Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..

Published : Sep 10, 2026, 12:31 PM IST

Bigg Boss 10: బిగ్ బాస్ కి కామనర్స్ అంటే చులకనా? జనాల ఓట్లతో సంబంధం లేకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారు? సెలబ్రిటీలకు ఒక న్యాయం, కామనర్స్ కి ఒక న్యాయమా? ఓటింగ్ లేకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారు?

PREV
13
కామనర్స్ కే ఎందుకు ఇంత అన్యాయం?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అంటేనే బిగ్ ట్విస్టులు, డ్రామా, మైండ్ గేమ్ లకు అడ్డా. అయితే.. ఈ షోకి ఉన్న అతి పెద్ద బలం ప్రేక్షకులే. ఎందుకంటే, గేమ్ ఆడేది లోపల ఉండే కంటెస్టెంట్స్ అయినా... ఎవరు ఎలిమినేట్ అవ్వాలి..? ఎవరు విన్నర్ అవ్వాలి అని డిసైడ్ చేసేది మాత్రమే జనాలే. ఈ గేమ్ ని అంతలా ఆడియన్స్ ఓన్ చేసుకొని మరీ ఓటింగ్ చేస్తూ ఉంటారు. ప్రజలు వేసే ఆధారంగానే ఎలిమినేషన్లు జరుగుతాయని, విన్నర్ డిసైడ్ అవుతారని బిగ్ బాస్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ, ఇటీవల కాలంలో బిగ్ బాస్ యాజమాన్యం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఈ ఓటింగ్ వ్యవస్థపై తీవ్ర అనుమానాలను రేకిస్తున్నాయి. ముఖ్యంగా కామనర్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెడుతున్న కంటెస్టెంట్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

23
ఓటింగ్ తో సంబంధం లేని ఎలిమినేషన్లు:

సాధారణంగా నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారు ఎలిమినేట్ అవ్వడం అనవాయితీ. కానీ గత సీజన్‌లో శ్రీజ, అలాగే ఈ సీజన్‌లో చరణ్ విషయంలో జరిగింది మాత్రం వేరు. ప్రేక్షకులలో వీరికి మంచి ఆదరణ, నామినేషన్లలో మంచి ఓటింగ్ నమోదవుతున్నప్పటికీ.. ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా వీరిని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. టాస్కులు, లేదా ఇతర అంతర్గత కారణాలను చూపిస్తూ బిగ్ బాస్ నేరుగా ఎలిమినేట్ చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

33
సెలబ్రిటీలకి ఒక న్యాయం.. కామనర్స్‌కి మరో న్యాయమా?

ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.. ఈ విధమైన అన్యాయమైన ఎలిమినేషన్లు కేవలం కామనర్ల విషయంలోనే ఎందుకు జరుగుతున్నాయి? సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎంత సరిగా ఆడకపోయినా, ఓటింగ్ తక్కువగా ఉన్నా వారిని కాపాడుకోవడానికి రకరకాల అవకాశాలు కల్పిస్తారు. కానీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని, గట్టి పోటీ ఇస్తున్న కామనర్లను మాత్రం ఓటింగ్‌తో సంబంధం లేకుండా అర్ధాంతరంగా సాగనంపుతున్నారు.

కామనర్స్‌ను తక్కువ చేసి చూస్తున్నారా?

"మేము కూడా సెలబ్రిటీలతో సమానంగా పోటీ పడగలము" అని నిరూపించుకోవడానికి వచ్చే సామాన్యులను బిగ్ బాస్ టీమ్ చులకనగా చూస్తోందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. కామనర్స్‌కు ఓటింగ్ బాగా ఉన్నప్పటికీ కావాలనే టార్గెట్ చేసి పంపించేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో బాగా నడుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories