Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని ఓ బిగ్ ట్విస్ట్ ఈ సీజన్ 10లో జరగబోతోంది. మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి.. ఇద్దరిని ఇంటికి పంపేయనున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆల్రెడీ మొదలైంది. మొదలైన మొదటి రోజు నుంచే హౌస్ లో గొడవలతో రణరంగంలా మారిపోయింది. హౌస్ లో ఇప్పటి వరకు 16 మంది కంటెస్టెంట్స్ ఈ హౌస్ లోకి అడుగుపెట్టారు. వారిలో 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఏ సీజన్ లోనూ ఇవ్వని బిగ్ ట్విస్ట్ ని ఇవ్వబోతున్నారు. మొదటి వారంలో హౌస్ లో ఉన్న అందరినీ నామినేషన్స్ లో పెట్టిన బిగ్ బాస్.. డబుల్ ఎలిమినేషన్ కూడా పెట్టనున్నాడు.
24
మహా పరీక్ష టాస్క్.. హై రిస్క్ జోన్ లో ఎవరు?
ప్రస్తుతం హౌస్‌లో నడుస్తున్న 'మహా పరీక్ష' టాస్క్ ఆధారంగా సరిగా ఆడని వారిని బిగ్ బాస్ 'హై రిస్క్ జోన్' లో పెడుతున్నారు.ఈ టాస్క్ పనితీరు ఆధారంగా ఇప్పటికే చరణ్, ఆటో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈరోజు జరిగే నెక్స్ట్ లెవెల్ టాస్క్ ద్వారా మరో ఇద్దరిని హై రిస్క్ జోన్‌లోకి పంపే అవకాశం కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటివరకూ లేని విధంగా మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో మొదటి వారంలో ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ.. ఇలా మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇప్పటి వరకు జరగలేదు. కానీ, ఈసారి మహా పరీక్ష పేరిట అదే చేయబోతున్నారని తెలుస్తోంది.
34
డేంజర్ జోన్ లో చరణ్..
హై రిస్క్ లో ఉన్నవారే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఎక్కువ చరణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. చరణ్ కి ఓటింగ్ శాతం బాగానే ఉన్నా.. హై రిస్క్ లో ఉండటం, హౌస్ లో చాలా డల్ గా ఉండటంతో.. అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. చరణ్ తో పాటు.. ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న కృష్ణుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అతనికి చాలా తక్కువ ఓటింగ్ పడుతోంది. అందులోనూ కృష్ణడి ఆట తీరు కూడా పెద్దగా ఏమీ లేదు. త్రిగుణ్ ఏం చెబుతున్నాడో అది మాత్రమే ఫాలో అవుతున్నాడని, రోహిత్ కి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా జనాలకు నచ్చడం లేదు. అందుకే.. అతను ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది.
వీరితో పాటు.. కామనర్స్ కేటగిరిలో వచ్చిన ఝాన్సీకి కూడా ఓట్లు చాలా తక్కువగానే పడుతున్నాయి. కానీ, ఆమెకు నామినేషన్స్ నుంచి బయట పడే ఓ పవర్ ఉంది. కాబట్టి, మరో రెండు మూడు వారాలు ఆమె హౌస్ లో కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. మరి, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి.
ఇక.. ఈ డబుల్ ఎలిమినేషన్ తర్వాత.. వెంటనే ఇద్దరిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోపలికి పంపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇద్దరి ఎలిమినేషన్ తర్వాత.. నందూస్ వరల్డ్ నందు, ఇక.. అగ్ని పరీక్ష కంటెస్టెంట్ మిథిలేష్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ లు ఉన్నాయి. అంతేకాకుండా, మరో రెండు వారాల తర్వాత అపూర్వ, రామకృష్ణ కూడా హౌస్ లోకి వస్తారనే టాక్ వినపడుతుంది. చూడాలి మరీ.. ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో...