ర చేసిన కుట్రలన్నింటినీ ధరణి ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. కానీ, అనుపమ నమ్మదు. అబద్దం చెబుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు ధరణి.. ఒట్టేసి మరీ చెబుతుంది. మొదటి నుంచి రిషిని చంపాలని చూశాడని చెబుతుంది. వెంటనే మహేంద్ర.. నీ ఫ్రెండ్ ని ఎవరు చంపారో చెప్పమని ప్రాణాలు తీశావ్ కదా.. ఇదే నిజం అని అంటాడు. తర్వాత అనుపమ.. దేని కోసం ఇదంతాచేశాడు అని అడుగుతుంది. ఎండీ పదవి కోసమే ఇలా చేశాడని, ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు ఎండీ పదవి మీద మోజు పెరిగిందని చెబుతుంది. శైలేంద్ర వచ్చిన తర్వాత జరిగిన అన్నింటినీ ఒక్కొక్కటిగా ధరణి వివరిస్తుంది.
అదంతా విన్న తర్వాత గతంలో అనుపమ.. వసుని ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన మాటలు గుర్తుకువస్తాయి. వెంటనే వసు దగ్గరికి వెళ్లి, క్షమాపణలు చెబుతుంది. జగతి విషయంలో నిన్ను అనుమానించానని, క్షమించమని అడుగుతుంది. నీగొప్పతనం ఈ రోజు తనకు అర్థమైందని చెబుతుంది. శైలేంద్ర ఎంత దుర్మార్గుడో తనకు ఇప్పుడు అర్థమైందంటుంది. ముకుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు శైలేంద్రపై కాస్త అనుమానం వచ్చిందని, కానీ, అతను మాట్లాడిన తర్వాత మళ్లీ అతను ఈ నేరం చేయలేదు అనే అనిపించింది, అంతలా మాయ చేసేలా అతని మాటలు ఉన్నాయి అని అనుపమ అంటుంది.
వెంటనే ధరణి‘ అతను అంతే మేడమ్. ఎవరినైనా మాటలతో మాయ చేయగలడు. నిజాన్ని అబ్ధం అని, అబద్ధాన్ని నిజం అని ఎవరైనా క్షణాల్లో నమించగలడు. ఇప్పటికైనా నిజం బయటకు రావాలి వసుధార. లేకుంటే ఎంత దారుణం అయినా జరగొచ్చు. అంతా జరిగిపోయాక ఏడుస్తూ కూర్చోవడం కంటే, ఈ విషయాలన్నీ బయటకు రావాలి. ఇంతకుముందేమో పెద్ద మామయ్య కోసం మీరు నోరు కట్టేసుకొని ఉన్నారు. మీరు చెబితే మామయ్య బాధపడతారేమో, ఆ బాధలో ఆయనకు ఏదైనా అవుతుందేమో అని, చెప్పకుండా ఉండిపోయారు. కానీ, ఇప్పుడు మామయ్యకి చెప్పాలన్నా, చెప్పలేని పరిస్థితిని మా మామయ్య క్రియేట్ చేశారు.’ అని ధరణిఅంటుంది.
‘ఫణీంద్ర సర్ కి చెబితే సరిపోదు. రిషి సర్ కూడా నమ్మాలి. రిషి సర్ సాక్ష్యాధారాలు చూస్తేనే నమ్ముతారు. లేదంటే, మనం ఎంత చెప్పినా నమ్మడు’ అని వసు అంటుంది. అసలు, సాక్ష్యాలతో చెబుదాం అన్నా.. రిషి లేడు కదా వసుధార, ముందు రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని మహేంద్ర అంటాడు.
‘ ఇందాక నాకు ముకుల్ చెప్పాడు. రిషి కారు సిటీ అవుట్ స్కర్ట్స్ లో కనపడిందట. కానీ, కిడ్నాప్ అయినట్లు ఏ ఆనవాలు కనపడేలదట. దాని గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అని చెప్పాడు’ అని అనుపమ చెబుతుంది. వెంటనే మహేంద్ర.. ఈ గందరగోళ పరిస్థితులు ఏంటి, రిషిని ఎలా కనిపెట్టాలి? శైలేంద్రను ఎలా నేరస్తుడని నిరూపించాలి అని బాధపడతాడు. తర్వాత.. వసు ధరణికి శైలేంద్ర దగ్గర జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు.
మరోవైపు శైలేంద్ర.. ధరణి కోసం పిలుస్తూ ఉంటాడు. దేవయాణి వస్తుంది. ధరణి కనపడటం లేదు అని అడుగుతాడు...ఇంట్లోనే ఏదో ఒక మూల పడి ఉంటుందిలే అని, ఈ మధ్య ధరణి జపం చేస్తున్నావ్ అని కొడుకుపై సీరియస్ అవుతుంది. దానికి శైలేంద్ర.. తాను తప్పక చేస్తున్నానని, తన యాక్టింగ్ బయటపడకుండా ఉండాలంటే ధరణిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలని , అందుకే ఒక్క క్షణం ధరణి కనిపించకపోయినా తనకు కష్టంగా ఉంటుదని చెబుతాడు.
తర్వాత దేవయాణి... రిషి గురించి ప్రశ్నలు వేస్తుంది. ‘ మమ్మీ..నువ్వు ఎప్పుడూ వాడు ఏదో చేస్తాడని బయపడుతున్నావ్ కదా, కానీ, ఇప్పుడు వాడు అసలు కనిపించడమే లేదు కదా’ అంటాడు. వెంటనే దేవయాణి.. రిషిని నువ్వే కిడ్నాప్ చేశావా? వాడిని తప్పించాల్సిన అవసరం మనకు తప్ప మరొకరికి లేదని, కిడ్నాప్ మాత్రమే చేశావా? చంపేశావా అని అడుగుతుంది. అయితే, శైలేంద్ర.. తన తల్లి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం సరిగా చెప్పడు. అందరిలాగానే రిషి ఏమయ్యాడనేది తెలియాలంటే కొంత కాలం మనం కూడా ఎదురుచూడాల్సిందేనని చెబుతాడు. అయితే, తాను అడిగిన ఏ ప్రశ్నకు కొడుకు సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని దేవయాణి హర్ట్ అవుతుంది. నువ్వు నా దగ్గరఅన్నీ దాచిపెడుతున్నావ్, నాకేమీ చెప్పడం లేదని ఫీలౌతుంది.‘చెప్పేది జాగ్రత్తగా విను, రిషి వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు, అంతా నేను చూసుకుంటాను’ అని శైలేంద్ర.. దేవయాణికి భరోసా ఇస్తాడు.
తర్వాత మళ్లీ ధరణి గురించి అడుగుతాడు. దేవయాణి తనకు తెలీదని చెబితే, ఎక్కడికి వెళ్లిందా అని టెన్షన్ పడతాడు. అప్పుడే సరిగ్గా ఇక్కడే ఉన్నాను అనుకుంటూ ధరణి వస్తుంది. పక్కనే వసుధార కూడా ఉంటుంది. అది చూసి కాస్త భయపడతాడు. నువ్వెందుకు వచ్చావ్ అని వసుధారను అడుగుతుంది. తర్వాత ధరణిని కాఫీ తెమ్మని వసు పంపిస్తుంది. శైలేంద్రతో మాట్లాడాలని.. దేవయాణిని పక్కకు వెళ్లమని అడుగుతుంది. కొడుకు సైగతో దేవయాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు మహేంద్ర, అనుపమ కూర్చొని ఉంటారు. గతంలో జగతిగురించి తాను అడిగిన ప్రశ్నలను అనుపమ తలుచుకొని, బాధపడుతుంది. నిన్ను చాలా బాధపెట్టానని ఈ విషయాలు తెలుసుకోలేకపోయానని బాధపడుతుంది. వెంటనే క్షమాపణలు చెబుతుంది. మహేంద్ర పర్వాలేదు అనుపమ అంటాడు. కానీ, నువ్వు నన్ను క్షమించాల్సిందేనని పట్టుపడుతుంది. రిషిని కనిపెట్టడంలో సహాయపడతానని, వసుధారకు అండగా ఉంటానని ధైర్యం చెబుతుంది.
తర్వాతి సీన్ లో వసుధార, శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. విషయం ఏంటో చెప్పు అని శైలేంద్ర అడిగితే.. వసుధార రిషి ఎక్కడ అని అడుగుతుంది. ‘నాకు కావాల్సింది కూడా అదే వసుధార, రిషి ఎక్కడ? నాకు గాయాలు అయినా చూడటానికి రాకపోయే సరికి ఆశ్చర్యం వేసింది. అయితే ఎవరికీ రిషి ఎక్కడున్నాడో తెలియకపోవడంతో నాకు ఆనందం వేసింది అంతేకానీ, రిషి ఎక్కడున్నాడో నిజంగా నాకు తెలీదు’ అని శైలేంద్ర అంటాడు.
కానీ,వసు ఒప్పుకోదు. రిషి సర్ ఎక్కడ ఉన్నాడు అని నిలదీస్తుంది.నీకు తెలసు అని నాకు తెలుసు... పక్కాగా తెలుసు అని అంటుంది. అయితే, నిరూపించు అంటాడు. నువ్వు కోపంగా చూస్తే నేను భయపడను అని డైలాగులు కొడతాడు. ఇద్దరూ కాసేపు ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటారు. ఎంతసేపు అడిగినా, రిషి గురించి శైలేంద్ర ఏదీ చెప్పడు. ఎన్నిసార్లు అడిగినా, రిషి గురించి తనకు తెలీదంటాడు. దాంటో ఇరిటేట్ అయిన వసు.. శైలేంద్రను చంపేస్తా అంటుంది. దానికి నన్ను చంపితే, రిషి అక్కడ సేఫ్ గా ఉంటాడని అనుకుంటున్నావా అని అంటాడు. దానికి వసు ఆగిపోతుంది. మళ్లీ.. రిషి గురించి చెప్పమని కాస్త కూల్ గా అడుగుతుంది. మర్యాదగా అడగడం లేదని, ఈగో తో అడుగుతున్నావ్ అని శైలేంద్ర అంటాడు.రెండు చేతులు చాపి, అడుక్కున్నట్లు అడిగితే మాత్రమే చెప్పాలో వద్దో ఆలోచిస్తాను అంటాడు. దీంతో, కాస్త తగ్గి, మంచిగా అడిగే ప్రయత్నం చేస్తుంది. వసు తగ్గిన కొద్దీ.. శైలేంద్ర తనను ఆడుకుంటాడు. ఎంత తగ్గి అడిగినా, రిషి గురించి మాత్రం అస్సలు బయటపెట్టడు. ఆఖరికి చేతులు మొక్కిమరీ అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.